
కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర గురువారం ప్రారంభంకానుంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో చేపట్టనున్న రైతు భరోసా యాత్ర గురువారం నుంచి ప్రారంభమౌతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. యాత్ర ఆ రోజు మధ్యాహ్నం శ్రీశైలం నియోజకవర్గం నుంచి ప్రారంభమౌతుందని, అనంతరం నంద్యాల నియోజక వర్గం మీదుగా సాగుతుందని వైఎస్‌ఆర్‌సీపీ ప్రోగ్రామ్స్ కన్వినర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వెల్లడించారు.