హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిరుద్యోగులకు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ ఎం పద్మ తెలిపారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సెంటర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తూర్పుగోదావరి రాజమహేంద్రవరంలో వైటీసీని ప్రారంభిస్తారని ఆమె చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 గిరిజన సంక్షేమ హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మారుస్తున్నట్టు చెప్పారు. పదోతరగతిలో మంచి ఫలితాలు సాధించిన గిరిజన సంక్షేమ హాస్టళ్ల బాల బాలికలకు టాబ్‌లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వీటిని సీఎం చంద్రబాబు బుధవారం రాజమహేంద్రవరంలో ఇస్తారన్నారు. పదికి పది పాయింట్లు వచ్చిన వారు కూడా ఒకరు ఉన్నారని తెలిపారు.