సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి సంబంధించిన కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకంగా ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలపై క్లాస్ తీసుకోవాల్సిందిగా ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జీ వై.వి. సుబ్బారెడ్డిని ఆదేశించారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న వారంతా పేద వర్గాలకు చెందిన పిల్లలేనని, వారి జీవితాలు మారాలన్న ఆలోచనతోనే ఇంగ్లీష్ మీడీయం పెడుతున్నట్లు తెలిపారు.
ఆంగ్ల మాధ్యమం వద్దంటున్న పత్రికలు, పార్టీల అధిపతుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారి పిల్లలు మాత్రమే ప్రధానంగా ప్రభుత్వ బడుల్లో ఉంటున్నారు, అందుకే ఇంగ్లీష్ మీడియంతోనే వారి జీవితాలు మారతాయనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించినా, వ్యతిరేకిస్తూ ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని వ్యాఖ్యానించారు. ధనికుల పిల్లలకు మాత్రమే ఇంగ్లిషు మీడియం, పేదపిల్లలకు తెలుగు మీడియం అన్న విధానాన్ని సమర్థిస్తూ ఎవరు వ్యాఖ్యలు చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు లేదా పార్టీ నుంచి బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment