అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆ పార్టీ నాయకులు జిల్లా ఎస్పీకి విన్నవించారు. రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నాయకుడు ప్రసాద్ రెడ్డిని ఇటీవల దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులను చేస్తూ వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేయగా, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎస్పీ రాజశేఖర్ బాబును కలిశారు. ఘటన స్థలంలో ఉండికూడా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఎస్పీని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడతారనే ఉద్దేశ్యంతో లాఠీఛార్జ్ చేయలేదని ఎస్పీ చెప్పారు. ప్రసాద్ రెడ్డి హత్యానంతరం ప్రజలు అసహనంతో ఉన్నందున తాము శాంతిని కోరామని, అయినా ప్రజలు వినలేదని వైఎస్ఆర్ సీపీ నేతలు వివరించారు.
'వైఎస్ఆర్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు ఎత్తివేయండి'
Published Sun, May 3 2015 8:40 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement