రూ. 600 కోట్లు ఎక్కడివి?
యాడికి: అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో మూడో రోజు రైతు భరోసాయాత్రలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం యాడికిలో అశేష ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారని, తమ పాలనలో రైతులు ఆనందంగా ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రతిపక్షాన్ని అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...
- మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా చిక్కటి చిరునవ్వుతో స్వాగతం పలికిన మీ అందరికీ ధన్యవాదాలు
- ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా ఇచ్చేందుకే యాత్ర చేస్తున్నా
- రైతులు చాలా ఆనందంగా ఉన్నారని చంద్రబాబు అవహేళనగా మాట్లాడుతున్నారు
- ఎన్నికలకు ముందు చెప్పింది ఏమిటి తర్వాత చేస్తున్నదేమిటి?
- ఎన్నికలప్పుడు గ్రామగ్రామానికి తిరిగి రైతు రుణాలన్నీ బేషరుతుగా మాఫీ చేస్తామని చెప్పారు
- చేనేత కార్మికులకు రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలని ప్రచారం చేశారు
- తాను ముఖ్యమంత్రి కావడానికి రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, చివరికి చదువుకుంటున్న చిన్నపిల్లలను మోసం చేశారు
- జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు
- జాబు రాకుంటే ప్రతి ఇంటికి రూ. 2 వేలు ఇస్తానని హామీయిచ్చారు
- ఏ ఒక్కరికైనా నిరుద్యోగభృతి ఇచ్చారా అని అడుగుతున్నా
- రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, చేనేత కార్మికులకు, విద్యార్థులను వెన్నుపోటు పొడిచాడు
- ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోపోగా, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు
- రాష్ట్రంలో ఇసుక నుంచి గుడి భూములు అమ్మేదాకా అవినీతి చేస్తున్నారు
- ప్రజల తరపున ఎవరూ మాట్లాడకూడదా?
- ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కొంటున్నారు
- ఎమ్మెల్యేలను కొనడానికి రూ.600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను
- తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపులతో సహ చంద్రబాబు దొరికిపోయారు
- తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు అడగరేం?
- ఓట్లు కోట్లు కేసు మళ్లీ బయటకు తీస్తారన్న భయంతోనే నోరు విప్పడం లేదు
- తన స్వార్థం కోసం 5 కోట్ల మందిని నడిరోడ్డుపై నిలబెట్టారు
- రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీని నిలదీసే ధైర్యం చంద్రబాబుకు లేదు
- ప్రత్యేక హోదా వచ్చివుంటే ఉద్యోగాలు, పరిశ్రమలు వచ్చేవి
- ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం నుంచి వైదొలుతామని ఎందుకు అనడం లేదు
- తన అవినీతిపై సీబీఐతో నరేంద్ర మోదీ దర్యాప్తు చేయిస్తారని భయంతో నోరు మెదపడం లేదు
- చంద్రబాదు మోసం, తప్పు చేసినా, వెన్నుపోటు పొడిచినా ఎవరు అడక్కూదట
- రుణాలు మాఫీ చేస్తానని చేయకపోవడం మోసం కాదా?
- పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం బతకదు
- ఎన్నికలు వచ్చి చంద్రబాబు పాలన బంగాళాఖాతంలో కలిస్తే అందరికీ మంచి జరుగుతుంది
- అందరం ఒక్కటై చంద్రబాబు అసమర్థ పాలనపై పోరాడదాం