ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు | YSRCP Announced Candidates List @ Prakasam | Sakshi
Sakshi News home page

ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు

Published Mon, Mar 18 2019 11:48 AM | Last Updated on Mon, Mar 18 2019 11:53 AM

YSRCP Announced Candidates List @ Prakasam - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: వైఎస్సార్‌సీపీ తరపున 2019 సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఆదివారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇడుపులపాయలో ప్రకటించారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు ఒంగోలు, బాపట్ల, నెల్లూరు పార్లమెంట్‌ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు.

చీరాల


అభ్యర్థి పేరు : ఆమంచి కృష్ణమోహన్‌ 
పుట్టిన తేదీ : 22.08.1975 
విద్యార్హత: బీఎస్సీ
తల్లిదండ్రులు: వెంకటేశ్వర్లు, సుబ్బరావమ్మ
స్వగ్రామం: పందిళ్లపల్లి, వేటపాలెం మండలం.
కుటుంబం: భార్య సుజాత, ఇద్దరు కుమారులు ( సేతునాయుడు, వెంకటేశ్వర్లు)
స్వస్థలం : పందిళ్లపల్లి, వేటపాలెం మండలం
నేపథ్యం: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 2000లో రాజకీయ అరంగ్రేటం చేసిన ఆయన వేటపాలెం జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. అప్పటికే కొణిజేటి రోశయ్యతో సత్సంబందాలు మెరుగ్గా ఉండటంతో 2006లో వేటపాలెంలోని దేశాయిపేట–2 నుంచి ఎంపీటీసీగా పోటీచేసి వేటపాలెం ఎంపీపీగా ఎన్నికయ్యారు. వేటపాలెం మండలంలో బలమైన నేతగా ఎదిగిన ఆయన 2004లో కొణిజేటి రోశయ్య చీరాలనుంచి పోటీ చేశారు. రోశయ్య విజయానికి కీలకంగా వ్యవహరించిన ఆమంచి కృష్ణమోహన్‌ రోశయ్య రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందారు. 2009లో ప్రత్యక్ష ఎన్నికలకు కొణిజేటి రోశయ్య దూరంగా కావడంతో రోశయ్య స్థానంలో చీరాల అసెంబ్లీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్దిగా పోటీచేసిన జంజనం శ్రీనివాసరావుపై ఆమంచి గెలిచాడు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. అలానే 2014 సార్వత్రి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విభజించడంతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆమంచి నవోదయం పార్టీ నుంచి పోటీచేసి 11వేల ఓట్లతో గెలుపొందాడు. రాష్ట్రంలోనే స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందడంతో ఆమంచికి రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది. అనంతరం మూడున్నరేళ్ల క్రితం ఆమంచి టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీ తరపున చీరాల నుంచి పోటీ చేస్తున్నారు.

దర్శి

 
అభ్యర్ధి పేరు:  మద్దిశెట్టి వేణుగోపాల్‌
పుట్టిన తేదీ:1–1 1966                                                                                                                                                                                                               
విద్యార్హత : బీ.ఈ, డీ.ఎం.ఎం, ఎం. బీఏ
తల్లిదండ్రులు:  కస్తూరమ్మ , శ్రీనివాసులు
సామాజిక వర్గం: కాపు
కుటుంబం: పద్మ, ఇద్దరు, లహరీ, రాజీవ్‌  
స్వగ్రామం: లక్ష్మినరసాపురం, పామూరు మండలం 
రాజకీయ నేపథ్యం:  2009లో పీఆర్పీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసారు. తర్వాత పలు ప్రజా సేవా కార్యక్రమాలు, విద్యాసంస్థలు నిర్వహణ, పలు సాఫ్ట్‌ వేర్‌ సొల్యూషన్స్‌ సంస్థలు, పలు పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేసారు. 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున దర్శి నియోజక వర్గ సమన్వయకర్తగా నియమించారు.

కనిగిరి


అభ్యర్ధిపేరు: బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ 
పుట్టిన తేది: 15.5.1972
విద్యార్హత: ఇంటర్మీడియట్‌
తల్లి దండ్రులు: బి.చినపేరయ్య, లక్ష్మమ్మ  
సామాజిక వర్గం: బీసీ 
కుటుంబం: భార్య–లక్ష్మీ, ముగ్గురు పిల్లలు (అమృత భార్గవి,  వెంకటసాయి, లక్ష్మీనారాయణ ) 
స్వగ్రామం: శివపురం, (కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలం)
ప్రస్తుత నివాసం: కనిగిరి 
వృత్తి: బిల్డర్‌ (బెంగళూరు, హైదరాబాద్‌)    
రాజకీయ నేపథ్యం: 2013లో వైఎస్సార్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. కందుకూరు నియోజకవర్గ సమన్వయ కర్తగా పనిచేశారు. అక్కడ అనేక సేవాహిత కార్యక్రమాలు చేపట్టారు. 2014లో కనిగిరి నియోజకవర్గ అభ్యర్ధిగా కనిగిరిలో పోటీ చేసి, స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు (2019 వరకు) కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జిగా పని చేస్తున్నారు.

పర్చూరు


అభ్యర్థి పేరు: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
పుట్టినతేదీ: 14–12–1953
విద్యార్హత: ఎం.బి.బి.ఎస్, పీజీ
తల్లిదండ్రులు: రమాదేవి, చెంచురామయ్య
సామాజిక వర్గం: ఓసీ
కుటుంబం: భార్య- పురందేశ్వరి, కుమార్తె - నివేదిత, కుమారుడు- హితేష్‌ చెంచురామ్‌
స్వగ్రామం: కారంచేడు గ్రామం, కారంచేడు మండలం, ప్రకాశం జిల్లా
రాజకీయ నేపథ్యం: 1982 లో రాజకీయ ప్రవేశం చేశారు. 1984 లో మార్టూరు ఎమ్మెల్యేగా, 1985 లో పర్చూరు ఎమ్మెల్యే గా, 1989 లో పర్చూరు ఎమ్మెల్యేగా, 1991 లో బాపట్ల ఎంపీగా, 2004 లో పర్చూరు ఎమ్మెల్యేగా, 2009 లో పర్చూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996 లో రాజ్యసభకు ఎంపికయ్యారు. మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. 1987 లో ఎన్టీఆర్‌ క్యాబినేట్లో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ మినిస్టర్‌గా పనిచేశారు.

గిద్దలూరు


అభ్యర్థి పేరు: అన్నా వెంకటరాంబాబు 
తల్లిదండ్రులు: ధనలక్ష్మమ్మ, సుబ్బరంగయ్య
కుటుంబం: భార్య దుర్గాకుమారి, సంతానం: ఒక కుమారుడు, ఒక కుమార్తె
పుట్టిన తేదీ: 01–08–1964
స్వగ్రామం: సైదాపురం, కంభం మండలం
నివాసం : మార్కాపురం
వృత్తి: కాంట్రాక్టరు, కృష్ణ చైతన్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజీ చైర్మన్‌.
సేవా కార్యక్రమాలు: అన్నా సుబ్బరంగయ్య, ధనలక్ష్మమ్మ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా 2004 నుంచి ఉచిత అంబులెన్స్, ప్రతి సంవత్సరం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, 10 మంది పేద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు కల్పించడం. పేదలకు చేయూతనివ్వడం.
రాజకీయ నేపథ్యం: మార్కాపురం ఎమ్మెల్యే కే.పి.కొండారెడ్డి ఆధ్వర్యంలో 1987వ సంవత్సరం నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. అనంతరం 2009లో గిద్దలూరు నుంచి పీఆర్‌పీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2014లో టీడీపీలో చేరి ఓటమి చెందారు. అయినప్పటికీ తన వెంట ఉన్న కార్యకర్తలకు అండగా ఉన్నారు.

కందుకూరు


అభ్యర్ధి పేరు: మానుగుంట మహీధర్‌రెడ్డి    
తల్లిదండ్రులు: దివంగత మానుగుంట ఆదినారాయణరెడ్డి (మాజీ ఎమ్మెల్యే), లలితమ్మ 
స్వగ్రామం: కందుకూరు మండలం, మాచవరం గ్రామం 
పుట్టిన తేదీ: 01–06–1957
విద్యార్హత: బికాం, ఎల్‌ఎల్‌బి 
సతీమణి: జ్యోతి 
కుమార్తెలు: భవ్య, సత్య 
రాజకీయ నేపథ్యం: 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు.  గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. తరువాత 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి చెందారు. 1999లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మున్సిఫల్‌శాఖ మంత్రిగా పనిచేశారు.

సంతనూతలపాడు (ఎస్సీ)


అభ్యర్థి పేరు: తలతోటి జయరత్న సుధాకర్‌బాబు
తల్లిదండ్రులు: అన్నమ్మ, ఛార్లెస్‌
పుట్టిన తేదీ: 23.10.1973
భార్య : వనజ
పిల్లలు: కుమారుడు ఛార్లెస్, కుమార్తె సోనియా ఛార్లెస్‌
విద్యార్హతలు: ఎంబీఏ (ఎల్‌ఎల్‌బీ), పీజీ ఒంగోలు నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌
పదవులు: 1991లో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగంఅధ్యక్షులు, 1997లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, 2001లో స్టేట్‌ప్రచార కార్యదర్శి, 2004లో స్టేట్‌ యూత్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ, 2007లో కాంగ్రెస్‌ యూత్‌ రాష్ట్ర అధ్యక్షులు, 2012లో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 2012లో కర్నాటక, తమిళనాడు రాష్ట్ర పరిశీలకులు, 2018లో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, 2018 నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంవెఎస్సార్‌సీపీ సమన్వయకర్త

ఒంగోలు

అభ్యర్థి పేరు: బాలినేని శ్రీనివాసరెడ్డి 
పుట్టిన తేదీ: 12.12.1964
విద్యార్హత: అండర్‌ గ్రాడ్యుయేషన్‌ 
తల్లిదండ్రులు : రమాదేవి, వెంకటేశ్వరరెడ్డి
కుటుంబం: భార్య శచీదేవి, కుమారుడు ప్రణీత్‌రెడ్డి, కోడలు కావ్య
స్వస్థలం : కొణిజేడు, టంగుటూరు మండలం 
ప్రస్తుత నివాసం: లాయర్‌పేట, ఒంగోలు
రాజకీయ అనుభవం: కాంగ్రెస్‌ పార్టీలో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1999లో తొలిసారిగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2004, 2009లలో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్‌ రికార్డు సొంతం చేసుకున్నారు. రెండోసారి వైఎస్సార్‌ ప్రభుత్వంలో గనులశాఖ, చేనేత జౌళి మరియు స్పిన్నింగ్‌ , చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరుపున పోటీచేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం 6వ సారి ఒంగోలు అసెంబ్లీకి వైఎస్సార్‌ సీపీ తరుపున బాలినేని పోటీ చేస్తున్నారు.

యర్రగొండపాలెం(ఎస్సీ)


అభ్యర్థి పేరు: ఆదిమూలపు సురేష్‌
పుట్టిన తేదీ: 27.04.1964
విద్యార్హత: ఐఆర్‌ఎస్‌
తల్లి దండ్రులు: ఆదిమూలపు సామ్యూల్‌ సామ్యూల్జార్జి, థెరిసమ్మ
సామాజిక వర్గం: ఎస్సీ(మాదిగ)
భార్య: టి.హెచ్‌.విజయలక్ష్మి, కుమారుడు: విశాల్, కుమార్తె: శ్రీష్ఠి
స్వగ్రామం: గజ్జలకొండ, మార్కాపురం మండలం
రాజకీయ నేపథ్యం: 2009లో వైఎస్సార్‌ ప్రోత్సాహంతో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2014లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిగెలుపొందారు. 2009లో పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా, అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యుడుగా, 2014లో పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.

అద్దంకి


అభర్థి పేరు : డాక్డర్‌ బాచిన చెంచుగరటయ్య  
పుట్టిన తేదీ : 24 జనవరి 1946
విద్యార్హత: ఎంబీబీఎస్‌
తల్లిదండ్రులు: బాచిన రాఘవయ్య, కాంతమ్మ
సామాజిక వర్గం: ఓసీ (కమ్మ)
కుటుంబం: భార్య రత్నకుమారి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
స్వగ్రామం: జే పంగులూరు
రాజకీయ నేపథ్యం :  ఎంబీబీఎస్‌ చదివి డాక్టరుగా కొన్నేళ్లపాటు వైద్యునిగా ప్రాక్టీస్‌ చేశారు. 1974లో రాజకీయాల్లోకి వచ్చారు. 1983, 1989, 1994,1999 సార్వత్రిక ఎన్నికల్లో అద్దంకి ఎమ్మెల్యేగా పని చేశారు. మొత్తం నాలుగు సార్లు అద్దంకి ఎమ్మెల్యేగా పనిచేశారు. రెండు సార్లు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలుపొందారు.

కొండపి(ఎస్సీ)


అభ్యర్థి పేరు: మాదాసి వెంకయ్య
పుట్టిన తేది: 10–11–1968
తల్లి దండ్రులు : కోటమ్మ, కోటయ్య 
స్వగ్రామం : కారుమంచి, టంగుటూరు  మండలం
ప్రస్తుత నివాసం: ఉలవపాడు
విద్యార్హతలు: ఎంబీబీఎస్, ఎంఎస్‌
నేపథ్యం: డాక్టర్‌గా పేదలకు ఎనలేని వైద్య సేవలు అందిస్తున్నారు. మదర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట ఉచిత వైద్య పేవలు. వెంకయ్య వైద్య సేవలకు గుర్తింగా రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు సైతం తీసుకున్నారు. సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డు అందుకున్నారు.రాజకీయ నేపథ్యం లేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో డాక్టర్‌ వృత్తికి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీలో చేరారు. తొలిసారి కొండపి నుంచి పోటీ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement