
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2009లోనే ప్రాజెక్ట్‌కు ఆయన శంకుస్థాపన చేశారని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పరిపాలనా అనుమతులు, 50 కోట్ల నిధులు కూడా వైఎస్సార్ కేటాయించారని విజయసాయిరెడ్డి తెలిపారు.
దీనిని పూర్తి చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినా ఇన్నేళ్లలో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మళ్లీ శంకుస్థాపన చేసి సరికొత్త డ్రామాకు తెరలేపారని ధ్వజమెత్తారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది శ్రీ వైఎస్. 2009లోనే ప్రాజెక్ట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. పరిపాలనా అనుమతులు, 50 కోట్ల నిధులు కూడా కేటాయించారు. దీనిని పూర్తి చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినా ఇన్నేళ్ళలో ఒక్క పైసా విదల్చలేదు. ఈరోజు మళ్ళీ శంకుస్థాపన డ్రామా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2018
Comments
Please login to add a commentAdd a comment