సాక్షి, హైదరాబాద్: తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మరణవార్త తెలియగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. బాబాయ్ మరణంతో తీవ్రంగా కలత చెందిన ఆయన అభ్యర్థుల ఎంపిక కసరత్తును పక్కనపెట్టి పులివెందులకు వెళ్లారు. మరోవైపు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల కూడా రోడ్డు మార్గాన పులివెందులకు బయలు దేరారు.
కాగా, వైఎస్ వివేకానందరెడ్డి భౌతిక కాయానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణం పట్ల అనుమానాలు వ్యక్తం కావడంతో పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
సంబంధిత కథనాలు
వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత
నిన్న కూడా ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా
వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఫిర్యాదు
అనుమానాస్పద మృతిగా భావిస్తున్నాం: విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment