
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు అఖండ విజయం కట్టబెట్టడంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను ఏడాది కాలంలోనే అమలు చేశారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. పాఠశాల విద్యార్థుల నుంచి పండు వృద్దుల వరకు అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.
వైఎస్ జగన్ ఏడాది పాలనపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారు తమ అనుభవాలను, అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకోవచ్చు. దాంతోపాటు చేయాల్సిన పనులకు సంబంధించి ఏవైనా సూచనలు, సలహాలను కూడా మాకు పంపొచ్చు. అభిప్రాయాలను webeditor@sakshi.comకు మెయిల్ చేయండి. మీ అభిప్రాయాలు పంపినప్పుడు వాటితో పాటు మీ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ వంటి పూర్తి వివరాలతో పంపగలరని మనవి.
Comments
Please login to add a commentAdd a comment