rythu bharosa yatra
-
రేపట్నుంచి కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల పక్షాన భరోసా యాత్ర చేపట్టాలని టీపీసీసీ కిసాన్ సెల్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో రైతాంగ సమస్యలే ఎజెండాగా ఈనెల 19 నుంచి యాత్రను ప్రారంభించనుంది. ఆదిలాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ యాత్ర ఆగస్టు 2న నిజామాబాద్‌లో ముగియనుంది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాట కార్యాచరణను రూపొందించటంతో పాటు ఆయా జిల్లాల రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందన్న దానిపై స్పష్టత ఇచ్చేందుకు గాను ‘రైతు భరోసా యాత్ర’ను చేపడుతున్నట్టు టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు సుంకెట అన్వేశ్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. యాత్ర షెడ్యూల్ ఇలా.. టీపీసీసీ సోమవారం ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న సాయంత్రం ఆదిలాబాద్‌లో యాత్ర ప్రారంభం కానుంది. 20న ఆసిఫాబాద్, మంచిర్యాల, 21న జగిత్యాల, సిరిసిల్ల, 22న సిద్దిపేట, జనగామ, 23న హనుమకొండ, వరంగల్, 24న పెద్దపల్లి, భూపాలపల్లి, 25వ తేదీన ములుగు, మహబూబాబాద్, 26న కొత్తగూడెం, ఖమ్మం, 27న సూర్యాపేట, యాదాద్రి, 28వ తేదీన రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, 29న వనపర్తి, గద్వాల, 30న మహబూబ్‌నగర్, నారాయణపేట, 31న వికారాబాద్, సంగారెడ్డి, ఆగస్టు1న మెదక్, కామారెడ్డిల మీదుగా ఆగస్టు 2వ తేదీన నిజామాబాద్ జిల్లాలో యాత్ర ముగించనున్నారు. కాగా, రైతు భరోసా యాత్ర ముగింపు సందర్భంగా నిజామాబాద్‌లో భారీ సభ నిర్వహించాలని టీపీసీసీ కిసాన్‌సెల్ నేతలు యోచిస్తున్నారు. -
YS Sharmila: ‘పోడు’పై పోరాడతా..
ఎస్ఎస్ తాడ్వాయి: గిరిజన రైతుల పోడు భూముల హక్కుల కోసం పోరాటం చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి రాజన్న బిడ్డగా లింగాల ఏజెన్సీ ప్రాంతంలోని పోడు భూముల సమస్యలు పరిష్కారించే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాలలో బుధవారం ఏర్పాటు చేసిన పోడు భూముల రైతుల భరోసా యాత్రలో షర్మిల మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఓట్ల కోసం సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని, గిరిజన ప్రాంతంలో ఎన్నికలు లేనందునే పోడు సమస్య పరిష్కరించట్లేదని ఆరోపించారు. స్వయంగా గిరిజన గ్రామాలకు వెళ్లి మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్... ఫాంహౌస్‌కు వెళ్లాక మరిచిపోయారని షర్మిల ఎద్దేవా చేశారు. దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన అటవీ హక్కుల చట్టం అద్భుతంగా ఉందని ఆనాడు మాట్లాడిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సమస్యలపై ప్రశ్నించినందుకు 20 మంది మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. అడవి బిడ్డల భూములు లాక్కుంటే గిరిజనులు మీ కుర్చీ లేకుండా చేస్తారని హెచ్చరించారు. వై.ఎస్. ఇచ్చిన భూములనూ లాక్కుంటున్నారు తెలంగాణలోని సుమారు 11 లక్షల ఎకరాల పోడు భూములకుగాను వై.ఎస్. హయాంలో 3 లక్షల ఎకరాల మేర గిరిజనులకు హక్కులు కల్పించగా కేసీఆర్ ఆ భూములను లాక్కుంటున్నారని, మిగిలిన 7 లక్షల ఎకరాల్లో ఇప్పటివరకు ఒక ఎకరానికీ పట్టా ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. రాజన్న బిడ్డగా గిరిజనుల పోడు భూముల కోసం గిరిజనులు పక్షాన నిలబడి కోట్లాడతానన్నారు. రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వస్తే పోడు భూములన్నింటికీ పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కాగా, పోడు భూముల సమస్యలపై షర్మిలకు గిరిజన మహిళలు తమ గోడు వినిపించారు. వైఎస్ హయాంలో ఇచ్చిన పట్టాలున్న పోడు భూములనూ అటవీ అధికారులు లాక్కొని మొక్కలు నాటుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కల్పన గాయత్రి, ములుగు కన్వీనర్లు బానోత్ సుజాత మంగిలాల్, మహబూబాబాద్ పార్లమెంట్ కో–కన్వీనర్ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
రైతు భరోసా.. ఇక కులాసా
వైఎస్సార్ భరోసా.. రైతుల జీవితాల్లో వెలుగులునింపనుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అక్టోబర్ 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. ఏటా మే నెలలో రైతులు సాగు మొదలుపెట్టేందుకు పెట్టుబడిగా రూ.12,500 ఇస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే ఈ హామీ అమలుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ ఏడాది అక్టోబర్ 15 నాటికి రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ప్రతి నియోజకవర్గానికీ ఒక ప్రత్యేక అ«ధికారిని కలెక్టర్ ముత్యాలరాజు నియమించారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద వెబ్‌ల్యాండ్ సమాచారం ఆధారంగా 3,45,978 మందిని అర్హులుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ డేటాను వైఎస్సార్ భరోసా పథకానికి కూడా అన్వయించి పరిశీలన చేస్తున్నారు. మంగళవారం వరకు 3,14,183 మంది రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి 2,61,801 మందిని అర్హులుగా గుర్తించారు. తాజాగా మరో 18,641 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మిగిలిన వారిని కూడా నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉంటే ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇంకా 20 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో ఆన్లైన్ చేసే ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ భూ యజమాని ఇంటికి వెళ్లి డేటాను సిద్ధం చేయడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలిస్తారు. భూ యజమానుల కుటుంబాలకు అక్టోబర్ 15న రూ.12,500 ఇస్తారు. కౌలు రైతులకూ వర్తింపు కౌలు రైతులకు కూడా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుతకౌలు రైతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ భూమిలేని సాగుదారునికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఇప్పటి వరకూ జిల్లాలో 2.40 లక్షల మంది కౌలు రైతులకు ఎల్ఈసీ కార్డులు అందజేశారు. అయితే గత ప్రభుత్వం టార్గెట్లు పెట్టడంతో బినామీ పేర్లతో పెద్ద ఎత్తున కౌలు రైతు కార్డులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలన చేయడంతో 94 వేల మందికి మాత్రమే అర్హత ఉన్నట్టు గుర్తించారు. అయితే జిల్లాలో కౌలు రైతులు భారీగా ఉండటంతో అందరికీ పథకం వర్తించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ పథకం చేపలు, రొయ్యల చెరువులకు వర్తించదు. ప్రత్యేకాధికారుల నియామకం ఈ పథకాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడడానికి లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. నిడదవోలు నియోజకవర్గానికి కుక్కునూరు సబ్ కలెక్టర్ ఆర్వీ సూర్యనారాయణను, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వైవీ ప్రసన్నలక్ష్మిని పోలవరం నియోజకవర్గానికి, ఏలూరు ఆర్డీఓ బీఎస్ నారాయణరెడ్డిని ఉంగుటూరు నియోజకవర్గానికి, కొవ్వూరు ఆర్డీఓ బి.నవ్యను కొవ్వూరు నియోజకవర్గానికి, నరసాపురం ఆర్డీఓ అబ్దుల్ నిజాముద్దీన్ సలీమ్‌ఖాన్‌ను నరసాపురం నియోజకవర్గానికి, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎ.దుర్గేష్‌ను ఆచంట నియోజకవర్గానికి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.కరుణకుమారిని గోపాలపురం నియోజకవర్గానికి, ఇడా సెక్రటరీ ఝాన్సీరాణిని దెందులూరు నియోజకవర్గానికి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్.ప్రభాకరరావును తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి, మైనార్టీస్ ఏడీ బి.భిక్షారావును భీమవరం నియోజకవర్గానికి, హార్టికల్చర్ డీడీ టీవీ సుబ్బారావును ఉండి నియోజకవర్గానికి, డీఎఫ్ఓ(ఎస్ఎఫ్) ఎం.శ్రీనివాసరావును తణుకు నియోజకవర్గానికి, జెడ్పీ సీఈఓ వి.నాగార్జునసాగర్‌ను ఏలూరు నియోజకవర్గానికి, ఫిషరీస్ డీడీ కె.ఫణిప్రకాష్‌ను చింతలపూడి నియోజకవర్గానికి, ఏపీఎంఐపీ పీడీ కే.సజానాయక్‌ను పాలకొల్లు నియోజకవర్గానికి ప్రత్యేకాధికారులుగా నియమించారు. -
వైఎస్సార్ రైతు భరోసాతోనే రైతన్న రాజ్యం
రుణం కోసం రణమే..! గిట్టుబాటు ధర గగనమే.. కరెంటు కోసం కాసుకు కూర్చోవడమే.. ఆత్మహత్యల్లోనూ ఘనమే..! – రాష్ట్రంలో అన్నదాతల దీన స్థితికి అద్దం పట్టే గీతమిది!! గిట్టుబాటు ధర కోసం అన్నదాత ఎక్కని మెట్టు లేదు.. పంట రుణం కోసం పుస్తెలు చేతబట్టుకుని బ్యాంకుల్లో పడిగాపులు.. కరెంటు కోసం చిమ్మచీకట్లో కాసుకుకూర్చోక తప్పని రోజు లేదు.. సాగు సంక్షోభంతో రైతులు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి.. సగానికిపైగా మండలాల్లో కరువు విలయతాండవం.. ఎటు చూసినా నెర్రెలిచ్చిన నేలలు.. కూలీలుగా మారుతున్న రైతులు.. కబేళాలకు తరలుతున్న పశువులు..అన్నదాతల దైన్యం చూస్తే... కళ్లు చెమర్చకమానవు. దుఃఖం పొంగివస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జననేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లు.. అప్పులకుప్పగా మారి బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతల దుఃఖం స్వయంగా చూసి.. రైతన్న రాజ్యం–రాజన్న రాజ్యం తెచ్చేందుకే.. రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ఖరీఫ్‌కు ముందే మే నెలలోనే ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయం అందిస్తానని జగన్ హామీ ఇవ్వడంపై రైతాంగంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. – సాక్షి, అమరావతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ఇనుకుర్తిలో నిమ్మరైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ (ఫైల్) ఇదీ వైఎస్సార్ రైతు భరోసా ఏటా రూ. 12,500 సాయం రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో భాగంగా ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని ప్రకటించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 లబ్ధి చేకూరుతుంది. అన్నదాతకు ఆసరాగా నిలిచే ఈ పథకాన్ని ప్రకటించడంపై అన్నదాతల్లో సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 85 లక్షల రైతు కుటుంబాలున్నాయి. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తారు. అంటే.. రాష్ట్రంలోని 85 లక్షల సన్నచిన్నకారు రైతు కుటుంబాలన్నింటికీ రైతు భరోసా ద్వారా ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఫలితంగా ఏ రైతూ పెట్టుబడి లేదని బాధపడడమో, బలవన్మరణాలకు పాల్పడాల్సిన పరిస్థితులు తలెత్తడమో ఉండదు. బాధిత రైతు కుటుంబానికి 5లక్షల బీమా అన్నదాతలు దురదృష్టవశాత్తు బలవన్మరణానికి పాల్పడినా, ప్రమాదవశాత్తు మరణించినా.. ఆ రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ డబ్బును అప్పుల వాళ్లు తీసుకోకుండా.. బాధిత రైతు కుటుంబానికే చెందేలా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన 2014లో 164 మంది, 2015లో 516 మంది చనిపోయినట్టు ఎన్సీఆర్బీ అధికారికంగా ప్రకటించింది. ఇలా గత ఐదేళ్లలో 2,400 మంది రైతులు చనిపోయారన్నది అనధికారిక అంచనా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో పదేపదే డిమాండ్ చేయడంతో.. రైతు ఆత్మహత్యలపై పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించి రకరకాల ఆంక్షలు పెట్టారు. చంద్రన్న రైతు బీమా కిందకు తెచ్చారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు ఒక రేటు, ఆపై వయసున్న వారికి మరో రేటు.. ఇలా వివిధ రకాలుగా పెట్టి గరిష్టంగా రూ.5 లక్షలని చెబుతూ వచ్చారు. ఇలా చెప్పి మూడేళ్లు గడిచినా పట్టుమని 200 మందికి కూడా సాయం అందలేదు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ పంటకు గిట్టు బాటు ధర లభించక నష్టపోతున్న రైతులకు మేలు చేసేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల నిధి విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లను కేటాయిస్తే కేంద్రం మరో రూ.2వేల కోట్లను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. రూ.4వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటవుతుంది. రాష్ట్రంలో కరవులు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది. దరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంతోపాటు పంట వేయడానికి ముందే రైతులకు గిట్టుబాటు ధరనూ ప్రకటిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇలా చేయడం వల్ల రైతులపై భారం తగ్గుతుంది. ప్రతి రైతు తన ఉత్పత్తులను ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా తక్కువకు అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా తక్కువకే అమ్ముకోవాల్సి వస్తే.. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. అందుకు ఈ ధరల స్థిరీకరణ నిధి ఉపయోగపడుతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు. 9 గంటల ఉచిత విద్యుత్ పగటిపూటే వైఎస్ జగన్ వ్యవసాయానికి పగటి పూట నిరంతరాయంగా హెచ్చుతగ్గులు లేని నాణ్యమైన కరెంటును 9 గంటల పాటు ఉచితంగా సరఫరా చేస్తానని భరోసా ఇచ్చారు. జగన్ హామీతో రాష్ట్రంలో ప్రస్తుతమున్న 16 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. 17 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. లక్షలాది ఎకరాలకు నీళ్లు అందుతాయి. దీంతోపాటు ఆక్వా రైతులకు యూనిట్‌కు రూపాయిన్నరకే కరెంటు అందిస్తారు. ఉచిత బోరుతో బావురమనే పరిస్థితే ఉండదు .. ఒకప్పుడు వంద, రెండొందల అడుగులు తవ్వితే నీళ్లు వచ్చేవి. ప్రస్తుతం 7, 8 వందల అడుగులు దాటిపోయినా నీరు కనిపించడం లేదు. రాయలసీమలోనైతే ప్రత్యేకించి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 12 వందలు, 14 వందల అడుగుల్లో బోరు వేసినా నీరు పడక, పదేపదే బోర్లు వేసి చేతులు కాల్చుకుంటున్నారు. బోర్లు వేసేందుకు చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితి నుంచి రైతుల్ని కాపాడేందుకు ఉచితంగా బోర్లు వేయిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయం దాదాపు 45శాతం భూగర్భ జలాల ఆధారంగా సాగవుతోంది. రోజురోజుకూ భూగర్భ జలాలు తరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితిలో మోట, దిగుడు బావులు ఎండిపోతున్నాయి. గొట్టపు బావుల సంఖ్య పెరుగుతోంది. కోస్తాలో 64 మండలాలు, రాయలసీమలో 169 మండలాల్లో అత్యధికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. పాత లెక్క ప్రకారం ఒక్కో బోరు వేయడానికి రూ.18500 ఖర్చు అవుతుందని గత ప్రభుత్వాలు నిర్ణయించినా.. వాస్తవానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు వ్యయం చేయాల్సివస్తోంది. ఇంత మొత్తం ఖర్చు పెట్టి వేసినా.. ఆ బోరు బావిలో నీరు పడకపోతే రైతులు అల్లాడిపోవాల్సిందే. ఇలా ఒకటికి రెండు మూడుసార్లు బోర్లు వేసి నష్టపోయి అప్పులు పెరిగి ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటువంటి దుస్థితి నుంచి రైతుల్ని కాపాడేందుకు వైఎస్ జగన్ ప్రకటించిన ఉచిత బోర్ల పథకం ఉపయోగపడుతుంది. పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు జగన్ పూచీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలకు రైతుల తరఫున ఉచితంగా ప్రీమియం చెల్లిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీ రాష్ట్రంలోని దాదాపు 85 లక్షల మంది రైతులకు ఎంతగానో ఉపకరిస్తుంది. అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోకుండా చూస్తానని భరోసా ఇవ్వడాన్ని రైతులు హర్షిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం–ప్రధాన మంత్రి పంటల బీమా కింద ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియంను రైతులు చెల్లించాలి. అదే ఉద్యాన పంటల రైతులైతే 5 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చెల్లిస్తాయి. రైతుల వాటా మొత్తాన్ని కూడా చెల్లిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వాస్తవానికి రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది వరకు రైతులు ఉన్నా.. కనీసం నాలుగోవంతు మంది కూడా పంటల బీమాను చెల్లించడం లేదు. బీమా బాధ్యతను తానే తీసుకుంటాననిజగన్ ప్రకటించడం రైతులకు మేలు చేస్తుంది. ఏదయినా విపత్తు సంభవించినప్పుడు రైతులకు బీమా కంపెనీల నుంచి క్లెయిమ్ వచ్చేలా చేస్తుంది. -
ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్పాలి
భూపాలపల్లి అర్బన్ : మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెప్పాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గండ్ర వెంకటరమణారెడ్డి చేపడుతున్న రైతు భరోసా యాత్ర బుధవారం మూడో రోజుకు చేరుకుంది. బుధవారం మండలంలోని కమలాపూర్‌లో ప్రారంభమైన యాత్ర మల్లంపల్లి, బాంబులగడ్డ, అంబేద్కర్ సెంటర్ మీదగా ఫక్కిర్‌గడ్డ, గడ్డిగానిపల్లి, కాశీంపల్లి గ్రామానికి చేరుకుంది. అంతకుముందు పట్టణంలోని హన్మాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. రాత్రి కాశీంపల్లిలోనే బస చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వెంకటరమణారెడ్డిమాట్లాడుతూ.. రాష్టŠట్రంలో రాచరిక పాలన కొనగుతోందని, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంలో ఆత్మహత్యలు చేసుకుంటే వారిని పరామర్శించిన ప్రజాప్రతినిధులే కరువయ్యారని ఆరోపించారు. గిట్టుబాటు ధర కల్పించకుండా పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.4 వేలు ఇస్తామని రైతులను తప్పుతోవ పట్టిస్తున్నట్లు విమర్శించారు. మూడెఎకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పి.. ఉన్న పోడు, అటవీ, అసైడ్ భూములను హరితహారం పేరుతో స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు. రైతులకు రావాల్సిన సబ్సిడీలను టీఆర్ఎస్ నాయకులే పంచుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఏడాది వాతావారణం అనుకులించకపోవడంతో రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. పలువురు నాయకులసంఘీభావం.. మండలంలో వెంకటరమణారెడ్డి చేపడుతున్న యాత్రలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, దొమ్మడి సాంబయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గండ్ర జ్యోతి, చల్లూరి సమ్మయ్య, పిన్‌రెడ్డి రాజిరెడ్డి, బుర్ర రమేష్, కుమార్‌రెడ్డి, హరిబాబు, సాగర్, పూర్ణచందర్, కటకం జనార్దన్, మల్లేష్, దేవన్, కరుణార్, కిరణ్, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..
భూపాలపల్లి : రైతులు ఆరుగాలం శ్రమించినా వారిలో ఆనందం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పదవి చేపట్టిన వేళావిశేషంతో గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 40 రోజులపాటు చేపట్టనున్న ‘రైతు భరోసా’ పాదయాత్రను ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మండలంలోని ఆజంనగర్‌లో సోమవారం ప్రారంభించారు. అంతకు ముందు భూపాలపల్లి నుంచి బయల్దేరిన ఆయన పట్టణంలోని హనుమాన్ దేవాలయం, పంబాపూర్ శివాలయం, ఆజంనగర్‌లోని చెన్నకేశవ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆజంనగర్‌లో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గండ్ర మాట్లాడుతూ.. రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకే ఉగాది మరునాడే కొత్త కోండ్రు ఆజంనగర్ నుంచి ప్రారంభించానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణాలను పావలా, ఆటానా మాఫీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయాలు రైతులకు దోహదంగా ఉండేయన్నారు. గిట్టుబాటు ధరకు మించి పంటలను కొనుగోలు చేసే వారన్నారు. గత ఏడాది రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ తాము వరంగల్ మార్కెట్ యార్డుకు వెళ్తే ప్రభుత్వం పోలీసులచే అరెస్ట్ చేయించిందన్నారు. పప్పు దినుసులు మేలని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు అధికంగా పండించారని, ఇప్పుడు వాటిని కొనుగోలు చేసే వారే కరువయ్యారని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటారని ఆరోపించారు. భూరికార్డుల క్రమబద్ధీకరణతో వీఆర్వో నుంచి కలెక్టర్ల వరకు బాగుపడ్డారని, రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు చేపట్టిన తన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని గండ్ర కోరారు. వైఎస్ హయాంలో ఒకేసారి రుణమాఫీ : మాజీ మంత్రి శ్రీధర్‌బాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేశారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. మాఫీకి ముందే రుణాలు చెల్లించిన రైతులకు సైతం రూ.5 వేలు అందించామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రూ.4 వేలు అందించేందుకు వస్తుందన్నారు. అయితే బ్యాంకు రుణాలకు సంబంధించి రైతులు ఇప్పటి వరకు ఎంత వడ్డీ చెల్లించారో కాగితం తీసుకొని వచ్చి ప్రస్తుత ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నారు. టీఆర్ఎస్కు పుట్టగతులుండవు.. కాంగ్రెస్‌ను విమర్శిస్తే టీఆర్ఎస్కు పుట్టగతులుండవని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్ర జ్యోతి అన్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి రైతు బిడ్డగా రైతుల బాధలు తెలిసి ఈ పాదయాత్ర ప్రారంభించాడన్నారు. అనంతరం పాదయాత్ర ప్రారంభమై ఆజంనగర్, నాగారం, పంబాపూర్‌లో కొనసాగింది. పాదయాత్రకు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు దొమ్మాటి సాంబయ్య, పిన్‌రెడ్డి రాజిరెడ్డి, బుర్ర రమేష్, చల్లూరి సమ్మయ్య, కటకం జనార్దన్, కొత్త హరిబాబు, గడ్డం కుమార్‌రెడ్డి, నూకల నర్సింహారెడ్డి, మందల విద్యాసాగర్‌రెడ్డి, గండ్ర హరీష్‌రెడ్డి, ఆకుల మల్లేష్, సెగ్గెం సిద్ధు, నూనె రాజు, గొర్రె సాగర్, పొలుసాని లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. -
మిరప పంటలను పరిశీలించిన వైఎస్ జగన్
కర్నూలు: కర్నూలు జిల్లాలో రైతు భరోసాయాత్ర చేస్తున్న జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం సంతజూటూరులో తెగుళ్ల కారణంగా నష్టపోయిన మిరప పంటలను పరిశీలించారు. రైతులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ గురించి ఆరా తీశారు. ఇప్పటివరకు రుణమాఫీ చేసిన డబ్బులు వడ్డీకే సరిపోయాయని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధైర్య పడొద్దని రైతులకు జగన్ భోసాయిచ్చారు. అన్నదాల సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పారు. -
మూడోరోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
-
కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో చేపట్టనున్న రైతు భరోసా యాత్ర గురువారం నుంచి ప్రారంభమౌతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. యాత్ర ఆ రోజు మధ్యాహ్నం శ్రీశైలం నియోజకవర్గం నుంచి ప్రారంభమౌతుందని, అనంతరం నంద్యాల నియోజక వర్గం మీదుగా సాగుతుందని వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్స్ కన్వినర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వెల్లడించారు. -
సప్తగిరి సర్కిల్ లో టీడీపీ దాదాగిరి
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు దాదాగిరికి దిగుతున్నారు. తాజాగా అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో చంద్రమోహన్ రెడ్డి అనే వైఎస్సార్ సీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను కత్తితో పొడిచారు. ఆయనను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. వైఎస్ జగన్ రోడ్ షోకు ఆటంకాలు కల్పించేందుకే టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
హరినాథ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఐదో రోజు భరోసా యాత్ర ఆదివారం కదిరి నుంచి ప్రారంభమైంది. నల్లమాడ మండలం పులగంపల్లిలో వైఎస్ జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వడ్డివారి పల్లె చేరుకుని రైతు హరినాథ్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ కు ప్రతి పల్లెలో జనం ఘనస్వాగతం పలుకుతున్నారు. -
చంద్రబాబుపై 420 కేసు పెట్టాలా వద్దా?: వైఎస్ జగన్
అనంతపురం : ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతో చంద్రబాబు నాయుడు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శనివారం కదిరిలో బహిరంగ సభలో మాట్లాడారు. 'యాత్రలో భాగంగా ఇప్పటివరకూ జిల్లాలో 80 కుటుంబాల వద్దకు వెళ్లడం జరిగింది. చనిపోయినవారిలో దాదాపుగా 15మంది చేనేత కార్మికులు ఉంటే మిగతావారు రైతులే. ఒక్క అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఎవరు?.ఎన్నికల ముందు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. చంద్రబాబు సీఎం అయ్యారు...బ్యాంకుల్లో బంగారం ఇంటికొచ్చిందా?. రుణాలు కట్టొద్దంటు రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు. రుణాలు కట్టకపోవడంతో రైతులపై వడ్డీ భారం పడింది. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను కూడా చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు ఎంసీ అయిన తర్వాత డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పడింది. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. మరి అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు హామీ ఏమైంది. ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి చంద్రబాబు ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోయారు. పట్టపగలే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను రూ.30 నుంచి రూ.40 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్‌ను ఎందుకు నిలదీయడం లేదు. ఓటుకు కోట్లు కేసులో దొరికినందుకే కేసీఆర్‌ను చంద్రబాబు నిలదీయలేకపోతున్నారు. నిలదీస్తే చంద్రబాబును జైలుకు పంపుతారు. అక్రమ ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు పెట్టాలా వద్దా?. రాయలసీమలో మోసం చేసిన వారిని చెప్పుతో కొట్టాలంటారు. ఇంతమందిని మోసం చేసిన చంద్రబాబును ఏం చేయాలి. ముఖ్యమంత్రిని ఏమీ అనకూడదంట. కానీ ఆయన మాత్రం మోసాలు చేయొచ్చు... అబద్దాలు ఆడొచ్చు. మనమంతా కలిసికట్టుగా ఒకటై వ్యవస్థలో మార్పులు తీసుకొద్దాం' అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
మోసకారికి ప్రజలు ఇంకెలా బుద్ధి చెబుతారు?
అలాంటి మనిషిని చెప్పులతో కొడితే తప్పా: వైఎస్ జగన్మోహన్రెడ్డి - చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చకుండా రైతన్నల ఆత్మహత్యలకు కారకుడయ్యారు - ఓటుకు కోట్లు కేసుకు భయపడే అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్‌ను నిలదీయలేదు - ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు రూ.600 కోట్లు ఖర్చు చేశారు -‘అనంత’లో 3వ రోజు రైతుభరోసా యాత్రలో విపక్ష నేత జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కటీ నెరవేర్చలేదు. ఈ రెండేళ్లలో రుణమాఫీ చేయకపోవడంతో ఆయన మాటలు నమ్మి మోసపోయి అప్పుల పాలైన రైతులు, చేనేతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు తప్పుడు హామీలే వీరి ఆత్మహత్యలకు కారణం. అనంతపురం జిల్లాలోనే ఇప్పటిదాకా 79 కుటుంబాలను పరామర్శించా. చంద్రబాబు రెండేళ్లపాలన పూర్తి అవినీతిమయం. వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి ప్రత్యేక హోదాను నీరుగారుస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రజలను పూర్తిగా మోసం చేసిన మనిషిని చెప్పులతో కొడితే తప్పా? అని అడుగుతున్నా. కనీసం ప్రజలు చెప్పులు చూపించినప్పుడైనా జ్ఞానోద యమై ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు గుర్తుకు వస్తాయి. అప్పుడు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తారు. నరేంద్రమోదీకి అల్టిమేటం ఇస్తారు’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో సాగుతున్న ఐదోవిడత రైతు భరోసా యాత్రలో భాగంగా మూడోరోజు శుక్రవారం ఆయన తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో పర్యటించారు. పెద్దపప్పూరు మండలం రామకోటిలో ఆత్మహత్యచేసుకున్న నాగరాజు కుటుం బాన్ని, ముచ్చుకోట గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న లీలా కృష్ణమూర్తి అనే రైతు కుటుంబానికి భరోసా కల్పించారు. యాడికిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... ఆత్మహత్యలకు బాధ్యుడు చంద్రబాబే... ప్రభుత్వ మోసపూరిత హామీలతో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు తోడుగా నిలబడి, ఆదుకునేందుకే రైతుభరోసా యాత్ర చేస్తున్నాం. అనంతపురం జిల్లాలోనే ఇప్పటిదాకా 79 కుటుంబాలను పరామర్శించా. వీరంతా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని చంద్రబాబు ఒక్కసారి చేతులను గుండెలపై వేసుకుని సమీక్షించుకోవాల్సింది పోయి అంతా ఆనందంగా ఉన్నారని అవహేళన చేస్తూ అసెంబ్లీసాక్షిగా మాట్లాడారు. ‘ఎన్నికలప్పుడు ఏం చెప్పారు.. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటో ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. ఆత్మహత్యలకు మీది బాధ్యత కాదా?’ అని చంద్రబాబును నిలదీశాను. ‘బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలన్నా.. రుణాలు పూర్తిగా మాఫీ కావాలన్నా... చేనేత రుణాలు మాఫీ కావాలన్నా.. బాబు ముఖ్యమంత్రి కావాలి’ అని ఎన్నికలకు ముందు టీవీ ఆన్చేసినా, ఎక్కడ ఫ్లెక్సీలు చూసినా ప్రకటనలు కనిపించేవి. సీఎం పదవి కోసం ఎవ్వరినీ వదలకుండా అందరినీ మోసం చేశారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. బాబుకు ముఖ్యమంత్రి జాబు వచ్చింది... కానీ ఆయన మాత్రం ఉన్న జాబులను తీసేస్తున్నారు. జాబు లేకపోతే ఇంటికి రూ.2వేల నిరుద్యోగభృతి ఇస్తామని ఆయన సంతకం ఉన్న కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లకు భృతి ఇస్తామన్నారు. ఈ రెండేళ్లలో ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. రైతులు, మహిళలు, చేనేతలు, నిరుద్యోగులు.. ఇలా అందరికీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారు. ఈ రెండేళ్లలో ఆయన చేసిందేమిటంటే విచ్చలవిడి అవినీతి. ఇసుక నుంచి బొగ్గుదాకా, రాజధాని భూముల నుంచి దేవాలయ భూముల దాకా అవినీతికి తెగబడ్డారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగుతున్నారు. ఇలాంటి వ్యక్తి సిగ్గులేకుండా అవినీతి గురించి, అవినీతి రహిత రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. పిల్లలతో కూడా నవ నిర్మాణదీక్ష అంటూ ప్రమాణం చేయిస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా చేసేందుకే.. ప్రజల గొంతు విన్పించకూడదని, ప్రతిపక్షం లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నావు. ఒక్కొక్కరికి రూ.30-40 కోట్లు ఖర్చు చేసి ఇప్పటివరకూ 18-19 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశావు. దీనికి రూ. 600కోట్ల దాకా ఖర్చయ్యింది. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వ చ్చింది? ఇదంతా అవినీతి డబ్బని ఆరేళ్ల చిన్నపిల్లోళ్లకూ తెలుసు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ, సూట్‌కేసుల్లో బ్లాక్‌మనీ నింపి ఇస్తూ ఆడియో, వీడియో రికార్డుల్లో అడ్డంగా చిక్కారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యాంలోకి నీరు రాకుండా.. 800 అడుగుల నుంచే నీళ్లు తోడేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అయినా కృష్ణా, గోదావరిపై అక్రమ ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని కేసీఆర్‌ను నిలదీయడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులు బయటకు తీసి కేసీఆర్ జైళ్లో పెట్టిస్తారనే భయం. సీబీఐ కేసులకు భయపడే ప్రత్యేక హోదా నిర్వీర్యం ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు వస్తాయి. ఇన్‌కం ట్యాక్స్ భారం తగ్గుతుంది. రాయితీ కరెంటు వస్తుంది. మరిన్ని రాయితీలు వర్తిస్తాయి. దీంతో సింగపూర్, దుబాయికి వెళ్లకుండా పరిశ్రమలు మన రాష్ట్రానికే వస్తాయి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇదంతా తెలిసినా చంద్రబాబు తన స్వార్థం కోసం ఐదుకోట్ల మందిని నడిరోడ్డున నిలబెట్టారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే మా మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకుంటామని ఎందుకు కేంద్రానికి అల్టిమేటం ఇవ్వలేదు? నరేంద్రమోదీని గట్టిగా అడిగితే రెండేళ్ల అక్రమాలపై సీబీఐ కేసులు నమోదు చేయించి జైలుకు పంపుతారని భయం. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? చంద్రబాబు మాటలు నమ్మి అప్పుల పాలైన చేనేత కార్మికులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. నిన్న పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో ఆత్మహత్య చేసుకున్న నాగరాజు అనే చేనేత కుటుంబాన్ని పరామర్శించా. కేవలం రూ.40వేలు రుణం మాఫీ కాక నాగరాజు చనిపోయారు. గతంలో ముడిసరుకుపై రూ.600-1000 సబ్సిడీ వచ్చేది. చేనేత రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. రుణాలు మాఫీ చేసి ప్రతి కుటుంబానికి రూ.లక్ష అదనంగా రుణాలు ఇస్తామన్నారు. అందరికీ ఇళ్లు కట్టిస్తాం, రూ.1.50 లక్షలతో షెడ్డు నిర్మిస్తామన్నారు... ఏవీ చేయలేదు. దీంతో ప్రతి చేనేత కార్మికుడు బోరున ఏడుస్తున్నారు. చేనేత కార్మికుల గోడు విన్పించలేదా? అని అసెంబ్లీలో గట్టిగా అడిగినా స్పందించలేదు. చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రూ. 87 వేల కోట్ల రుణాలుండేవి. ఈ రెండేళ్లలో వడ్డీనే రూ.25 వేల కోట్లయ్యింది. కానీ చంద్రబాబు వడ్డీలో మూడోవంతు కూడా మాఫీ చేయలేదు. పైగా ముష్టివేసినట్లు రూ.3వేలు ఇచ్చి డ్వాక్రా మహిళలకు అన్యాయం చేశారు. ఇలాంటి విషయాలపై నిలదీస్తే తప్పట! చంద్రబాబూ.. తప్పుచేస్తున్నావని గట్టిగా చెప్పడం నేరమట! సాక్షాత్తూ మీ ఎమ్మెల్యే (జేసీ ప్రభాకర్‌రెడ్డి) వార్నింగ్ ఇచ్చి చెబుతున్నారు. చంద్రబాబు ఎవర్ని మోసం చేసినా, వెన్నుపోటు పొడిచినా ప్రశ్నించకూడదట. తప్పుచేసినా ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం బతకదు. తాడిపత్రి నియోజకవర్గంలో యాడికి కాలువ ఉంది. ఒక్కసారి గుండెలపై చేయివేసుకుని కాలువ ఎవరి హయాంలో వచ్చిందో చెప్పాలని తాడిపత్రి ఎమ్మెల్యేను అడగండి. ప్రస్తుతం కాలువకు నీళ్లురాక పండ్ల తోటలన్నీ ఎండిపోతున్నాయి. దీనికి కారణం చంద్రబాబే! ఆయనలో మార్పు రావాలంటే ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి. ఎన్నికలు త్వరగా వస్తే.. టీడీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిస్తే... అప్పుడు రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. అందుకు మనమంతా కలసి పోరాడాలి. అందుకు మీ ఆశీస్సులు, తోడ్పాటు, దీవెనలు కావాలి. -
నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. పెద్ద పప్పులూరు మండలం రామకోటి కాలనీలో చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. చేనేత కార్మికుడిగా కూలీ గిట్టుబాటు కాకపోవడం, ముడిసరుకు కోసం చేసిన రూ.4 లక్షల అప్పులు తీర్చలేక నాగరాజు 2015 నవంబర్ 29న పురుగులు మందు తాగి, ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని నాగరాజు భార్య మూడు సార్లు కలెక్టర్లను వేడుకున్నా పైసా సాయం అందలేదు. కనీసం రేషన్ కార్డు కూడా లేకపోవడంతో వితంతు పింఛన్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ తాను కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
రూ. 600 కోట్లు ఎక్కడివి?
యాడికి: అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో మూడో రోజు రైతు భరోసాయాత్రలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం యాడికిలో అశేష ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారని, తమ పాలనలో రైతులు ఆనందంగా ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రతిపక్షాన్ని అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా చిక్కటి చిరునవ్వుతో స్వాగతం పలికిన మీ అందరికీ ధన్యవాదాలు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా ఇచ్చేందుకే యాత్ర చేస్తున్నా రైతులు చాలా ఆనందంగా ఉన్నారని చంద్రబాబు అవహేళనగా మాట్లాడుతున్నారు ఎన్నికలకు ముందు చెప్పింది ఏమిటి తర్వాత చేస్తున్నదేమిటి? ఎన్నికలప్పుడు గ్రామగ్రామానికి తిరిగి రైతు రుణాలన్నీ బేషరుతుగా మాఫీ చేస్తామని చెప్పారు చేనేత కార్మికులకు రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలని ప్రచారం చేశారు తాను ముఖ్యమంత్రి కావడానికి రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, చివరికి చదువుకుంటున్న చిన్నపిల్లలను మోసం చేశారు జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు జాబు రాకుంటే ప్రతి ఇంటికి రూ. 2 వేలు ఇస్తానని హామీయిచ్చారు ఏ ఒక్కరికైనా నిరుద్యోగభృతి ఇచ్చారా అని అడుగుతున్నా రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, చేనేత కార్మికులకు, విద్యార్థులను వెన్నుపోటు పొడిచాడు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోపోగా, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు రాష్ట్రంలో ఇసుక నుంచి గుడి భూములు అమ్మేదాకా అవినీతి చేస్తున్నారు ప్రజల తరపున ఎవరూ మాట్లాడకూడదా? ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కొంటున్నారు ఎమ్మెల్యేలను కొనడానికి రూ.600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపులతో సహ చంద్రబాబు దొరికిపోయారు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు అడగరేం? ఓట్లు కోట్లు కేసు మళ్లీ బయటకు తీస్తారన్న భయంతోనే నోరు విప్పడం లేదు తన స్వార్థం కోసం 5 కోట్ల మందిని నడిరోడ్డుపై నిలబెట్టారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీని నిలదీసే ధైర్యం చంద్రబాబుకు లేదు ప్రత్యేక హోదా వచ్చివుంటే ఉద్యోగాలు, పరిశ్రమలు వచ్చేవి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం నుంచి వైదొలుతామని ఎందుకు అనడం లేదు తన అవినీతిపై సీబీఐతో నరేంద్ర మోదీ దర్యాప్తు చేయిస్తారని భయంతో నోరు మెదపడం లేదు చంద్రబాదు మోసం, తప్పు చేసినా, వెన్నుపోటు పొడిచినా ఎవరు అడక్కూదట రుణాలు మాఫీ చేస్తానని చేయకపోవడం మోసం కాదా? పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం బతకదు ఎన్నికలు వచ్చి చంద్రబాబు పాలన బంగాళాఖాతంలో కలిస్తే అందరికీ మంచి జరుగుతుంది అందరం ఒక్కటై చంద్రబాబు అసమర్థ పాలనపై పోరాడదాం -
సాక్షి టుడే హైలైట్స్..
