
సాక్షి, అమరావతి: పెథాయ్ తుపాను బాధితులకు పార్టీ నాయకులందరూ అండగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాదయాత్రలో ఉన్న ఆయన పెథాయ్ తుపాను ప్రభావం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
తీరందాటిన సమయంలో గాలుల వేగం, వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, రైతుల పరిస్థితిపై ఆయా ప్రాంతాల నాయకుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. పలువురు పార్టీ నాయకులతో ప్రతిపక్ష నేత ఫోన్లో మాట్లాడారు. పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో తిరిగి నష్టాన్ని అంచనా వేయాలని, బాధితులకు, రైతులకు అండగా ఉండాలని ఆదేశించారు. పంటలు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయి సహాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment