బొల్లాపల్లి (నెల్లూరు): బొల్లాపల్లి మండలం పాత వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి బ్రహ్మయ్య(23) అనే యువరైతు గురువారం మృతిచెందాడు. నిమ్మతోటకు నీరు తోడుతుండగా కాలుజారి అందులో పడిపోయాడు. ఆ సమయంలో వ్యవసాయబావి వద్ద ఎవరూ లేకపోవడంతో కాసేపటికే ప్రాణాలొదిలాడు.