కడపలో భారీ అగ్ని ప్రమాదం
కడప అర్బన్ :
కడప నగర శివార్లలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో వెంకటేశ్వర బయో క్రూడ్స్ సంస్థలో శుక్రవారం ఉదయం ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఏర్పడ్డ మంటల వల్ల ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 8 నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ సంఘటనపై సంస్థ యజమాని శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థలో పరిశ్రమలకు ఉపయోగపడే ఇండస్ట్రియల్ ప్యూయల్స్‌ను టైర్ల ద్వారా తయారు చేస్తామన్నారు. సంఘటన జరిగిన గంట తర్వాత గుర్తించామన్నారు. అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించామన్నారు. వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారన్నారు. రెందు గంటలపాటు శ్రమించగా ఇంకా ప్రభావం అలాగే వుందన్నారు. మూడేళ్ల క్రితం తమ ఫ్యాక్టరీలోనే యంత్రాలలో మంటలు ఏర్పడి ప్రమాదం జరిగిందన్నారు. తర్వాత శనివారం నుంచి మరలా పరిశ్రమను నడిపేందుకు మెటీరియల్ తెప్పించుకున్నామన్నారు. తమ సంస్థ ఆవరణంలోనే వున్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి అపుడపుడు మంటలు వస్తున్నాయనీ విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చామన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు డ్యూటీకి వచ్చేవారు ట్రాన్స్‌ఫార్మర్ ట్రిప్ కాకుండా చూస్తారనీ తెలిపారన్నారు. అంతలోపు ప్రమాదం జరిగిందన్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు :
ఈ ప్రమాదంపై సమాచారం అందగానే అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ముందుగా విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. అప్పటికే చెలరేగుతున్న మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదం స్థలాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి విజయకుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ఈయనతోపాటు కడప అగ్నిమాపక అధికారి నాగరాజు నాయక్, ఎల్‌ఎఫ్‌ఎం వెంకట సుబ్బయ్యతో పాటు నరసింహులు, రామచంద్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.సంఘటన స్థలాన్ని కడప ఆర్డీఓ చిన్నరాముడు తమ సిబ్బందితో పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానాన్ని బాధితుడు అధికారులకు తెలియజేశారు.
– ఫోటో రైటప్ 26 కెడిపి 704, 705– సంఘటనా స్థలంలో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
26 కెడిపి 706– అధికారులకు సంఘటన గురించి వివరిస్తున్న బాధితుడు శ్యాం సుందర్ రెడ్డి