అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి వైఎస్ కృషి
అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి వైఎస్ కృషి
Published Mon, Sep 2 2013 3:55 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షల మేరకు వారి అంచనాలను మించి రాష్ట్రంలో గ్రామగ్రామాన ఇంటింటికీ సంక్షేమం అందించారు. జలయజ్ఞం అయినా, పారిశ్రామిక అభివృద్ధి అయినా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ప్రాజెక్టులు, పరిశ్రమలు ప్రారంభించారు. విభజన అంశం వచ్చినప్పుడు తొమ్మిది కీలక అంశాలపై అధ్యయనానికి ప్రభుత్వ ఉత్తర్వులతో రోశయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా, బలమైన రాష్ట్రంగా, తెలుగువారంతా ఏకంగా, ఎంతో బలంగా ఉండాలనేది ఆయన ఆశ, ఆకాంక్ష. అందుకే ఏఏ ప్రాంతానికి ఏం కావాలి? ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలి? అని లోతుగా ఆలోచించి చేశారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 86 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. కోస్తా ప్రాంతంలో పోర్టుల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్‌లో, తెలంగాణలో ఐటీ, కెమికల్ తదితర పరిశ్రమలను ప్రోత్సహించారు. ప్రాజెక్టులన్నీ పూర్తయినా రాయలసీమకు 17 శాతం నీళ్లు మాత్రమే వస్తాయి.
అందుకే సీమలో మైనింగ్ పరిశ్రమను, దాని ఆధారంగా పరిశ్రమలను అభివృద్ధి చేశారు. అలాగే అన్ని జిల్లాల్లో విద్యా, వైద్య రంగాలను అభివృద్ధి చేసే కృషి చేపట్టారు. జిల్లాకో ఐఐటీ, ఒక మెడికల్ కాలేజీ, ఒక యూనివర్సిటీ ఉండాలన్నది ఆయన లక్ష్యం. వైఎస్ జీవించి ఉంటే ఇప్పటికి జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి. అన్ని ప్రాంతాల్లోనూ ఆయా పరిశ్రమలు అభివృద్ధి చెంది ఉండేవి. వైఎస్ ఉండివుంటే అసలు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. ఆయన వారసుడిగా నిజాయితీ, నిబద్ధతలతో, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఆయన వారసత్వ పార్టీకి దశాదిశా నిర్దేశం చేస్తూ, రాష్ట్రాన్ని ప్రాణం కంటే మిన్నగా భావించే నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. అందరూ కలిసి సంతోషంగా ఉండే సువర్ణ యుగం వస్తుంది.’’
Advertisement