'ఎస్పీ, డీఎస్పీల సమక్షంలోనే హింస జరిగింది' | I have no role in Raptadu riots, says Gurnatha reddy | Sakshi
Sakshi News home page

'ఎస్పీ, డీఎస్పీల సమక్షంలోనే హింస జరిగింది'

Published Sun, May 3 2015 3:15 PM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

'ఎస్పీ, డీఎస్పీల సమక్షంలోనే హింస జరిగింది' - Sakshi

'ఎస్పీ, డీఎస్పీల సమక్షంలోనే హింస జరిగింది'

హైదరాబాద్: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన అల్లర్లకు తాను బాధ్యుణ్ని కాదని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ, డీఎస్పీల సమక్షంలోనే హింస జరిగిందని చెప్పారు. ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన దాడులకు గుర్నాథ రెడ్డి కారణమని అభియోగాలు మోపుతూ, పోలీసులు ఆయనను ఆరెస్ట్ చేశారు.

గుర్నాథ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాప్తాడులో హింస జరిగిన సమయంలో తాను పోలీసుల అధికారుల మధ్య ఉన్నానని చెప్పారు. పోలీసుల సమక్షంలో జరిగిన దాడికి తానెలా బాధ్యుణ్ని అవుతానని ప్రశ్నించారు. తాను ఎవరినీ రెచ్చగొట్టేలా, హింసకు ప్రేరేపించాలే మాట్లాడలేదని గుర్నాథరెడ్డి వివరణ ఇచ్చారు. తమపై అభియోగాలు మోపడం దారుణమని అన్నారు. తమ కుటుంబం ఫ్యాక్షన్కు దూరంగా ఉంటోందని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ నేతలను అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందని గుర్నాథరెడ్డి ఆరోపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement