యువత రాజకీయాల్లోకి రావాలి
మాజీ న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు
సాక్షి, హైదరాబాద్: భారత్‌ను నూతన ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని మాజీ న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు పిలుపునిచ్చారు. కాచిగూడలోని వైశ్య హాస్టల్‌లో ఆదివారం ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) హైదరాబాద్ అధ్యక్షుడు గట్టు వీరేశం అధ్యక్షతన ఏర్పాటైన చర్చా వేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వైశ్యులు ఆయా పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకుంటే, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు వైశ్య సంఘాలు కృషి చేస్తాయని ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గట్టు సుభాష్, గంజి రాజమౌళి గుప్త, జి.ధనుంజయ్, వేలూరు రవీంద్రనాథ్ గుప్త, అశోక్‌కుమార్, కాచం సత్యనారాయణ, ఉప్పాల శారద, ఆర్.గణేష్ గుప్త, రమేష్‌రాము, చింతల రవికుమార్, బచ్చు శ్రీనివాస్, యేలకంటి ప్రభు, పురం వెంకటేశం గుప్త, బిజాల రమేష్, పోకల చందర్ తదితర వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.