
మిరియాల కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపునాడు అధ్యక్షుడు దివంగత మిరియాల వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం విశాఖపట్నం వెళ్లిన వైఎస్ జగన్ మిరియాల వెంకట్రావు ఇంటికి వెళ్లారు. వెంకట్రావు చిత్రపటం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్.. వెంకట్రావు కుటుంబ సభ్యులను ఓదార్చారు.