
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రజల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత వేగంగా స్పందిస్తారో మరోసారి రుజువైంది. లాక్‌డౌన్ వల్ల గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్.. వారికి అన్ని రకాలుగా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ విధించడంతో ఏపీకి చెందిన 5 వేల మంది మత్స్యకారులు గుజరాత్‌లోని వెరావల్‌లో చిక్కుకుపోయారు. అయితే అక్కడ వారు పడుతున్న ఇబ్బందులను ఏపీ ప్రభుత్వానికి విన్నవించారు.
దీనిపై తక్షణమే స్పందించిన సీఎం వైఎస్ జగన్.. వారికి సాయం అందిచాల్సిందిగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్రకు ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు శ్రీకాకుళం నుంచి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గుజరాత్‌కు పంపించారు. ఆ బృందం జాలర్లకు వసతి, ఆహారంతోపాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. జాలర్ల యోగ క్షేమాలు ముఖ్యమని ప్రభుత్వం తెలిపింది. వారు రాష్ట్రానికి తిరిగి వచ్చేంతవరకు వారి బాగోగులు చూసుకుంటామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment