విశాఖపట్నం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం మరింత వేడెక్కనుంది. మహాత్ముని జయంతి రోజైన అక్టోబర్2 నుంచి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరగనున్న సమై క్య ఉద్యమ షెడ్యూల్ ఖరారయింది. తెలుగువారం తా ఒక్కటిగా ఉండాలన్న జనావళి ఆకాంక్షలకు అ ద్దం పట్టేలా, ఉద్యమ సెగ పాలకులకు, ప్రతిపక్ష నేతలకు సోకే విధంగా తమ కార్యక్రమాలు ఖరారయ్యాయని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ సమైక్యాంధ్ర ఉద్యమ కార్యక్రమ కో-ఆర్డినేటర్ బుచ్చి మహేశ్వరరావు ఆదివారం విశాఖలో ప్రకటించారు. మొదటి నుంచీ సమైక్యవాదాన్ని ధైర్యంగా వినిపిస్తున్న వ్యక్తి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్న సంగతి అందరూ గుర్తుంచుకోవాలన్నారు. నెల రోజుల పా టు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా విజయవంతం చేయాలన్నారు.
ఇవీ ముఖ్య ఘట్టాలు
=అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు, ఇతరుల నిరవధిక నిరాహారదీక్షలు, అనంతరం రిలే నిరశనలు.
=4న గుంటూరు నుంచి విజయవాడ వరకూ నిర్వహించే ట్రాక్టర్ ర్యాలీలో అందరూ పాల్గొనాలి.
=7న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ వారి ఇళ్ల ఎదుట శాంతియుత ధర్నాలు.
=10న అన్ని మండల కేంద్రాలలో రైతులతో దీక్షలు.
=17న అన్ని నియోజకవర్గాల్లో ఆటోలు,రిక్షాలతో భారీ ర్యాలీలు.
=26న జిల్లాలోని సర్పంచ్‌లు, సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులతో జిల్లా కేంద్రాల్లో ఒక రోజు దీక్ష.
=29న అన్ని నియోజక వర్గా కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో కార్యక్రమాలు.
=నవంబర్ 1న నియోజక వర్గాల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, సమైక్యాంధ్ర కోరుతూ తీర్మానాలు ప్రవేశపెట్టాలి.
వైఎస్సార్‌సీపీ ఆందోళన షెడ్యూల్ ఖరారు
Published Mon, Sep 30 2013 2:36 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement