Gurnatha Reddy
-
'రైతు భరోసా యాత్ర విజయవంతమైంది'
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన రైతు భరోసా యాత్ర విజయవంతమైందని మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. అప్పుల బాధతో మరణించిన రైతు, చేనేత కార్మిక కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారని అన్నారు. రైతు చేనేత కార్మికుల ఆత్మహత్యలకు చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని గుర్నాథరెడ్డి డిమాండ్ చేశారు. -
'అనంత'లో వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు
-
బంద్‌కు వైఎస్ఆర్సీపీ పిలుపు
-
అరెస్టులకు నిరసనగా.. రేపు అనంతపురం బంద్
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిల అరెస్ట్‌లకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా బంద్‌కు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బి. ప్రసాదరెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యతో అనంతపురంలో చేలరేగిన అల్లర్లకు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డిలు కారణమంటూ వారిద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దాంతో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య అనంతరం జరిగిన ఆందోళనలకు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఆ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణలు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ప్రసాద్ రెడ్డి హత్యను చేధించాల్సిన పోలీసులు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల అరెస్ట్ అమానుషమని చెప్పారు. టీడీపీ నేతలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు దుయ్యబట్టారు. ప్రసాద్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలానికి వారు రావడమే తప్పయితే ఎస్పీ రావడం సమంజసమా? అంటూ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్నారాయణలు సూటిగా ప్రశ్నించారు. -
'ఎస్పీ, డీఎస్పీల సమక్షంలోనే హింస'
-
'వైఎస్ఆర్ సీపీని ఎదుర్కోలేకే భౌతిక దాడులు'
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను అరెస్ట్ చేయడాన్ని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఖండించారు. హత్యకు గురైన రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద రెడ్డి విచారణను పక్కనబెట్టి, పోలీసులు వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా పోలీసులు వ్యవహరించడం బాధాకరమని అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సీపీని రాజకీయంగా ఎదుర్కోలేకే టీడీపీ నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ దౌర్జన్యాలకు నిరసనగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అనంత వెంకట్రామి రెడ్డి చెప్పారు. -
'ఎస్పీ, డీఎస్పీల సమక్షంలోనే హింస జరిగింది'
హైదరాబాద్: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన అల్లర్లకు తాను బాధ్యుణ్ని కాదని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ, డీఎస్పీల సమక్షంలోనే హింస జరిగిందని చెప్పారు. ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన దాడులకు గుర్నాథ రెడ్డి కారణమని అభియోగాలు మోపుతూ, పోలీసులు ఆయనను ఆరెస్ట్ చేశారు. గుర్నాథ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాప్తాడులో హింస జరిగిన సమయంలో తాను పోలీసుల అధికారుల మధ్య ఉన్నానని చెప్పారు. పోలీసుల సమక్షంలో జరిగిన దాడికి తానెలా బాధ్యుణ్ని అవుతానని ప్రశ్నించారు. తాను ఎవరినీ రెచ్చగొట్టేలా, హింసకు ప్రేరేపించాలే మాట్లాడలేదని గుర్నాథరెడ్డి వివరణ ఇచ్చారు. తమపై అభియోగాలు మోపడం దారుణమని అన్నారు. తమ కుటుంబం ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటోందని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ నేతలను అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందని గుర్నాథరెడ్డి ఆరోపించారు. -
పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలపై పోలీసుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బి. ప్రసాదరెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రసాదరెడ్డిని అప్పటికే అక్కడ మాటు వేసిన ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. అయితే ప్రసాదరెడ్డి హత్య అనంతరం జరిగిన అల్లర్లకు గుర్నాథరెడ్డే కారణమని పోలీసులు అభియోగాలు మోపారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి చందును పోలీసులు అదుపులో తీసుకున్నారు. -
కేంద్ర మంత్రులు, ఎంపీలు చవటలు: గురునాథరెడ్డి
సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు చవట దద్దమ్మలని, వారి చేతకానితనం వల్లనే తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజమెత్తారు. వారు ముందే మూకుమ్మడిగా రాజీనామాలు చేసింటే ఈ దుస్థితి ఏర్పడేది కా దని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సా ర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 72 గంటల బంద్‌లో భాగంగా నిరసన కార్యక్రమా లు చేపడుతున్నామన్నారు. రైల్ రోకో చేసి సీమాంధ్ర ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేశామన్నారు. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ అధినేత రెండోమారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని చెప్పారు. కుటిల రాజకీయాలతో రాష్ట్రాన్ని విభజించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఎక్కడ సీబీఐ ద్వారా కేసులు బనాయిస్తుందోనని వారి కాళ్లు పట్టుకుని విభజనకు మద్దతుగా లేఖ రాశారని దుయ్యబట్టారు.