'రైతు భరోసా యాత్ర విజయవంతమైంది'
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన రైతు భరోసా యాత్ర విజయవంతమైందని మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు.
అప్పుల బాధతో మరణించిన రైతు, చేనేత కార్మిక కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారని అన్నారు. రైతు చేనేత కార్మికుల ఆత్మహత్యలకు చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని గుర్నాథరెడ్డి డిమాండ్ చేశారు.