నిలకడగానే వైఎస్ జగన్ ఆరోగ్యం: జైలు అధికారులు
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిరంకుశ నిర్ణయానికి నిరసనగా చంచల్ గూడ జైల్లో ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ ను జైలు అధికారులు విడుదల చేశారు.
వైఎస్ జగన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, బీపీ, షుగర్ పల్స్ రేట్ సాధారణ స్థాయిలో ఉన్నాయని జైలు అధికారులు వెల్లడించారు. వైఎస్ జగన్ దీక్ష చేపట్టి అరువై గంటలు దాటింది. అయితే వైఎస్ జగన్ ఆరోగ్యం సాధారణ స్థాయిలో ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని జైలు అధికారులు మీడియాకు తెలిపారు.