హైదరాబాద్: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నుంచి రెండో విడత రైతు భరోసా యాత్ర నిర్వహిస్తారని ఆ పార్టీ రైతు నాయకుడు ఎమ్వీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... గిట్టుబాటు ధరలు లేక, రుణమాఫీ జరగకపోవడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని నాగిరెడ్డి ఆరోపించారు.
ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే వైఎస్ జగన్ రేపట్టి నుంచి రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే.