హైదరాబాద్: అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా ఈ మేరకు ఆదేశించారు. అనంతపురం జిల్లా జైలుకు తరలించారు.
రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన అల్లర్లకు బాధ్యుణ్ని చేస్తూ పోలీసులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.
తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డికి రిమాండ్
Published Sun, May 3 2015 8:01 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM
Advertisement
Advertisement