
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అరెస్ట్
హైదరాబాద్ : శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సచివాలయం దగ్గర వున్న తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి... పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ఆ తరువాత.. పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు.
అటునుంచి అసెంబ్లీ వైపు పాదయాత్రగా వెళ్దామనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ప్రజాప్రతినిధులను గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయటానికి బాబు రాసిన లేఖే కారణమంటూ వైఎస్ఆర్ పార్టీ నేతలు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లోనూ వైఎస్ఆర్ సీపీ నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు.