వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి పరంగా విఘ్నాలు తొలగిపోయి అన్నీ విజయాలే సిద్ధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.
Happy Vinayaka Chavithi to one and all. May this Ganesh Chaturthi bring peace & prosperity to you.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 25 August 2017
తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ... రెండు రాష్ట్రాల ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని మనసారా కోరుకున్నారు. రెండు రాష్ట్రాలకు విఘ్నాలు తొలగిపోయి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.