నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ | Ananthapur Rythu bharosa yatra : YS Jagan consoles Nagaraju family | Sakshi
Sakshi News home page

నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

Published Fri, Jun 3 2016 6:26 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Ananthapur Rythu bharosa yatra : YS Jagan consoles Nagaraju family

అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. పెద్ద పప్పులూరు మండలం రామకోటి కాలనీలో చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. చేనేత కార్మికుడిగా కూలీ గిట్టుబాటు కాకపోవడం, ముడిసరుకు కోసం చేసిన రూ.4 లక్షల అప్పులు తీర్చలేక నాగరాజు 2015 నవంబర్ 29న పురుగులు మందు తాగి, ఇంట్లో ఉరేసుకుని  బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని నాగరాజు భార్య మూడు సార్లు కలెక్టర్లను వేడుకున్నా పైసా సాయం అందలేదు. కనీసం రేషన్ కార్డు కూడా లేకపోవడంతో వితంతు పింఛన్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ తాను కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement