Prasada reddy murder
-
మా కుటుంబానికి ప్రాణహాని వుంది
-
‘పరిటాల నుంచి మా కుటుంబానికి ప్రాణహాని’
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం ఎక్కువైంది. మూడు సంవత్సరాల క్రితం హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మూడేళ్ల కిందట రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో పరిటాల అనుచరుల చేతిలో వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి దారుణహత్యకు గురైన సంగతి తెల్సిందే. తాజాగా ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రసాద్ రెడ్డికి చెందిన భూమి రికార్డులు రెవెన్యూ అధికారులు తారుమారు చేశారు. టీడీపీ కార్యకర్త చెండ్రాయుడు పేరిట అడంగల్ జారీ చేశారు. దీనిపై ప్రసాద్ రెడ్డి సోదరుడు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహానందరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పరిటాల సునీత తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన అన్నను చంపినట్టే తననూ హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము కొనుగోలు చేసిన భూమిలో కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని చెప్పారు. మంత్రి పరిటాల సునీత నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని మహానంద రెడ్డి విలేకరుల ఎదుట వెల్లడించారు. -
'అనంత'లో వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు
-
'వైఎస్ఆర్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు ఎత్తివేయండి'
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆ పార్టీ నాయకులు జిల్లా ఎస్పీకి విన్నవించారు. రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నాయకుడు ప్రసాద్ రెడ్డిని ఇటీవల దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులను చేస్తూ వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేయగా, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎస్పీ రాజశేఖర్ బాబును కలిశారు. ఘటన స్థలంలో ఉండికూడా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఎస్పీని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడతారనే ఉద్దేశ్యంతో లాఠీఛార్జ్ చేయలేదని ఎస్పీ చెప్పారు. ప్రసాద్ రెడ్డి హత్యానంతరం ప్రజలు అసహనంతో ఉన్నందున తాము శాంతిని కోరామని, అయినా ప్రజలు వినలేదని వైఎస్ఆర్ సీపీ నేతలు వివరించారు. -
తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డికి రిమాండ్
హైదరాబాద్: అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా ఈ మేరకు ఆదేశించారు. అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన అల్లర్లకు బాధ్యుణ్ని చేస్తూ పోలీసులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. -
బంద్కు వైఎస్ఆర్సీపీ పిలుపు
-
అరెస్టులకు నిరసనగా.. రేపు అనంతపురం బంద్
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డిల అరెస్ట్లకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా బంద్కు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బి. ప్రసాదరెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యతో అనంతపురంలో చేలరేగిన అల్లర్లకు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డిలు కారణమంటూ వారిద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దాంతో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య అనంతరం జరిగిన ఆందోళనలకు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఆ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణలు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ప్రసాద్ రెడ్డి హత్యను చేధించాల్సిన పోలీసులు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల అరెస్ట్ అమానుషమని చెప్పారు. టీడీపీ నేతలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు దుయ్యబట్టారు. ప్రసాద్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలానికి వారు రావడమే తప్పయితే ఎస్పీ రావడం సమంజసమా? అంటూ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్నారాయణలు సూటిగా ప్రశ్నించారు. -
'మమ్మల్ని టార్గెట్ చేయడానికే.. సునీతకు మంత్రి పదవి ఇచ్చారు'
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేయడానికే పరిటాల సునీతకు మంత్రి పదవి ఇచ్చారని ఆ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ కీలక నేతలను హతమారుస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు మండల తహశీల్దార్ కార్యాలయంలో ఇటీవల వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులను చేస్తూ వైఎస్ఆర్ సీపీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
'ఎస్పీ, డీఎస్పీల సమక్షంలోనే హింస'
-
'వైఎస్ఆర్ సీపీని ఎదుర్కోలేకే భౌతిక దాడులు'
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను అరెస్ట్ చేయడాన్ని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఖండించారు. హత్యకు గురైన రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద రెడ్డి విచారణను పక్కనబెట్టి, పోలీసులు వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా పోలీసులు వ్యవహరించడం బాధాకరమని అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సీపీని రాజకీయంగా ఎదుర్కోలేకే టీడీపీ నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ దౌర్జన్యాలకు నిరసనగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అనంత వెంకట్రామి రెడ్డి చెప్పారు. -
'ఎస్పీ, డీఎస్పీల సమక్షంలోనే హింస జరిగింది'
హైదరాబాద్: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన అల్లర్లకు తాను బాధ్యుణ్ని కాదని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ, డీఎస్పీల సమక్షంలోనే హింస జరిగిందని చెప్పారు. ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన దాడులకు గుర్నాథ రెడ్డి కారణమని అభియోగాలు మోపుతూ, పోలీసులు ఆయనను ఆరెస్ట్ చేశారు. గుర్నాథ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాప్తాడులో హింస జరిగిన సమయంలో తాను పోలీసుల అధికారుల మధ్య ఉన్నానని చెప్పారు. పోలీసుల సమక్షంలో జరిగిన దాడికి తానెలా బాధ్యుణ్ని అవుతానని ప్రశ్నించారు. తాను ఎవరినీ రెచ్చగొట్టేలా, హింసకు ప్రేరేపించాలే మాట్లాడలేదని గుర్నాథరెడ్డి వివరణ ఇచ్చారు. తమపై అభియోగాలు మోపడం దారుణమని అన్నారు. తమ కుటుంబం ఫ్యాక్షన్కు దూరంగా ఉంటోందని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ నేతలను అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందని గుర్నాథరెడ్డి ఆరోపించారు. -
పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలపై పోలీసుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బి. ప్రసాదరెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రసాదరెడ్డిని అప్పటికే అక్కడ మాటు వేసిన ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. అయితే ప్రసాదరెడ్డి హత్య అనంతరం జరిగిన అల్లర్లకు గుర్నాథరెడ్డే కారణమని పోలీసులు అభియోగాలు మోపారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి చందును పోలీసులు అదుపులో తీసుకున్నారు.