సాక్షి, గుంటూరు : దేశ దళిత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రిజర్వేషన్ల పితామహుడు, దేశ దర్శనికుడు మహాత్మా జ్యోతిరావ్‌పూలేకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న ఆయన బుధవారం ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని జ్యోతిరావ్‌పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పూలే ఆశయాలు యువతకు ఆదర్శమని అన్నారు.
భారతదేశంలో నిమ్నకులాల అభ్యున్నతికి కృషి చేసిన పోరాటయోధుడు జ్యోతిరావుపూలే అని కొనియాడారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని అందుకోసం విద్యను చదువుకొవాలని ప్రోత్సహించి, స్వయానా ఆయనే పాఠశాలలను నిర్మించి, తన భార్య సావిత్రిబాయికి విద్యాబుద్ధులు చెప్పి, మహిళల కోసం తన భార్యను ఉపాధ్యాయురాలుగా నియమించిన స్ఫూర్తిప్రధాత అన్నారు. సామాజిక చైతన్యం కావాలని పోరుసల్పిన సామాజిక ఉద్యమ పితామహుడు జ్యోతిరావ్‌పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
Paying tributes to Mahatma Jyotirao Phule, who fought relentlessly against social inequalities and strived for the downtrodden. pic.twitter.com/TFTYp6KK8z
— YS Jagan Mohan Reddy (@ysjagan) 11 April 2018
Comments
Please login to add a commentAdd a comment