
ఉదయం 9.30గం. నిమ్స్ నుంచి జగన్ డిశ్చార్జ్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 9.30 గంటలకు నిమ్స్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఆమరణ నిరాహార దీక్ష భగ్నం తర్వాత ఆయన నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రానికి సమన్యాయం చేయాలంటూ చేపట్టిన జగన్ దీక్షను పోలీసుల భగ్నం చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. కాగా కొద్ది రోజుల వ్యవధిలోనే జగన్ రెండోసారి దీక్ష దిగడంతో అది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో జగన్ ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేందుకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.