మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ | ys jagan mohan reddy rythu bharosa yatra Fifth dayin anantapur district | Sakshi
Sakshi News home page

మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ

Published Sun, Jan 10 2016 11:18 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ - Sakshi

మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ

అనంతపురం : రాష్ట్రంలోని మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఉప్పరపల్లిలో ఆయన్ని ఆదివారం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిశారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయించాలని వైఎస్ జగన్ని సదరు ఉద్యోగులు కోరారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. 

అలాగే తమ కులాన్ని బీసీల్లో కలిపేందుకు సహకరించాలని కాపు, తెలగ, బలిజ సంఘం నేతలు కూడా వైఎస్ జగన్ కలసి విజ్ఞప్తి చేశారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రం ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఉప్పరపల్లిలో రైతు మారుతి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉప్పరపల్లిలో వైఎస్ జగన్ను డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఉపాధ్యాయ నియామకాలను వెంటనే జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement