రెండు రాష్ట్రాల ప్రజలూ సుఖసంతోషాలతో ఉండాలి: వైఎస్ జగన్‌ | Ys jagan mohan reddy to wish all the state of people happiness | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల ప్రజలూ సుఖసంతోషాలతో ఉండాలి: వైఎస్ జగన్‌

Published Sat, Aug 16 2014 2:23 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Ys jagan mohan reddy to wish all the state of people happiness

* వైఎస్సార్‌సీపీ అధినేత జగన్
* పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరణ

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన 68వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రతి అవ్వా, తాతలకు, ప్రతి సోదరి, సోదరులకు ఈ స్వాతంత్య్ర దినోత్సవం సుఖ సంతోషాలనివ్వాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజలతో గంటకుపైగా గడిపి వారందరితో ముచ్చటించారు.
 
 షారిఖ్‌కు అభినందన..
 అమెరికాలోని కనెక్టికట్ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రంలో పీహెచ్‌డీ సీటు సాధించిన కర్నూలుకు చెందిన షారిఖ్ అహ్మద్‌ను జగన్ ఈ సందర్భంగా అభినందించారు. దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement