ఢిల్లీలో నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన | YS Jagan mohan reddy to meet national leaders for united state today | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన

Published Sat, Nov 16 2013 8:42 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ఢిల్లీలో నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన - Sakshi

ఢిల్లీలో నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఏకైక ఉద్దేశంతో ఆయన ఢిల్లీలో పలు జాతీయ పార్టీల నేతలను కలిసి వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే రాష్ట్ర సమైక్యత కోసం వివిధ జాతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు వారితో చర్చలు జరపనున్నారు.  ముందుగా శనివారం నాడు వామపక్షాల నాయకులను కలవనున్న జగన్.. ఆదివారం బీజేపీ, ఇతర పార్టీల నాయకులను కూడా కలుస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను వారికి వివరిస్తారు. జగన్తో పాటు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నాయకులు కొణతాల రామకృష్ణ, వల్లభనేని బాలశౌరి, గట్టు రామచంద్రరావు, మైసూరారెడ్డి తదితరులు కూడా ఢిల్లీలో పలువురు నేతలను  కలుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement