మన జీవితం.. మన చేతుల్లోనే..! | Your life in your hand.. | Sakshi
Sakshi News home page

మన జీవితం.. మన చేతుల్లోనే..!

Published Wed, Aug 26 2015 4:17 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

మన జీవితం.. మన చేతుల్లోనే..! - Sakshi

మన జీవితం.. మన చేతుల్లోనే..!

- ఉమేష్‌చంద్ర, జయప్రకాశ్ నారాయణే నాకు స్పూర్తి
- సన్మానసభలో సివిల్స్‌విజేత పాతకోట విజయ భాస్కర్ రెడ్డి
చాపాడు :
ఎవరి జీవితమైనా వారి చేతుల్లోనే ఉంటుందని.. విద్యార్థి దశ నుంచే పాజిటివ్ థింకింగ్‌తో చదుకుంటూ పోతే ఎలాంటి విజయమైనా సాధించవచ్చని ప్రొద్దుటూరుకు చెందిన సివిల్స్ విజేత పాతకోట విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నగురువళూరు గ్రామంలోని శ్రీస్వామి వివేకానందా విద్యానికేతన్‌లో కరస్పాండెంటు నాగేశ్వరరెడ్డి మంగళవారం ఆయనకు సన్మానించారు.

ఈ సందర్భంగా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్ ఎలాంటివాటినైనా సాధించవచ్చన్నారు. పేపర్లలో చదివి ఐపీఎస్ ఉమేష్‌చంద్ర, ఐఏఎస్ జయప్రకాశ్‌నారాయణ వంటి వారి స్పూర్తితో ఐఏఎస్ సాధించానన్నారు. ప్రతి రోజూ 13గంటలకు పైగా చదవివానని, రెండు సార్లు విఫలమైన మూడో సారి ఐఏఎస్‌కు ఎంపికయ్యానన్నారు. సమాజం కోసం సేవ చేయాలనే తపన గాంధీ, మధర్‌థెరిసా, వివేకానందుడు వారి స్ఫూర్తితో వచ్చిందన్నారు.
 
విద్యార్థి దశ నుంచే ప్రిపేరైతే సులువు:
విద్యార్థి దశ నుంచే ఫలాణా రంగంలో రాణించాలనే తలంపుతో ప్రిపిరైతే ఐఏఎస్, ఐపీఎస్ ఇలా ఏదైనా సాధ్యమవుతున్నారు. చిన్న అంశాన్ని బట్టి వ్యాసం రాయటం అలవర్చుకోవాలన్నారు. సమాజం పట్ల చిన్నతనం నుంచే అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇంగ్లీషు భాషపై పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. పోటీ ప్రపంచంలో ముందుండాలంటే అన్ని రంగాలలోనూ అవగాహన కల్పించుకోవాలన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిన పలు ప్రశ్నలకు ఐఏఎస్ విజయాభాస్కర్‌రెడ్డి సమాధానాలు ఇచ్చి స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద విద్యానికేతన్ హెచ్‌ఎం సుబ్రమణ్యం, డీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్ నాయభ్స్రూల్, కవి జింకా సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement