
సాక్షి, అమరావతి: రాయలసీమ కరువు నివారణకు అవసరమైన ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం వైఎస్ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. బనకచర్ల, వెలిగొండ, జీఎన్‌ఎస్‌ఎస్, నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజి, అవుకు టన్నెల్, గండికోట టన్నెల్, పెన్నా, వంశధార పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందని, ప్రస్తుతం ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం వైఎస్ జగన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో ముందుగా చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌లపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. (సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: టీజీ వెంకటేశ్)
ఏ ప్రాజెక్టుకు ఎంత నిర్మాణ వ్యయం అవుతుందనే వివరాలను సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలుండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వివరాలు, పురోగతిపై సీఎం జగన్ సమీక్షించారు. వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు సైతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా, బనకచర్ల అనుసంధానంపై ప్రణాళిక వివారాలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. వీలైనంత తక్కువ ఖర్చులో ఎక్కువ లబ్ధి పొందేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (సీమ కరువుకు ‘రాయలసీమ’తో చెక్)
Comments
Please login to add a commentAdd a comment