సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎవ్వరూ అధైర్యపడొద్దు.. తిత్లీ తుఫాన్ బాధితులందరికీ అన్నగా.. అండదండగా నేనుంటా’ అంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటన తిత్లీ బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్‌పై భరోసా కలిగించింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పలాస బహిరంగ సభ సాక్షిగా తిత్లీ తుఫాన్ బాధితులపై వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిత్లీ బాధితులకు పూర్తి స్థాయిలో ఆదుకుంటానని ప్రకటించారు. ఇదే సభ సాక్షిగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి అక్రమాలు, లోకల్ ట్యాక్సుల వసూళ్లపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడంతో స్థానికులు, వ్యా పారుల నుంచి మంచి స్పందన కన్పించింది. ఆదివారం ఉదయం పలాస మండలం ఉం డ్రుకుడియా నుంచి పాదయాత్ర ప్రారంభం కా గా, కాశీబుగ్గ పట్టణం మీదుగా వజ్రపుకొత్తూరు మండలం రాజం కాలనీ వద్ద వరకు యాత్ర సా గింది. యాత్ర పొడవునా భారీగా జనం తరలివచ్చి జగన్‌కు తమ మద్దతును ప్రకటించారు. కె.టి. రోడ్డులో నిర్వహించిన ఈ సభలో పెద్ద సంఖ్యలో మహిళలు, తిత్లీ తుఫాన్ బాధితులు పాల్గొన్నారు.
అల్లుడి గిల్లుడి వ్యవహారంపై ధ్వజం
దేశంలోనే పలాస జీడిపప్పు ప్రసిద్ధి అంటూనే.. ఇక్కడ జీఎస్టీతో పాటు టీడీపీ నేతల లోకల్ ట్యా క్స్‌ల వసూళ్లపై జగన్ ధ్వజమెత్తడం స్థానికంగా చర్చలకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే శివాజీ అల్లుడి గిల్లుడు దారుణంగా ఉందని, దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని జగన్ ధ్వజమెత్తడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమైంది. ఒక కిలో జీడిపప్పుపై ఒక రూపాయి చొ ప్పున వి.సి (వెంకన్న చౌదరి) లోకల్ ట్యాక్స్ విధించడంపై కూడా జగన్ ధ్వజమెత్తారు. ‘ డీజిల్ అయినా పెట్రోల్ అయినా వి.సి బంకుల్లోనే పోయించుకోవాలని..’ నిబంధనలు పెట్టడంపై కూడా జగన్ ప్రస్తావించారు.
పాల్గొన్న నేతలు
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం పా దయాత్రతో పాటు బహిరంగ సభలో పలు వురు నేతలు జగన్‌ను కలిసి సంఘీబావం ప్రకటించా రు. పలువురు జగన్‌తో కలిసి అడుగులు వేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, రెడ్డి శాంతి, శ్రీ కాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీ తారాం, పీఏసీ సభ్యుడు «ధర్మాన కృష్ణదాస్, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు చింతాడ మం జు, పలాస, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, ముఖ్య నేతలు అంధవరపు సూరిబాబు, తమ్మినేని చిరంజీవి నాగ్, ఎన్ని ధనుంజయ, హనుమంతు కిరణ్‌కుమార్, పలాస పిఎసిఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ (బాబా), మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దువ్వాడ శ్రీకాంత్, బెల్లాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉద్దానం బాధితులపై వరాల జల్లు
జిల్లాలో తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని జగన్ అన్నారు. తనను కలిసిన బాధితులు చెప్పిన కష్టాలు విని చలించిపోయిన జగన్ వారికి అండగా ఉండేలా పలు వరాలను ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఉద్దానంలో ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ కొత్త ఇళ్లు మంజూరు చేస్తానని, అలాగే కొబ్బరి చెట్టుకు రూ. 3వేలు చొప్పున పరిహారాన్ని చెల్లిస్తామని జగన్ ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే జీడి తోటలు హెక్టార్‌కు రూ.50 వేల వరకు పరిహారం అందిస్తామని ప్రత్యేకంగా ప్రకటించడంతో జీడి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తిత్లీ తుఫాన్‌లో రూ. 3450 కోట్లు నష్టం గా భావించి కేంద్రానికి లేఖరాసిన చంద్రబాబు, కేవలం రూ. 500 కోట్లు మాత్రమే చెల్లించారని, అలాగే తుఫాన్ బాధితులకు చెక్కులను ఇచ్చినప్పటికీ, ఒక్క రూపాయి కూడా వెయ్యలేదని జగన్ అనడంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తిత్లీ తుఫాన్ నష్ట పరిహారాల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శవాల మీద చిల్లర ఏరుకునేలా దోచుకుంటున్నారడని విమర్శించడంపై తిత్లీ తుఫాన్ బాధితులు చప్పట్లతో మద్దతు ప్రకటించారు.
పలాసలో అరాచకాలు హెచ్చుమీరాయి
వజ్రపుకొత్తూరు/ కాశీబుగ్గ: పలాస నియోజకవర్గంలో రౌడీయిజం, అరాచకాలు హెచ్చుమీరా యని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం పలాస కేటీ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పలాసలో జగన్ కిడ్నీ వ్యాధి గ్రస్తుల కోసం రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. దీనిద్వారా కిడ్నీ వ్యాధి మూలలను కనుగొని శాశ్వతంగా సమస్య పరిష్కరించవచ్చని చెప్పారు. అలాగే కిడ్నీ బాధితుల పింఛన్‌ను కూడా పెంచుతామని అన్నారు.
ధర్మపోరాట దీక్ష కాదు.. నయవంచక దీక్ష
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నది ధర్మపోరాట దీక్ష కాదని నయవంచక దీక్ష అని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. నాలుగున్నరేళ్లు కేంద్రంతో కాపురం చేసి నాడు హోదా ఇస్తే ఏం వస్తుందని చెప్పిన పెద్దమనిషి నేడు అబద్ధాలు వల్లెవేస్తున్నారని అన్నారు. తిత్లీ తుఫాన్ ధాటికి రూ.3435 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా నివేదిక ఇచ్చి నేడు అందులో 15 శాతం సొమ్మును కూడా రైతులకు చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. నిధులు బొక్కేయడంలో ఆరితేరిన చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్‌ను కేంద్రం నమ్మడం లేదన్నారు.
జగన్‌ను సీఎం చేద్దాం
మనమంతా కలిసి జగన్‌మోహన్ రెడ్డిని సీఎం చేద్దామని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పలాస ప్రాంతానికి జుత్తు జగన్నాయకులు ఎన్నో సేవలు చేశారని, ఆయన మంచి ప్రజాదరణ కలిగిన నాయకుడన్నారు. అలాగే పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పరాజు జగన్నాయకులు అంతటి ప్రజాదరణ పొందుతారని అన్నారు.
సమస్యలు తీరనున్నాయి..
పలాస నియోజకవర్గ ప్రజల సమస్యలు మరికొద్ది రోజుల్లో తీరనున్నాయని పలాస సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస నియోజవర్గ పరిధిలో ఉన్న జీడికార్మికులు, వలసలు పోతున్న మత్సకారులు, ఉద్దాన కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలు, వ్యాపారులు, ఉద్దాన రైతులు, గిరిజనులు సమస్యలను జగన్ పాదయాత్రలో విన్నారని, తప్పనిసరిగా వాటిని పరిష్కరిస్తారన్నారు. అన్న అడుగుపెట్టడంతో పలాస పులకరించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment