చిత్తశుద్ధితో కృషి చేయండి | ys jagan mohan reddy discuss with party leaders | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధితో కృషి చేయండి

Published Tue, Apr 18 2017 9:22 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM

చిత్తశుద్ధితో కృషి చేయండి - Sakshi

చిత్తశుద్ధితో కృషి చేయండి

► గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమం పూర్తి చేయండి
► ప్రజల కోసం అంకితభావంతో వ్యవహరించండి
► వైఎస్సార్‌సీపీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం 

సాక్షి ప్రతినిధి, కడప: ‘ప్రజల కోసం, పార్టీ కోసం చిత్తశుద్ధితో కృషి చేయండి. ప్రజాసమస్యల పట్ల అంకితభావంతో వ్యవహరించండి. గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా కొనసాగించండి, గ్రామ కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వండి’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులతో సోమవారం హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి, పార్లమెంటుసభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీనియర్‌ నేత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, కడప మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి కల్లూరు నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని, గ్రా మ కమిటీలు తప్పనిసరిగా వేయాలని సూచించారు.

గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమం ఆయా నియోజకవర్గాల్లో క్ర మం తప్పకుండా చేపట్టాలన్నారు. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే ప్రజా సమస్యలు సైతం పరిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ కమిటీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement