వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండు రోజుల పాటు వైఎస్‌ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు.
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు (రేపు, ఎల్లుండి) వైఎస్‌ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు (సెప్టెంబర్ 2వ తేదీ) దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్తో పాటు కుటుంబసభ్యులు నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందులలో ‘వైఎస్‌ఆర్ కుటుంబం’ కార్యక్రమాన్ని జననేత ప్రారంభించనున్నారు. అలాగే 3వ తేదీ ఆదివారం పులివెందుల నియోజకవర్గ ప్రజలతో వైఎస్ జగన్ సమావేశం అవుతారు.