
సహాయక చర్యలు చేపట్టాలని జగన్ పిలుపు
హైదరాబాద్: విజయనగరం జిల్లా గొట్లాంలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఈ ప్రమాదంలో ఎక్కువ మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆదుకోవాలని పిలుపు ఇచ్చారు. క్షతగాత్రులకు రక్తం కావలసి ఉంటుందని, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.