జగన్ సీఎం కావడమే లక్ష్యం | ys jagan mohan reddy CM to becoming Target | Sakshi
Sakshi News home page

జగన్ సీఎం కావడమే లక్ష్యం

Published Tue, Feb 25 2014 2:13 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ys jagan mohan reddy  CM  to becoming Target

బొబ్బిలి, న్యూస్‌లైన్: ప్రజల బాగోగులు గురించి నిత్యం ఆలోచిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం అహర్నిశలు ఆరాటపడిన వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైఎస్‌ఆర్‌సీపీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త ఆర్వీఎస్‌కేకే రంగారావు (బేబినాయన) పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని బాడంగి మండలం పినపెంకిలో కాంగ్రెస్ పార్టీ లో కీలకంగా వ్యవహరించే ఇద్దరు మాజీ వార్డు సభ్యులు బోనుమద్ది సింహాచలం, అల్లు సీతంనాయుడు వారి అనుచరులతో ఆ పార్టీని వీడి సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. 
 
 వీరికి బేబినాయన పార్టీ కండువా వేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ లేని లోటు నేడు దేశ ప్రజలందరికీ తెలుస్తోందన్నారు. ఆ మహానేత ఉండి ఉంటే ఈ రోజు రాష్ట్రం ఇంత అల్లకల్లోలం అయ్యేది కాదని, తెలంగాణ సమస్య కూడా తెరమీదకు వచ్చి ఉండేది కాదన్నారు. ఆంధ్ర ప్రజలను మోసం చేసిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వారు ఓట్ల కోసం అనేక జిమ్మిక్కులతో ప్రజల ముందుకు వస్తారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అల్లు కృష్ణ, బోనుమద్ది సత్యం, చింతాడ సాంబమూర్తి తదితరులు 40 కుటుంబాలతో పార్టీలో చేరారు. కార్యక్రమంలో నర్సుపల్లి వెంకటేశ్వరరావు, మర్రాపు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
 
 బేబినాయనకు ఘన స్వాగతం
 జి.అగ్రహారం (చీపురుపల్లి): వైఎస్‌ఆర్‌సీపీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి, తొలిసారి చీపురుపల్లి వచ్చిన బేబినాయనకు ఆ పార్టీ స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. సోమవారం బేబినాయన చీపురుపల్లి వస్తున్న సందర్భంగా పట్టణ శివారుల్లోని అగ్రహారం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మీసాల వరహాలనాయుడు, వాకాడ శ్రీను, శనపతి శిమ్మినాయుడు, కరణం మురళి తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పూలమాలలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార కమిటీ సభ్యులు కర్రోతు రమణ, మన్నెపురి ఉమామహేశ్వరరావు(చిట్టి), గరివిడి మండల కన్వీనరు సి.హెచ్.సత్యనారాయణరెడ్డి, దళిత నాయకుడు కాంతారావు, జమ్ము బంగారి, బలగ సూరిబాబు, గవిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement