'కుటుంబ కలహాలతోనే రైతుల ఆత్మహత్యలు' | formers suicides are with thier family strifes only, says chinarajappa | Sakshi
Sakshi News home page

'కుటుంబ కలహాలతోనే రైతుల ఆత్మహత్యలు'

Published Tue, Feb 24 2015 9:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

'కుటుంబ కలహాలతోనే రైతుల ఆత్మహత్యలు'

'కుటుంబ కలహాలతోనే రైతుల ఆత్మహత్యలు'

తూర్పుగోదావరి(మలికిపురం): తమ ప్రభుత్వం వచ్చాక రాష్ర్టంలో అప్పులు, పంట నష్టాల వల్ల ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన మాట్లాడుతూ...కొందరు రైతులు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడితే, వారు సాగు అప్పుల కారణంగా చనిపోయినట్టు చిత్రిస్తున్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నరైతు భరోసా యాత్రవల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండదన్నారు.   విభజన చట్టంలో హామీ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రంతో పోరాడుతామని రాజప్ప అన్నారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో అన్ని పార్టీలూ తీర్మానం చేయాల్సి ఉందని, అలాగే ఇతర రాష్ట్రాల మద్దతు కూడా అవసరమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా, కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని చినరాజప్ప చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement