
జంగారెడ్డిగూడెంలో మాట్లాడుతున్న పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభ మంగళవారం కొయ్యలగూడెంలో నిర్వహించనున్నట్టు పార్టీ ఏలూరు లోక్‌సభా స్థానం అభ్యర్థి కోటగిరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు జంగారెడ్డిగూడెం పట్టణం, మండలం నుంచి అ«ధికంగా పార్టీ శ్రేణులు వచ్చి ఆయనకు స్వాగతం పలకాలని కోరారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని, కార్యకర్తలు గ్రామాల్లో చురుగ్గా పర్యటిస్తూ వైఎస్సార్ నవరత్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
ఈ 20 రోజులు పార్టీ కార్యకర్తలు కష్టించి పనిచేసి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలన్నారు. జగన్ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. కల్లబొల్లి హామీలతో మోసం చేస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎవరికి ఎటువంటి అవసరమొచ్చినా తాను అందుబాటులో ఉంటానని, తనను ఎప్పుడైనా కలవవచ్చని శ్రీధర్‌బాబు చెప్పారు.
జగన్‌మోహన్‌రెడ్డి సభకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మండవల్లి సోంబాబు, పాశం రామకృష్ణ. పట్టణ అధ్యక్షుడు పీపీఎన్ చంద్రరావు, మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చనమాల శ్రీనివాస్, ఏలూరు పార్లమెంటరీ జిల్లా సంయుక్త కార్యదర్శులు రాఘవరాజు ఆదివిష్ణు, కొయ్య లీలాధరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ అభ్యర్థిగా శ్రీధర్‌ను ప్రకటించటంపై హర్షం
వైఎస్సార్ సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్‌ను పార్టీ అధిష్టానం ప్రకటించటంపై పార్టీ శ్రేణులు జంగారెడ్డిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వందనపు సాయిబాలపద్మ స్వీట్లు పంపిణీ చేశారు.