కడప: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అంతర్జాతీయ స్మగ్లర్, చెన్నైకు చెందిన మణివణ్ణన్ అలియాస్ మణిని వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఢిల్లీలో మణిని అరెస్ట్ చేసి రైల్వేకోడూరుకు తీసుకొచ్చినట్టు జిల్లా ఎస్పీ నవీన్‌గులాటి మంగళవారం కడపలో విలేకరుల సమావేశంలో తెలిపారు. చైనా, నేపాల్, మయన్మార్ తదితర దేశాలకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు కలిగిన మణి స్థానిక స్మగ్లర్లతో కలసి నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
రైల్వే కోడూరు ఎర్రచందనం అక్రమ రవాణా కేసు (72/15)లో ఇతడు నిందితుడిగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇదే కేసులో లోగడ అరెస్ట్ చేసిన మరో నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా మణిని అరెస్ట్ చేశారు.