మేం బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయం అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం రైతులు, డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయమని స్పష్టం చేశారు. బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే హోదా కోసం పోరాడాలి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల హామీలను పక్కదోవ పట్టించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలు చేపట్టారని, హోదా కోసం పోరాట దీక్షలు చేయాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. సచిన్, చిరు, నాగ్.. ఇక బిజినెస్ పార్ట్నర్లు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తెలుగు సినీ దిగ్గజాలు చిరంజీవి, నాగార్జునతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పుడు వ్యాపార భాగస్వాములయ్యారు. రేపు కేసీఆర్ ఏం చేస్తారో తెలుసా? రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభంకాబోతున్నాయి. చుక్కలు చూపించిన విమానం! న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ విమానం ఒక్క ఉదుటున ఎగిరి పడటంతో ప్రయాణీకులు అదిరి పడ్డారు. పాడు క్రీమ్ ఆ మహిళను ఎంతపని చేసింది? కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లయింది అమెరికాలో ఓ మహిళ పరిస్థితి. మూడు కెమెరాలతో ఎల్జీ జీ5 వచ్చేసింది... డబుల్ కెమెరాల స్మార్ట్ ఫోన్లకు బైబై చెబుతూ ఎల్ జీ మరో కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ తో మార్కెట్లో అడుగు పెట్టింది. మొత్తం మూడు కెమెరాలతో ఎల్ జీ జీ5 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. పంచ్‌లతో రోడ్డుపై పిచ్చిపిచ్చిగా కొట్టుకుని.. తొలుత వ్యాన్ డ్రైవర్ ఎగిరెగిరి అతడికి పంచ్‌లు ఇచ్చేందుకు ప్రయత్నించినా కారు డ్రైవర్ గట్టిగా ఎదురుతిరిగి బలంగా పంచ్ చేయడంతో ఒక్కసారిగా అతడు కిందపడిపోయాడు. ఈ మెగా సెల్ఫీ చాలా అరుదు గురూ ఒకే రకమైన వస్త్రాలు వేసుకొని.. ఎవరి మొఖంలో నవ్వుచూసినా అదే పరిమాణంలో ఉండి.. ఈ అరుదైన సెల్ఫీ తిరుపతిలో ఆవిష్కృతమైంది. అమెరికాలో మొదటి 'జికా' మామ్! పుట్టబోయే బిడ్డలకు మెదడు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు జికా వైరస్ వల్ల వస్తున్నాయని వైద్య నిపుణులు ముందే గుర్తించారు. ఇప్పటికే బ్రెజిల్లో తల చిన్నగా ఉండి, మెదడు లోపంతో పిల్లలు పుట్టినట్లు అంచనా కూడ ఉంది. ప్రైవసీ కావాలంటూ స్టార్ హీరో ఆందోళన! బాలీవుడ్ హీరో సంజయ్ దత్. ఇకనుంచి తాను ఎవరికోసమూ సినిమా చేయనని చెప్పిన సంజయ్.. హాలీవుడ్ మూవీ రీమేక్ కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. కేజ్రీవాల్ డిగ్రీని తవ్వేందుకు ఐపీఎస్ బస్సీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నిజంగా ఐఆర్ఎస్ చదివారా? లేదా తెలుసుకునేందుకుగాను పాత ఫైళ్లను వెతికించడం కోసమే ఆయన్ని యూపీఎస్సీ సభ్యుడిగా నియమించారు అని కొందరు వ్యాఖ్యానించారు. సీనియర్ కమెడియన్ కన్నుమూత బాలీవుడ్ సీనియర్ హాస్యనటుడు రజాక్ ఖాన్ కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. మోదీకి కేరళ అమ్మాయి సంచలన వీడియో కేరళకు చెందిన ఓ విద్యార్థిని మోదీని ఉద్దేశించి రూపొందించిన వీడియో ఒకటి హాట్ టాపిక్ గా మారింది. అమెరికన్ల వాలెట్లు తెరుచుకున్నాయ్.. మార్చి నెల కంటే ఏప్రిల్ నెలలో అమెరికన్ల ఖర్చు 1శాతం పెరిగాయని వాణిజ్య విభాగ డేటాలో తేలింది. హీరోను హాకీ స్టిక్ తో తరిమేసింది! హీరో ఆమిర్ ఖాన్ ను హాకీ స్టిక్‌తో తరిమానని బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఆసక్తికర విషయం వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ. 9 లక్షలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఇజ్రాయెల్ స్టార్టప్ కంపెనీ సిరిన్ ల్యాబ్స్ మంగళవారం నాడు లండన్ మార్కెట్లో ఆవిష్కరించింది. హైదరాబాద్‌లో ఎందుకు వద్దన్నారు? ఆంధ్రప్రదేశ్ కోటాలో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను హైదరాబాద్‌లో జరపొద్దని రాష్ట్ర శాసనసభ కార్యదర్శి ఎందుకు కోరినట్టు? సెల్ఫీ వంకతో.. భార్యను చంపేశాడు! కట్నం వ్యవహారంలో భార్యతో గొడవపడి.. సెల్ఫీ తీసుకునే వంకతో ఆమెను గంగానదిలోకి తోసేసి చంపేశాడో వ్యక్తి. త్వరలో ఆ సేవలందించనున్న టెల్కోస్ ? తరచూ కాల్ డ్రాప్ సమస్యతో విసిగిపోయిన వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్. ఫేర్వెల్ పార్టీ ఉందని చెప్పినా... బీటెక్ విద్యార్థిని ఝాన్సీ ఆత్మహత్యపై మిస్టరీ వీడింది. టి 20 ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్ పాకిస్థాన్‌కు చెందిన హషీమ్ అఖ్తర్ అనే ఓ టీనేజి క్రికెటర్ ఇంగ్లండ్‌లో టి 20 క్రికెట్ మ్యాచ్ ఆట మధ్యలో కుప్పకూలిపోయాడు. పెళ్లి చేసుకున్న యువతి కన్య కాదని... మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాజాగా బయటపడిన ఉదంతం నవనాగరికుల గుడ్డి నమ్మకాలకు అద్దం పడుతోంది. నైజీరియన్లతో మాకు తలనొప్పే: సీఎం గోవాలో నైజీరియన్ల ఆగడాలకు అంతులేకుండా పోతోందని, వాళ్ల వ్యవహారం తమకు భలే తలనొప్పిగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. టాటా స్టీల్ యూకే టేక్ ఓవర్ పూర్తి బ్రిటన్‌లో అమ్మకాలు పడిపోయి సంక్షోభంలో పడిన టాటా గ్రూప్ టాటా స్టీల్ యూకె కు భారీ ఊరట లభించింది. శభాష్.. సర్ఫరాజ్! మతసామరస్యం వెల్లివిరిసిన ఘటన ఇది. ప్రతిభకు కులమతాలు ప్రతిబంధకం కాదని పదో తరగతి విద్యార్థి నిరూపించాడు. బడ్జెట్ 4కోట్లు, కలెక్షన్లు 75 కోట్లు అంఛనాలను తలకిందులు చేస్తూ ఓ మరాఠీ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అవును.. అది ఆవు మాంసమే! యూపీలోని దాద్రి ప్రాంతంలో 50 ఏళ్ల మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి వద్ద ఆవుమాంసం ఉందని సుమారు 100 మంది అతడిని ఇంట్లోంచి బయటకు లాగి చంపేశారు. పెళ్లికి నో చెప్పిందని.. టీచర్ ను..! పెళ్లి ప్రపోజల్ కు నో చెప్పిందన్న కారణంతో ఓ స్కూలు టీచర్ ను సజీవ దహనం చేశారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువతి చివరికి తనువు చాలించింది. ఆన్ లైన్లో అమ్మకానికి నియంత వస్తువులు..! జర్మనీ నియంతగా పేర్కొనే అడాల్ఫ్ హిట్లర్ కు చెందిన కొన్ని కోడింగ్ మేషిన్లను అమ్మకానికి పెట్టారు. పుదుచ్చేరిలో కిరణ్ బేడీ హల్చల్ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ హల్ చల్ చేశారు. -
నాగార్జున రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేతల కుటుంబాలను పరామర్శించేందుకు రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. పెదవడుగూరు మండలం దిమ్మగుడిలో కౌలు రైతు నాగార్జున రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పత్తి పంట వేసి అప్పుల పాలవడంతో నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు భరోసా యాత్ర సందర్భంగా పలువురు రైతులు.. చంద్రబాబు ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందని వైఎస్ జగన్ వద్ద వాపోయారు. -
మేం బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని, రుణమాఫీ చేస్తామని తమను మోసం చేశారని అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం రైతులు, డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయమని స్పష్టం చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేతల కుటుంబాలను పరామర్శించేందుకు రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుట రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పెదవడుగూరులో రైతులు, డ్వాక్రా మహిళలతో వైఎస్ జగన్ ముఖాముఖి మాట్లాడారు. కేంద్రానికి సంబంధించి 4500 కోట్ల రూపాయల నిధులతో రైతులకు ఉపాధి కల్పిస్తే రైతులు బాగుపడతారని వైఎస్ జగన్ అన్నారు. ఉపాధి పనులు దొరికితే రైతులు స్థానికంగా ఉంటారనుకుంటే, చంద్రబాబు ఆ డబ్బును తన ఇష్టం వచ్చినట్లు వేరే చోటకు మళ్లించారని ఆరోపించారు. రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమాట్లాడారంటే.. చంద్రబాబు సీఎం అయ్యేసరికి బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు ఇప్పుడు ఆయన మాఫీ చేయకపోవడంతో 2 రూపాయల వడ్డీ కడుతున్నారు పంట బీమా రావడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ అంతంతమాత్రమే చివరకు నీళ్లొస్తాయని చూస్తుంటే బాబు పుణ్యాన నీళ్లు రాకపోగా పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎడాపెడా ప్రాజెక్టులు కట్టేసి, పంపులు పెట్టి నీళ్లు తన్నుకుపోతుంటే కనీసం అడిగే పరిస్థితి కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి చూస్తున్నాం రైతుల బాధలు అర్థం కావాలి. ఆయన అక్కడెక్కడో బంగారు మేడలో కూర్చుని అంతా బాగున్నారు, రైతు రుణాలన్నీ మాఫీ చేశాను, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఆనందంతో ఉన్నారని అబద్ధాలు చెబుతున్నారు ఇక్కడి రైతులు చెప్పిన మాటలైనా ఆయనకు అర్థమైతే కాస్తో కూస్తో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం రుణాలు రెన్యువల్ అయి ఉంటే కాస్తో కూస్తో క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేది మాఫీ కాక, రెన్యువల్ కాక, బీమా రాక అన్యాయం అయిపోతున్నారు కనీసం ఇప్పటికైనా రైతులు ఎలా బాధపడుతున్నారో చంద్రబాబుకు అర్థం కావాలి రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, చేనేత కార్మికుల అవస్థలు తెలియాలి కనీసం ఈ మీటింగ్ ద్వారానైనా చంద్రబాబు గారు రైతుల పరిస్థితి అర్థం చేసుకుని వాళ్లకు తోడుగా నిలబడేందుకు ఆయనకు జ్ఞానోదయం కావాలి ఈ విషయమై ఆయనపై గట్టిగా ఒత్తిడి తెస్తాం అనంతరం వైఎస్ జగన్ ఎదుట రైతులు, డ్వాక్రా మహిళలు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. రైతులు, డ్వాక్రా మహిళలు ఏం చెప్పారంటే వారి మాటల్లోనే.. కృష్ణారెడ్డి, చిన్నవడుగూరు నాకు 11 ఎకరాల భూమి ఉంది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టి రుణమాఫీ చస్తామన్నారు. రూపాయి కట్టక్కర్లేదని చెప్పారు. కానీ ఇంతవరకు 1.5 లక్ష గోల్డ్ లోన్, 75 వేల రూపాయలు క్రాప్ లోన్ ఉంది. కేవలం 8వేల రూపాయలే మాఫీ అయింది. రెండింటికీ కలిపి 56800 రూపాయల వడ్డీ అయింది. రెండేళ్ల పాటు మేం క్రాప్ లోన్, గోల్డ్ లోన్ రెన్యువల్ చేయలేదు.. చివరకు అన్నీ కోల్పోయాం. నీటి విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది. వైఎస్ ఉన్నప్పుడు మా కాలవకు 1.5 టీఎంసీ కేటాయించారు. చంద్రబాబు పుణ్యాన వర్షాలు లేక, డ్యాముల్లో నీళ్లు లేక అవీ రావడం లేదు. చివరకు జేసీ బ్రదర్స్ కలిపి అన్యాయం చేస్తున్నారు. 70 రోజులు ఇస్తామన్నారు, కనీసం 50 రోజులు కూడా రావడం లేదు. జగనన్న సీఎం అయితేనే మన రైతుల సమస్యలు తీరుతాయి మల్లయ్య, ముత్యాల నాకు 4 ఎకరాల భూమి ఉంది. పంట నష్టపరిహారం ఇవ్వలేదు. బ్యాంకులో 25 వేల రుణం ఉంది. అది కూడా మాఫీకాలేదు. వడ్డీలకే సరిపోతోంది. రూపాయి కూడా రాలేదు వడ్డీ భారం కూడా పడింది. అది కూడా కలిపి కట్టమంటున్నారు. పంటబీమా కూడా రాలేదు. ఈ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వబోమని అంటున్నారు. పబ్లిగ్గా బరితెగించి అబద్ధాలు చెబుతున్నారు.. చంద్రబాబుకు ఏం చెబుతాం. రామచంద్రరాజు, మేడిమాకులపల్లె నాకు 8 ఎకరాల భూమి ఉంది. గోల్డ్ లోన్ 80 వేలు, క్రాప్ లోన్ 80 వేలు ఉంది. అందులో 12వేలు పోయిందన్నారు. మళ్లీ 8వేలు ఎదురు వడ్డీ కట్టాం. 2 రూపాయల వడ్డీ కట్టుకుంటున్నామన్నారు. ఆ పొద్దు ఆయన కట్టొద్దని అన్నారు కాబట్టి కట్టలేదు. ఇప్పుడు వాళ్ల పుణ్యాన అధిక వడ్డీ కట్టాల్సి వస్తోంది. బంగారం వేలం వేస్తామని నోటీసులు వస్తే భూములు తాకట్టు పెట్టి బంగారం విడిపించుకున్నాం. రైతుకు చక్రవడ్డీ పడుతోంది. పంటబీమా రూపాయి కూడా రాలేదు. ఇన్పుట్ సబ్సిడీ రాదన్నారు. విత్తనాలు కూడా మొలకెత్తడం లేదు. ఈయనొస్తే మళ్లీ వర్షాలు రావు. మేం బతికుంటే మళ్లీ ఆయనకు మాత్రం ఓటు వేయం. చంద్రావతి, డ్వాక్రా మహిళ మా గ్రూపులో 15 మంది ఉన్నాం. 5 లక్షల రుణం తీసున్నాం. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెబితే టీడీపీకి ఓట్లు వేశాం. చంద్రబాబు చెప్పినందుకు అప్పుకట్టలేదు. అయితే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. మూడు నెలలకే 30 వేల వడ్డి వచ్చింది. అనంతరం వైఎస్ జగన్.. రైతులతో మాట్లాడుతూ చంద్రబాబు పాపాలు పండుతాయన్నారు. ప్రజలను ఆయన్ను బంగాళాఖాతంలో కలిపే రోజులు వస్తాయని, దేవుడు పైనుంచి చూస్తున్నాడని చెప్పారు. -
'రైతు భరోసా యాత్ర విజయవంతమైంది'
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన రైతు భరోసా యాత్ర విజయవంతమైందని మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. అప్పుల బాధతో మరణించిన రైతు, చేనేత కార్మిక కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారని అన్నారు. రైతు చేనేత కార్మికుల ఆత్మహత్యలకు చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని గుర్నాథరెడ్డి డిమాండ్ చేశారు. -
'చంద్రబాబును తీసేయండి సారూ...'
-
మూడోవంతు వడ్డీకీ చాలని మాఫీ
-
పావలా వడ్డీలు రద్దు
-
'బాబు పాలన మూడు ముక్కల్లో చెప్పొచ్చు'
-
డీఎస్సీ రాసిన అభ్యర్థుల నోట్లో చంద్రబాబు మట్టి కొట్టారు
-
'బాబు పాలన మూడు ముక్కల్లో చెప్పొచ్చు'
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనను మూడు ముక్కల్లో చెప్పవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలన అంతా కూడా మోసం మోసం మోసం పద్దతుల్లోనే జరుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబునాయుడు మోసం చేశారని అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లాలోని బండమీదపల్లిలో నిర్వహించిన రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేమిటో, ఎన్నికలు పూర్తయ్యి ముఖ్యమంత్రి అయ్యాక చేస్తున్న చేతలేమిటో ప్రజలు గమనించి గట్టిగా ప్రశ్నించాలని అన్నారు. మోసపూరిత హామీలు ఇవ్వడం వల్లే వాటిని నమ్మి అమాయక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఓపక్క రైతులంతా ఇబ్బందులు పడుతూ కష్టాల్లో మగ్గుతూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చంద్రబాబుకు అవేం కానరావడం లేదన్నారు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా రైతులు సంతోషంగా ఉన్నారని అబద్దాలు ఆడారని చెప్పారు. ఎన్నికల సమయంలో లైట్లు పెట్టి మరీ ప్లెక్సీలు కట్టారని, పెద్ద పెద్ద అక్షరాలతో మోసపూరిత హామీలు రాశారని గుర్తు చేశారు. రైతుల రుణ మాఫీలు కావాలన్నా, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా బాబు రావాలంటూ ప్లెక్సీలు పెట్టారని తీరా ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ హామీలు మరిచారని అన్నారు. రాష్ట్రంలో గుడిసె లేకుండా చేస్తానని, అన్ని పక్కా ఇళ్లు కట్టిస్తానని చెప్పారని, ఒక్క ఇళ్లయినా కట్టించారా అని నిలదీశారు. ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పవచ్చు.. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.5లక్షలు ఇస్తామని ఒక్క రూపాయి ఇవ్వలేదు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు పావలా వడ్డీలు రద్దు చేసి అదనంగా 14శాతం అపరాధ వడ్డీ వసూలు చేస్తున్నారు. వడ్డీల్లో మూడో వంతు కూడా రుణమాఫీ చేయలేదు వడ్డీలకు కూడా సరిపోని మాఫీలు చేసి మొత్తం రుణాలు మాఫీ చేసినట్లు మభ్య పెడుతున్నారు. అక్కా చెల్లెళ్ల రుణాల మాఫీ చేస్తానని చెప్పి వారిని మోసం చేశారు జాబురావాలంటే బాబు రావాలని చెప్పి యువతను మోసం చేశారు. రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారు అందరి ఇళ్లలో కలర్ టీవీలు పెట్టిస్తానని మోసం చేశారు. బాబు పాలన ప్రతి అడుగులో మోసం మోసం మోసం మాత్రమే ఉంది కరువు సమయంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి మరోసారి మోసం చేశారు తుఫానులు,కరువు వస్తే ప్రతిఒక్కరిని ఆదుకుంటామని చెప్పి మోసం చేశారు వరదలు వచ్చాక 163 కరువు మండలాలు ప్రకటించారు ముందే కరువు మండలాలు ప్రకటించి ఉంటే కేంద్రం నుంచి నిధులు వచ్చేవి చంద్రబాబు ముందే కరువు మండలాల జాబితా ఇచ్చి ఉంటే ప్రజలకు ఇన్ పుట్ సబ్సిడీ వచ్చి ఉండేది శ్రీశైలంలో కనీస నీటి మట్టం లేకుండానే ఎలా రాయలసీమకు నీళ్లు ఇస్తారో చెప్పాలి. రాయలసీమకు నీరు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాలి. కానీ, బాబు కేసీఆర్ కలిసి విద్యుత్ పేరిట 790 అడుగులకు తీసుకొచ్చారు డీఎస్సీ రాసిన అభ్యర్థుల నోట్లో చంద్రబాబు మట్టి కొట్టారు ఇవాళ అంగన్ వాడీలు, ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డున పడ్డారు -
రోడ్డుప్రమాద బాధితులకు వైఎస్ జగన్ సాయం
-
మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ
-
మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ
అనంతపురం : రాష్ట్రంలోని మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఉప్పరపల్లిలో ఆయన్ని ఆదివారం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిశారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయించాలని వైఎస్ జగన్‌ని సదరు ఉద్యోగులు కోరారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. అలాగే తమ కులాన్ని బీసీల్లో కలిపేందుకు సహకరించాలని కాపు, తెలగ, బలిజ సంఘం నేతలు కూడా వైఎస్ జగన్ కలసి విజ్ఞప్తి చేశారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రం ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఉప్పరపల్లిలో రైతు మారుతి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉప్పరపల్లిలో వైఎస్ జగన్‌ను డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఉపాధ్యాయ నియామకాలను వెంటనే జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్‌ను కోరారు. -
రైతుల నోట్లో మట్టికొట్టారు: వైఎస్ జగన్
బత్తులపల్లి: చంద్రబాబు పరిపాలన అంతా మోసం, మోసం, మోసం అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక తొంగలో తొక్కారని ధ్వజమెత్తారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా బత్తులపల్లిలో శుక్రవారం సాయంత్రం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీయిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే రుణాలు కాదు కనీసం వడ్డీలు కూడా మాఫీ చేయలేదని అన్నారు. రుణాలు కట్టని రైతుల నుంచి 14 శాతం వడ్డీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కరువు మండలాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 100 మంది రైతులు చనిపోయినా చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీ వేదికగా రైతు సమస్యలపై చంద్రబాబును గట్టిగా నిలదీశామని చెప్పారు. చంద్రబాబుకు బుద్ధి రావాలంటే ప్రజలంతా కలిసిపోరాడాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
రైతుల నోట్లో మట్టికొట్టారు:జగన్
-
పోతిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులో బసిరెడ్డిగారి పోతిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం పోతిరెడ్డి కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను వైఎస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అని వేళలో అండగా ఉంటామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా పోతిరెడ్డి కుటుంబానికి భరోసా ఇచ్చారు. అటు చూస్తే వేసిన పంట ఎండిపోయింది... ఇటు చూస్తే చేసిన అప్పులు తీర్చే దారి కానరాక రైతు బసిరెడ్డిగారి పోతిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రైతు బసిరెడ్డిగారి పోతిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ ఈరోజు పరామర్శించారు. కాగా వైఎస్ జగన్ అనంతపురంలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. గురువారం అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ అయిదు రైతు కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందే. -
వైఎస్ జగన్‌ను కలిసిన చేనేత సంఘం నేతలు
-
నారాయణస్వామి కుటుంబానికి జగన్ పరామర్శ
-
పత్తిరైతుల సమస్యపై కేంద్రానికి లేఖ: వైఎస్ జగన్
అనంతపురం : పత్తిరైతుల సమస్యలను పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు ప్రస్తావిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. పత్తిరైతుల సమస్యలు తీర్చాందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి తాను లేఖ రాస్తానని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆదివారం ఆరో రోజుకు చేరుకుంది. యాత్రలోభాగంగా ఈ రోజు కదిరేపల్లి వద్ద మల్బరి తోటను ఆయన పరిశీలించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు విన్నవించారు. దిగుమతి సుంఖాన్ని కేంద్రం తగ్గించడంతో చైనా నుంచి అత్యధికంగా సిల్క్ దిగుమతి అవుతుందని వారు తెలిపారు. దీని వల్ల మల్బరి సాగు చేసే రైతులు నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పత్తిరైతులకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చారని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు గుర్తు చేశారు. ఎకరాకు రూ. 28 వేలు పెట్టుబడి పెట్టినా...రూ. 30 వేల ఆదాయం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కూడా వర్తింపచేయలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. -
ఆ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
అనంతపురం : అనంతపురం జిల్లా శెట్టూరులో రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త వన్నూరు స్వామి కుటుంబాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబసభ్యులను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని వన్నూరు స్వామి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో మూడో విడత రైతు భరోసా యాత్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
నేటి నుంచి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
-
శర్మ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
జగన్ రెండో విడత రైతు భరోసా యాత్ర
-
రేపటి నుంచి వైఎస్ జగన్ రెండో విడత రైతు భరోసా యాత్ర
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నుంచి రెండో విడత రైతు భరోసా యాత్ర నిర్వహిస్తారని ఆ పార్టీ రైతు నాయకుడు ఎమ్వీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... గిట్టుబాటు ధరలు లేక, రుణమాఫీ జరగకపోవడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని నాగిరెడ్డి ఆరోపించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే వైఎస్ జగన్ రేపట్టి నుంచి రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. -
'వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర విజయవంతమైంది'
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర విజయవంతమైందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షడు శంకర్‌నారాయణ వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో శంకర్‌నారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రైతు సమస్యలపట్ల చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు ఉండేవి కావని ఆయన అన్నారు. చంద్రబాబు రైతు సమస్యలను పక్కనపెట్టి... ఇసుక, రియల్ ఎస్టేట్ మాఫీయాను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రతో అయిన చంద్రబాబు సర్కార్‌కు కనువిప్పు కలగాలని ఆ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. ఇప్పటికైనా కరువు రైతులను ఆదుకోవాలని చంద్రబాబు సర్కార్‌కు ఆయన హితవు పలికారు. -
'అధైర్యపడవద్దు నేనున్నా'
అనంతపురం: ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జల్లాలో ఐదో రోజుకు చేరింది. ఆయన గురువారం ఉదయం పామిడి నుంచి రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన రైతులు, మహిళలు, వృద్ధులు వైఎస్ జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధైర్యపడవద్దని, మీకు అండగా నేనున్నానని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చి రైతు కుటుంబాల్లో ధైర్యం నింపారు. -
'కుటుంబ కలహాలతోనే రైతుల ఆత్మహత్యలు'
తూర్పుగోదావరి(మలికిపురం): తమ ప్రభుత్వం వచ్చాక రాష్ర్టంలో అప్పులు, పంట నష్టాల వల్ల ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన మాట్లాడుతూ...కొందరు రైతులు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడితే, వారు సాగు అప్పుల కారణంగా చనిపోయినట్టు చిత్రిస్తున్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నరైతు భరోసా యాత్రవల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండదన్నారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రంతో పోరాడుతామని రాజప్ప అన్నారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో అన్ని పార్టీలూ తీర్మానం చేయాల్సి ఉందని, అలాగే ఇతర రాష్ట్రాల మద్దతు కూడా అవసరమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా, కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని చినరాజప్ప చెప్పారు.