సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్
విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా బీహార్ సీఎం, జేడీ(యూ) నేత నితీష్‌కుమార్‌ను ఈనెల 13న పాట్నాలో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నితీష్‌కుమార్ 13న అపాయింట్‌మెంట్ ఇచ్చారని తెలి పారు. పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టుల ఇన్‌చార్జ్ న్యాయమూర్తి ఎంవీ రమేష్... దానిపై సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.
బీహార్ సీఎంతో భేటీకి అనుమతివ్వండి
Published Thu, Dec 12 2013 1:43 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement