నవోత్సాహం
ఏలూరు (టూ టౌన్) :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. జిల్లాలో పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను, క్రమశిక్షణ సంఘ సభ్యులను, పార్టీ అధికార ప్రతినిధులను, కోశాధికారిని నియమించడంపై పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఈ మేరకు నియూమకాలు చేపట్టారు. జిల్లాలోని 15 నియోజక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి సమన్యాయం చేయటంతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నెలకొంది.
జిల్లాలో మొత్తం 10 అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించగా, నియోజక వర్గానికి ఒకరిని ఎంపిక చేశారు. పార్టీ క్రమశిక్షణ సంఘంలో గోపాలపురం, ఏలూరు, నరసాపురం నియోజిక వర్గాలకు చెందిన ముగ్గు ర్ని నియమించారు. చింతలపూడి, భీమవరం, ఉంగుటూరు, దెందులూరు, గోపాలపురం నియోజకవర్గాలకు చెందిన ఐదుగురు నాయకులను పార్టీ జిల్లా అధికార ప్రతినిధులుగా నియమించారు. పార్టీ జిల్లా శాఖ కోశాధికారిగా, కార్యాలయ కార్యదర్శిగా ఏలూరు నగరానికి చెందిన డాక్టర్ దిరిశాల వరప్రసాదరావును నియమించారు. అదేవిధంగా జిల్లాస్థారుు నాయకుల సూచనలు, సలహాల మేరకు జిల్లా, మండల స్థాయి కమిటీలను సైతం ఏర్పాటు చేస్తామని పార్టీ అధ్యక్షుడు నాని తెలిపారు. వివిధ హోదాల్లో బాధ్యతలు చేపట్టిన నాయకుల ఏమన్నారంటే...
మహిళా చైతన్యమే లక్ష్యంగా...
జిల్లాలో మహిళలను చైతన్యవంతులను చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ యానికి కృషి చేస్తా. నా బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి పార్టీని ముందుకు తీసుకువెళ్తా. ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు.
- వందనపు సాయిబాల పద్మ,
జిల్లా అధ్యక్షులు, మహిళా విభాగం
యువతను సమాయత్తం చేస్తా
వైఎస్సార్ పార్టీ విజ యానికి జిల్లాలోని యువతను సమాయత్తం చేస్తా. గత ఎన్నికల్లో పార్టీకోసం కష్టపడినందుకు నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు సంతోషంగా ఉంది. పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని వెంట ఉండి ఆయన సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతా.
- పేరిచర్ల విజయ న రసింహరాజు,
జిల్లా అధ్యక్షుడు, యువజన విభాగం
విద్యార్థులు జగన్ వెంటే..
విద్యార్థులంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉంటాం. ఆ దిశగా యువకులను సమన్వయ పరచుకుంటూ ముందుకు సాగుతాం. విద్యార్థుల సంక్షేమం కోసం, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తా.
- గుణ్ణం సుభాష్, జిల్లా అధ్యక్షుడు, విద్యార్థి విభాగం
కార్మికుల సమస్యలపై దృష్టి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పార్టీ. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తాం. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం. టీడీపీ అధినేత చేస్తున్న మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తాం.
-కౌరు వెంకటేశ్వర్లు,
జిల్లా అధ్యక్షుడు, కార్మిక విభాగం
దళితుల అభ్యున్నతికి కృషి
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తాం. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తాం. దళితులను సమాయత్తం చేసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకుంటా.
- చెల్లెం ఆనందప్రకాష్,
జిల్లా అధ్యక్షుడు, ఎస్సీ విభాగం
బీసీలను ఏకతాటిపైకి తెస్తాం
జిల్లాలోని బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి అభివృద్ధి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృషి చేస్తాం. 15 నియోజిక వర్గాలలో పర్యటించి బీసీలకు టీడీపీ చేసిన మోసాలను వివరిస్తాం.
- గంటా ప్రసాదరావు,
జిల్లా అధ్యక్షుడు, బీసీ విభాగం
ఎస్టీల సంక్షేమానికి కృషి
వైస్ రాజశేఖరెడ్డి హయాంలో గిరిజనులకు వేలాది ఎకరాల భూములిచ్చారు. ఎంతోమందికి ఉపాధి క ల్పించారు. టీడీపీ పాలకులు గిరిజనులను పట్టించుకోవడం లేదు. 1/70 చట్టం అమలు, ఐటీడీఏలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం పార్టీ తరఫున పోరాడతాం.
- కొవ్వాసి నారాయణరావు,
జిల్లా అధ్యక్షుడు, ఎస్టీ సెల్
మైనార్టీల అభ్యున్నతి కోసం..
వైఎస్ రాజశేఖరరెడ్డి మైనార్టీలకు అన్నివిధాలుగా న్యాయం చేశారు. చంద్రబాబు మైనార్టీలను పట్టిం చుకోవడం లేదు. వారి అభ్యున్నతి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీలేని పోరాటాలు చేస్తాం.
- మహ్మద్ అస్లాం, జిల్లా అధ్యక్షుడు, మైనార్టీ సెల్
రైతుల కోసం పోరుబాట
రుణమాఫీ పేరుతో మాయమాటలు చెప్పిన చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా చేస్తాం. జిల్లాలోని రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం. రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలబడతాం.
- ఆతుకూరి దొరయ్య, జిల్లా అధ్యక్షుడు, రైతు విభాగం