సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు జనవరి 29కి వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో భాగంగా నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకట రమణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్‌రెడ్డి, నిత్యానందరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌లు శ్యామ్యూల్, మన్మోహన్‌సింగ్, ఆదిత్యనాథ్‌దాస్, శ్యాంబాబు తదితరులు శుక్రవారం కోర్టు ముందు హాజరయ్యారు.
అలాగే సీబీఐ ఇటీవల దాఖలు చేసిన 11వ చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతి, ఇందూ సంస్థల అధినేత ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డి, వసంత ప్రాజెక్ట్ అధినేత వి.వి.కృష్ణప్రసాద్, జితేంద్ర విర్వానీ తదితరులు హాజరై పూచీకత్తులు సమర్పించారు. ఇదే చార్జిషీట్‌లో నిందితుల జాబితాలో ఉన్న పలు కంపెనీల ప్రతినిధులు హాజరై పూచీకత్తు బాండ్లను సమర్పించారు.
జగన్ కేసు విచారణ జనవరి 29కి వాయిదా
Published Sat, Dec 20 2014 2:50 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement