rulers
-
మాటకు కట్టుబడి...
మన తెలుగు రాజు హాలుడు సంస్కృతం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు పండితులు వస్తారు నేర్పేందుకు. ఒకడు గుణాఢ్యుడు. రెండు శర్వవర్మ. ‘నేను మీకు సంస్కృతం నేర్పాలంటే 12 సంవత్సరాలు పడుతుంది’ అంటాడు గుణాఢ్యుడు. రాజుగారి అర్జెన్సీ గమనించిన శర్మవర్మ ‘నేను ఆరు నెలల్లో నేర్పుతాను’ అంటాడు. అది అసాధ్యం. కనుకనే గుణాఢ్యుడు ఆగ్రహంతో ‘అదే జరిగితే నాకు తెలిసిన సంస్కృత, ప్రాకృత, దేశ భాషలన్నింటినీ విడిచి పెట్టేస్తాను’ అంటాడు. శర్వవర్మ ఏవో తిప్పలు పడి కొత్త వ్యాకరణం రాసి ఆరు నెలల్లో రాజుగారికి సంస్కృతం వచ్చు అనిపిస్తాడు. ఇందుకు గుణాఢ్యుడు ఆశ్చర్యపోయి, మొత్తానికి సాధించావ్ అనేసి తన దోవన తాను పోతే ఎవరూ ఏమీ అనరు. తల తీసి మొలేయరు. కాని మాటకు విలువ ఇచ్చే కాలం అది. గుణాఢ్యుడు మహా పండితుడు. భాషే జీవంగా జీవించేవాడు. అలాంటివాడు తానిచ్చిన మాటకు విలువనిచ్చి తనకు తెలిసిన అన్ని భాషలను వదిలిపెట్టి, మౌనిగా మారి, అడవులకు వెళ్లిపోతాడు. అక్కడ అతను పైశాచి భాష నేర్చుకుని ‘బృహత్కథ’ రాయడం వేరే విషయం. కాని మాటకు కట్టుబడటం వల్లే కదా ఇన్ని వందల ఏళ్ల తర్వాత గుర్తు చేసుకుంటున్నాము. మనిషి గుంపు జీవనం మొదలెట్టే నాటికి లిపి లేదు. రాతకోతలు లేవు. నోటి మాటే శిలాశాసనం. మాట ఇవ్వడం అంటే ఒప్పందం చేసుకోవడమే. రాజ్యాలు ఏర్పడ్డాక ‘మాటకు కట్టుబడటం’ ఒక విలువగా, యుగ స్వభావంగా స్థాపన చేసేందుకు సత్య హరిశ్చంద్రుడి కథ విశేషంగా వ్యాప్తిలోకి వచ్చింది. హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఇచ్చింది కేవలం మాటే. హరిశ్చంద్రుడు పాలకుడు, రాజు. ఇచ్చిన మాట నెరవేర్చకపోతే ఎవరూ ఏమీ చేయరు. కాని మాట తప్పిన అపప్రథను శిరస్సున మోయడం కంటే రాజ్యాన్ని, భార్యను, కుమారుణ్ణి కూడా కోల్పోయేందుకు సిద్ధమవుతాడు. శ్రీరాముడు మరింత ఉదాత్తుడు. తన మాటకు కాదు, తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి అడవులకు వెళ్లాడు. ‘నువ్వు మాటిస్తే నేనెందుకు వెళ్లాలి నాన్నా’ అనంటే దశరథుడు చేయగలిందేముంది? అందుకే రాముడు దేవుడు. గాంధీ గారు దక్షిణాఫ్రికా వెళుతూ తన తల్లికి ‘మద్యం, మగువ, మాంసం జోలికి వెళ్లను’ అని మాట ఇచ్చారు. అక్కడకు వెళ్లాక మద్యం ఎలాగూ అలవాటు లేదు. మగువకు లోబడలేని నిష్ఠ ఉంది. కాని మాంసం జోలికి వెళ్లకుండా, అక్కడ అదే దొరుకుతుంది కనుక, ఎలా ప్రాణాలు నిలబెట్టుకోవాలో ఆయనకు అర్థం కాలేదు. అయినా సరే, మాట తప్పలేదు– ఆకలికి తాళలేక పచ్చి బియ్యం బొక్కాడు తప్ప. నిజం. అలా ఉండేవారు జనులు, తల్లికి మాట ఇస్తే, గురువు మాట ఇస్తే్త, తమకు తాము మాట ఇచ్చుకుంటే జీవితాంతం కట్టుబడేవారు. ఉత్తరాదిలో ‘ప్రాణ్ జాయ్ పర్ వచన్ నా జాయ్’ అంటారు. మాట పోతే ప్రాణం పోయినట్టే! మరి కల్తీ సరుకు రాకుండా ఉంటుందా? ‘కన్యాశుల్కం’లో కరటక శాస్త్రి తన శిష్యుణ్ణి ఆడవేషం కట్టమని చెప్పి, ఆ వేషంలో లుబ్ధావధాన్లను పెళ్లి చేసుకోమని ‘నువ్వు నెగ్గుకొస్తే మా పిల్లన్నీకిచ్చి ఇల్లరికం వుంచుకుంటాను’ అంటాడు. ‘మాట తప్పితే భూమి తోడ్రా’ అనంటాడు. దానికి శిష్యుడు ‘మీరు యగేస్తే భూవేం చేస్తుందిలెండి?’ అనంటాడు. మాట ఇవ్వడాన్ని పాతకాలపు చాదస్తంగా, మాట తప్పడాన్ని కొత్త జీవన మంత్రంగా పసిగట్టి గురజాడ ‘కన్యాశుల్కం’లో ఆనవాలు వదిలాడు. నిజమే. మనుషులు కాగితాన్ని తప్ప మాటను నమ్మని పరిస్థితి వచ్చింది. ఎక్కడి మాట అక్కడే మర్చిపోవాలి అనే గిరీశాలు మూలకొకడు, మలుపుకొకడు తయారయ్యారు. ‘ఆడిన మాటలు తప్పిన గాడిద కొడకంచు తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ గదన్నా ఘన సంపన్న’ అనే పద్యం వీరి ఎదుట చదివితే ‘తిట్టుకో తిట్టుకో... అలాగే అలాగే’ అని కాఫీ తాగి లేచ్చక్కా పోతుంటారు. కాని ఎంత అధ్వాన్న రోజుల్లోనైనా వడగడితే జారిపోని విలువలు ఎన్నోకొన్ని మనుషులు మిగుల్చుకునే ఉంటారు. మాట తప్పని స్వభావాన్ని వారు నేటికీ గౌరవిస్తూనే ఉన్నారు. ఈ భూమి, ఈ వనరులు, ఈ సంపద, ఈ గాలి, నీరు... వీటన్నింటికీ తాము సమాన హక్కుదార్లమని తెలిసినా, పోరాడి పొందగలిగే శక్తి ఉన్నా, పాలకులుగా... ఏలికలుగా సింహాసనాల్లో కూర్చున్నవారు తమకు నాలుగు మెతుకులుగా విదిల్చితే పొందాలేమోనన్న స్థితికి వారు నెట్టబడినా, ఇలాంటి స్థితిలో కూడా వారు ఎవరి మాట సత్తుదో, ఎవరి మాటలో సత్తువున్నదో సూక్ష్మంగా గమనిస్తూనే ఉంటారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తమ ఇంగితజ్ఞానం అనే గీటురాయిని బయటకు తీస్తూనే ఉంటారు. నమ్మిన మాటను గెలిపిస్తారు. ఒకవేళ అది నమ్మించిన మాట మాత్రమే అని గ్రహిస్తే సందర్భం కోసం కాచుకుని ఉంటారు. ‘తప్పుడు వెధవ’ అనే తిట్టు ఉంది. అంటే తప్పు చేసినవాడు మాత్రమే కాదు మాట తప్పినవాడు కూడా! ప్రజల నుంచి తీసుకుని తిరిగి ప్రజలకు అందించడం అనే ఒక సరళ సూత్రంలో పాలకుడు వాహిక మాత్రమే. ప్రజలకు మంచి చేస్తాను అనే మాట మాత్రమే అతనికి శిరోధార్యం కావాలి. జనం చెవిలో పువ్వు పెట్టే నాలుగు మాటలు చెప్పి తమ మెడలో విజయహారాలు ధరిద్దామనుకుంటే అది గేమ్‌లో భాగమే కావచ్చు. కాని అలాంటి గేమ్‌లో ఠక్కున ఔటవడమే గాక మాటగా కూడా గుర్తురాని స్థితికి దిగజారి పోతారు. మాటలు వెదజల్లకండి. ఇవ్వగలిగిన మాట మాత్రమే ఇవ్వండి. మాట జాగ్రత్త! -
సంస్కరణల స్వీయహననం!
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నెలల తరబడి నిరసన వ్యక్తమవుతున్నా, తాము అనుకున్నదే చేసే పాలకులు ప్రపంచమంతటా ఉంటారు. మొత్తం 93 లక్షల జనాభాలో, రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి వీధికెక్కి నిరసనకు దిగుతున్నా, ఇజ్రాయెల్‌లోని బెంజమిన్ నెతన్యాహూ సర్కార్ తాను అనుకున్నదే చేసింది. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని అత్యంత భారీ నిరసనల్ని సైతం తోసి పుచ్చి, ఇజ్రాయెలీ పార్లమెంట్ వివాదాస్పద న్యాయసంస్కరణల్లో మరో కీలక అంశానికి సోమవారం ఆమోదముద్ర వేసింది. దేశంలో అధికార సమతూకాన్ని మార్చేసే ఈ చర్య సంచలనమైంది. మంత్రులు తీసుకొనే నిర్ణయాలు ‘నిర్హేతుకం’ అనిపించినప్పుడు వాటిని కొట్టివేసేందుకు సుప్రీమ్ కోర్ట్‌కు ఇప్పటి దాకా అధికారముంది. సరికొత్త సోకాల్డ్ ‘సహేతుకత’ బిల్లుతో దానికి కత్తెర పడనుంది. రాబోయే రోజుల్లో మరో ఓటింగ్‌లో న్యాయ నియామకాలపైనా ప్రభుత్వానికే మరిన్ని అధికారాలు కట్టబెట్టాలన్నది తదుపరి ఆలోచన. ఈ మార్పుల్ని కొందరు సమర్థిస్తున్నప్పటికీ, అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. కలిగే విపరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, అధిక శాతం ఇజ్రాయెలీలు లౌకికవాద, వామపక్ష, ఉదారవాదులు. కానీ, తీవ్ర మితవాద పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుతో అక్కడి ప్రభుత్వ విధానమూ మితవాదం వైపు మొగ్గుతోంది. ఆ ప్రభుత్వాలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య తరచూ ఘర్షణ తలెత్తుతోంది. దీనికి విరుగుడుగా కోర్టు కోరలు పీకేయాలనేది ఛాందస, జాతీయవాద నెతన్యాహూ సర్కార్ ప్రయత్నం. పాలకులపై ఉన్న ఏకైక అంకుశమైన కోర్ట్‌ను సైతం అలా ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తే, వ్యవస్థల పరంగా ఉన్న సమతూకం దెబ్బతినడం ఖాయం. అందుకే, ఇన్ని నెలలుగా దేశంలో ఈ భారీ ప్రజాందోళనలు. కార్యనిర్వాహక, శాసననిర్మాణ, న్యాయవ్యవస్థలు మూడింటికీ మధ్య అధికార విభజనలో అనేక అంశాలను మార్చాలని నెతన్యాహూ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన సారథ్యంలోని సాంప్రదాయవాద, మతతత్త్వ సంకీర్ణ ప్రభుత్వం అందుకు కంకణం కట్టుకుంది. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఆయన కోర్టు భవిష్యత్ తీర్పులు తనపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నారని విమర్శకుల మాట. నిజానికి, ఇజ్రాయెల్‌లో రాజ్యాంగమంటూ లేదు గనక, పై మూడు వ్యవస్థల మధ్య వ్యవహారమంతా వ్యక్తిగత చట్టాలు క్రమబద్ధీకరిస్తుంటాయి. పార్ల మెంట్లో రెండో సభ లేదు గనక అది చేసే చట్టాలకు అవసరమైతే ముకుతాడు వేసేలా సుప్రీమ్ కోర్ట్‌కే బలమైన స్థానం ఉందక్కడ! ఇలా న్యాయవ్యవస్థకు అతిగా అధికారాలున్నాయనేది ప్రభుత్వ మద్దతుదార్ల భావన. ఎంపీల్లా జడ్జీలనేమీ ప్రజలు నేరుగా ఎన్నుకోవడం లేదనీ, ఇప్పుడీ ప్రతిపాదిత సంస్కరణలతో అధికార సమతూకం మెరుగై, ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందనీ వారి వాదన. సంస్కరణల్ని వ్యతిరేకిస్తున్నవారు మాత్రం దీన్ని ప్రజాస్వామ్య విధ్వంసం అంటున్నారు. లింగ సమానత్వం, లైంగిక అల్పసంఖ్యాకుల రక్షణ లాంటి అంశాలను గతంలో సుప్రీం పదేపదే సమర్థించిందనీ, రేపు ఈ కొత్త సంస్కరణలతో అందుకు అవకాశం లేక సమాజం చీలిపోతుందనీ వాదిస్తున్నారు. తాజా సంస్కరణలు దేశంలో అతి సాంప్రదాయ వర్గాన్ని బలోపేతం చేస్తాయన్నది లౌకికవాదుల భయం. ఈ అంశం సైన్యం దాకా పాకింది. ఇప్పటికే స్త్రీ పురుషులిద్దరూ సైన్యంలో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధన నుంచి అతి సాంప్రదాయ యూదులను ప్రభుత్వం మినహాయించింది. సుప్రీం దీన్ని తప్పుబట్టి, ఇది దుర్విచక్షణ అని పదే పదే ప్రకటించింది. ఇప్పుడీ న్యాయ సంస్కరణల్ని అమలుచేస్తే, స్వచ్ఛంద సేవ నుంచి వైదొలగుతామంటూ వెయ్యిమందికి పైగా ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ రిజర్విస్టులు హెచ్చరించారు. గూఢచర్య సంస్థలు సహా అనేక ఇతర విభాగాల్లోని వారూ తమదీ ఆ మాటే అంటున్నారు. అదే జరిగితే ఆ దేశ భద్రతకు ముప్పే! మరోపక్క, పార్లమెంట్ ఆమోదించిన సంస్కరణ క్లాజుపై కోర్టుకెక్కనున్నట్టు పౌరసమాజ బృందాలు ప్రకటించాయి. అంటే తమ అధికారాలకు కత్తెర వేయడం సహేతుకమో, కాదో జడ్జీలే పరీక్షించాల్సి వస్తుంది. న్యాయమూర్తులు గనక ఈ సంస్కరణను అడ్డుకుంటే, ఇజ్రాయెల్ ఊహించని జాతీయ సంక్షోభంలో పడవచ్చు. ఒకవేళ దాన్ని నివారించేందుకు ప్రభుత్వం తాజా సంస్కరణను ఉపసంహరించుకుంటే, అది చివరకు పాలక సంకీర్ణం కుప్పకూలడానికి దారి తీయవచ్చు. ఏదైనా చిక్కే! మధ్యప్రాచ్యంలో ఏకైక ఆధునిక ప్రజాస్వామ్యంగా ఇజ్రాయెల్‌కున్న పేరు ఈ మొత్తం వ్యవహారంలో దెబ్బతింటుంది. దేశ ఆర్థికవ్యవస్థ, విదేశాంగ విధానం పైనా దెబ్బ పడుతోంది. న్యాయసంస్కరణల సంక్షోభంతో ఫిబ్రవరి నాటికి 400 కోట్ల డాలర్లు ఇజ్రాయెల్ నుంచి తరలి పోయాయట. అలాగే, దేశ శ్రామికశక్తిలో 11 శాతం మంది దాకా హైటెక్ రంగ ప్రవీణులు. వారిలో అధికశాతం సంస్కరణల్ని వ్యతిరేకిస్తూ, వీధికెక్కినవారే! ఈ సాంకేతిక ప్రతిభాశాలురు దేశం విడిచి పోవచ్చు. అలా జరిగితే అది మరో దెబ్బ. ఇక, న్యాయ ప్రక్షాళనకు బలమైన మద్దతుదారులంతా ప్రధానంగా ఇజ్రాయెల్ దురాక్రమణను సమర్థిస్తున్నవారే! మరోమాటలో ఈ తీవ్ర మితవాదులంతా దేశాన్ని నిరంకుశ మతరాజ్య వ్యవస్థగా మార్చి, ఆక్రమణలతో దేశాన్ని విస్తరించాలని కోరుకుంటున్న వారే. దశాబ్దాల కష్టంతో నిర్మాణమైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల సుస్థిరతకూ, అభివృద్ధికీ, భద్ర తకూ దేనికీ ఇది శ్రేయోదాయకం కాదు. ప్రజాస్వామ్య విలువల పునాదిపై ఎదిగి, పొరుగు దేశాలకు తనను కాస్తంత భిన్నంగా నిలిపిన ఆ మౌలిక సూత్రాన్నే కాలరాస్తానంటే అది ఇజ్రాయెల్‌కు ఆత్మ హననమే. బిల్లుతో నెతన్యాహూ బలోపేతులయ్యారేమో కానీ, ఇజ్రాయెల్ బలహీనమైపోయింది. -
పాలకుల కర్తవ్యం ఇదేనా?
కాలానికీ, అవసరాలకూ తగ్గట్టుగా అన్నీ మారతాయి... మారాల్సిందే. అయితే, ఆ మార్పుల వెనుక ఉద్దేశాల పట్ల అనుమానాలు తలెత్తినప్పుడే అభ్యంతరాలు వస్తాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశ రాజధానిలో చేపట్టిన ‘సెంట్రల్ విస్టా’ ఆధునికీకరణ ప్రాజెక్ట్ తొలి దశ గురువారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన తీరు, ‘రాజ్‌పథ్’కు ‘కర్తవ్యపథ్’గా పేరు మార్చడం చర్చకు తావిచ్చింది అందుకే! కేవలం 19 నెలల్లో ఇండియా గేట్ పరిసరాలు కళ్ళు చెదిరేలా మారిపోయాయి. కనువిందు చేస్తూ, గర్వకారణమనిపించే ఈ ఆధునిక మార్పులను ఆహ్వానించాల్సిందే. ఇండియాగేట్ సమీపాన బ్రిటీష్ కాలంలో కింగ్ అయిదో జార్జ్ విగ్రహమున్నచోట నేతాజీ ప్రతిమ పెట్టడమూ స్ఫూర్తిదాయ కమే. కానీ, భారీ విగ్రహాలు పెట్టి, రోడ్లకు పేర్లు మార్చి, దేశం సుభిక్షమని నమ్మింపజూస్తేనే చిక్కు. బానిసత్వాన్ని వదిలించుకోవాలని నోటితో చెబుతూ, తాము ప్రభువులమన్నట్టు ప్రవర్తిస్తేనే కష్టం. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్, కొత్త పార్లమెంట్‌పై 4 సింహాల చిహ్నం, ఐఎన్ఎస్ విక్రాంత్, సెంట్రల్ విస్టా... ఇలా ప్రతి కొత్త ప్రారంభోత్సవం ఇవాళ ఒక జాతీయవాద ప్రచార ఆర్భాటం. ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ఓ సరికొత్త రాజకీయ నేరేటివ్. గత నెలరోజుల్లోనే దేశవ్యాప్తంగా 30 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనో, ప్రారంభమో చేశారు. అలా దీన్ని 2024 ఎన్నికలకు ముందస్తు సన్నాహంగా మార్చడం పాలకుల గడుసుతనం. ఈ క్రమంలో వలసవాద అవశేషాలను తొలగిస్తున్నామంటూ... సామాన్యులు సైతం స్వేచ్ఛగా తిరిగిన ఇండియాగేట్ ప్రాంతాన్ని ‘కర్తవ్య పథ్’గా వారికి దూరం చేయడమే విరోధాభాస. ఈ ఏడాది స్వాతంత్య్ర దిన ప్రసంగంలోనే ప్రధాని ఈ ‘కర్తవ్యపథ’ నిర్దేశం చేసేశారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోవాలన్న డిమాండ్లను పక్కన బెట్టి, పౌరుల కర్తవ్యాన్ని నొక్కిచెప్పారు. ప్రజలే ప్రభువులని గుర్తు చేస్తున్న రాజ్‌పథ్‌ను, ప్రజలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే కర్తవ్యపథ్గా మార్చారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి సమస్యల పరిష్కారం పాలకుల కర్తవ్యం. అది వదిలేసి ‘నామ్‌కే వాస్తే’ మార్పులపై దృష్టిపెడితే ఎలా? కాన్వాయ్‌ల మొదలు అనేక అంశాల్లో నేటికీ వలస పాలన అవశేషాలనే అనుసరిస్తున్న మన పాలకులు ముందుగా వారు వదులుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిజానికి, రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్, ఇండియా గేట్ మీదుగా పురానా ఖిల్లా దాకా సాగే మార్గం రాజ్‌పథ్. రైజీనా హిల్‌పై నుంచి పురానా ఖిల్లా దాకా ఆ మార్గాన్ని పరికిస్తున్నట్టుగా కట్టిన అప్పటి వైస్రాయ్ భవనమే నేటి రాష్ట్రపతి భవన్. ఆ మాటకొస్తే న్యూఢిల్లీ, అక్కడి భవనాలు, ఇండియా గేట్ లాంటి చారిత్రక కట్టడాలు బ్రిటీష్ హయాంలో నిర్మాణమైనవే. వాటన్నిటినీ బానిస చిహ్నాలుగా తృణీకరిస్తామా? చక్రవర్తి అయిదో జార్జ్ 1911లో భారత సందర్శనకు వచ్చినప్పుడు ‘ఢిల్లీ దర్బార్’ జరిగింది. కలకత్తా నుంచి ఢిల్లీకి దేశ రాజధానిని మార్చారు. ఆ జ్ఞాపకంగా బ్రిటీషర్లు ఈ మార్గానికి ‘కింగ్స్ వే’ అని పేరు పెట్టారు. దాని మీదుగా వెళ్ళే మరో రోడ్‌ను ‘క్వీన్స్ వే’ అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ‘కింగ్స్ వే’ను ‘రాజ్‌పథ్’ అనీ, ‘క్వీన్స్ వే’ను ‘జన్‌పథ్’ అనీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. నిజానికి, ఆ కొత్త పేర్లేమీ పాతవాటికి అనువాదాలు కావు. ‘రాజ్ పథ్’ అంటే రాజుల మార్గమని కాదు... ‘రాజ్య (ప్రభుత్వ) పథ’మనే అర్థం. ఆ రకంగా అప్పుడే ఆ వలస పాలకుల నామకరణా లను ప్రజాస్వామ్య చిహ్నాలుగా మార్చారు. ఆ పేర్లలో జన్‌సంఘ్ సహా ఎవరికీ కనిపించని వలస వాదం, బానిసత్వం తీరా ఇప్పుడు దర్శనమివ్వడమే విడ్డూరం. పేరులో ఏముంది పెన్నిధి అంటారు కానీ, ప్రతి పేరూ భావోద్వేగాలు రేకెత్తించగలదని ఎనిమిదిన్నరేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి తెలుసు. అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2015లోనే వీధులు, నగరాలు, అవార్డుల పేర్లు మార్చే పనిలో పడింది. ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్‌ను అబ్దుల్ కలామ్ రోడ్‌గా మార్చడంతో మొదలుపెట్టి, ప్రధాని నివాసం ఉండే రేస్‌కోర్స్ రోడ్‌ను లోక్‌కల్యాణ్ మార్గ్‌గా, నెహ్రూ స్మారక మ్యూజియమ్ – లైబ్రరీ ఉన్న ఒకప్పటి నెహ్రూ నివాసం తీన్‌మూర్తి భవన్‌ను ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’గా మార్చేసింది. అక్బర్ రోడ్, హుమాయూన్ రోడ్ పేర్లు తదుపరి అజెండాలో ఉన్నాయట. ఈ దేశపు సమ్మిశ్రిత సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పేర్లను తొలగించి, హిందూ పునరుద్ధరణవాద నామకరణాల వల్ల సమాజంలో సామరస్యం కొరవడితే అది పూడ్చలేని నష్టం. ఒక వర్గం కన్నా అధికులమనే భావన మరో వర్గంలో కలిగితే, అది సమాజాన్ని నిలువునా చీలు స్తుంది. 2019 ఎన్నికలకు ముందు ఒక్క యూపీలోనే అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, మొఘల్ సరాయ్ రైల్వే జంక్షన్‌ను జన్‌సంఘ్ సిద్ధాంతవేత్త పేరిట దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా ఏ వలసవాద పాలన అవశేషాలున్నాయని మార్చారు? ఇది దేశ బహుళత్వ గుర్తింపును నిరాకరించడమే. చరిత్రలో మొఘల్ చక్రవర్తుల భాగాన్ని కనుమరుగు చేసే ప్రయత్నమే. రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్ పేరు ధ్యాన్‌చంద్ అవార్డుగా మారడం వెనుకా హాకీ దిగ్గజంపై గౌరవం కన్నా రాజకీయంగా తేల్చుకోదలచిన లెక్కలే ఎక్కువ. హైదరాబాద్ పేరును ‘భాగ్య నగర్’గా మారుస్తామని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటించారు. ఏ చారిత్రక ఆధారాలతో ఆ మాట అన్నారో చెప్పలేం. ఇక, ఢిల్లీని ‘ఇంద్రప్రస్థం’గా మారుస్తారనీ ఓ ప్రచారం. వెరసి, ఈ పేర్ల మార్పు ధోరణితో ఎక్కడికెళతాం? వలస పాలకులు పోయారు కానీ, గద్దెపై పెద్దలు ప్రాధాన్యాలు మర్చిపో తేనే ఇబ్బంది. పాలకులు కర్తవ్యం విడిచి, దోవ తప్పితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కిం కర్తవ్యం? -
పాలకులు కాదు.. పాపాలకులు
విశ్లేషణ ఫైళ్లు మాయం కావన్న నమ్మకమైన వ్యవస్థ ఉంది కనుక మాయమైతే ఏం చేయాలో ఆంగ్లేయులు రాసుకోలేదు. మనం మరీ దారుణం కదా. మాయం చేస్తాం. రికార్డుల చట్టం చేస్తాం. కాని మాయం చేస్తే ఏం చేయాలో రాసుకోం. ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీకరించేది రాజ్యాంగం. సంవిధానం అని కూడా అంటారు. సమతా సమానతా ధర్మాన్ని తీర్చిదిద్దిన ఒక గతిశీల, ప్రగతి శీల ఆచరణాత్మక మార్గదర్శిక మన సంవిధానం. పాటించవలసిన బాధ్యతలను వివిధ విభాగాల అధికారుల మీద మోపిన సూచిక భారత రాజ్యాంగం. ప్రజల హక్కులేమిటో చెబుతూ ప్రభుత్వ బాధ్యతలను నిర్ధారించింది. ప్రభుత్వానివి అపారమైన అధికారాలు. లక్షలకోట్ల ప్రజాధనం మీద శతకోటి జనప్రాణాల మీద పెత్తనం అంటే అత్యధిక అధికారాలు. దేశాధినేతగా ఉన్న వ్యక్తిచేతిలో ఆ అత్యున్నత అధికారం కేంద్రీకరించకుండా మంత్రి మండలి, అందులో అపారమైన శక్తివంతుడైన ప్రధాని మంత్రివర్గ సభ్యులతో చర్చించి సమిష్టిగా నిర్ణయించాలి. మంత్రి వర్గం పార్లమెంటు ఉభయసభల్లో ప్రజాప్రతినిధులకు జవాబుదారు. తన నిర్ణయాలను వారి ముందుంచి అనుమతి తీసుకోవాలి. ఆ చట్టసభ సభ్యులు దేశ ప్రజలకు తాము ఏంచేసారో చెప్పుకొమ్మని చెప్పింది రాజ్యాంగం. మంత్రివర్గం ప్రభుత్వం, పార్లమెంటు పనుల రాజ్యాంగ బద్ధతను సమీక్షించి అవి రాజ్యాంగ వ్యతిరేకమైతే కోప్పడి కొట్టివేసే అత్యున్నతాధికారాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులకు కట్టబెట్టింది. రాజ్యాంగమనే న్యాయపాలనా చక్రంలో ఒక్కో ఆకు ప్రజలకు గ్యారంటీ ఇచ్చిన ఒక్కో హక్కు. ఏ ఒక్క ఆకు (చక్రం పుల్ల) విరిగినా చక్రం బలహీనమవుతుంది. కాలక్రమంలో తుప్పుబట్టి కదలలేకపోతుంది. రాజ్యాంగ ధర్మచక్రాన్ని తుప్పుబట్టకుండా తప్పుబట్టమని చెప్పే కందెనే సమాచార హక్కు. తప్పుల్ని అడిగేసి నిప్పులతో కడిగేసే పౌరులు లేకపోతే, చక్రాలకు, రథాలకు తుప్పుబడుతుంది. హక్కులు దాక్కున్న ఖనిజాలు. వాటిని నిజాలు చేయగల హక్కు ఆర్టీఐ. అధికారంతో విర్రవీగే అధికారులకు ఇది తెలుసు, కాని వారి స్వార్థం, అవినీతి సర్పాలు పడగలెత్తి లేచి చెప్పొద్దంటాయి. వారి నిశ్చర్యలను అడిగితే తప్ప చర్యకు ఉపక్రమించరు. హంతకుడు వెంటనే సాక్ష్యాన్ని హత్య చేసినట్టు తప్పు చేసిన వాడు ఆ దస్తావేజు మాయం చేస్తాడు. సాక్ష్యం ఫైల్ నోట్స్‌లో ఉంటుంది. ఇవ్వక తప్పదు. కనుక మాయం చేస్తారు. ఫైళ్లను మాయం చేస్తే ఎవరు అడుగుతారు? ఎవరిని ఏమంటారు? అసలు ఏం చేస్తారు? దస్తావేజు అదృశ్యం చేస్తే నేరాలు దాగుతాయి. కుంభకోణాలు బయటపడవు. వారితో కలిసున్న నేరగాళ్ల పరంపర అంతా బతికి పోతుంది. సమాచార హక్కును ఈ రోజు మొత్తంగా కబళించే భూతం తప్పిపోయిన దస్తావేజు. లేదా దారి తప్పిన వారు తప్పించిన దస్తావేజు. బ్రిటిష్ పాలనలో ఉన్న ఒకే ఒక గొప్ప క్రమబద్ధమైన లక్షణం ఏమంటే చేసిన ప్రతిపనికీ ఒక దస్త్రం ఉంటుంది. తేదీల వారిగా కాగితాలను భద్రపరిచే విధానం ఉంటుంది. వారు ఫైళ్లు మాయమవుతాయనే ఊహకు కూడా ఆస్కారం ఇవ్వలేదు. ఫైళ్లు చూస్తే చాలు ఏం జరిగిందో చెప్పగలిగేవారు. అవినీతి పనులకు కూడా కాగితాలు ఉండేవి. వారి మీద చర్యలు తీసుకోవడమనేది మళ్లీ వారి వారి నీతిపైన, రాజనీతిపైన ఆధారపడతుందని వేరే చెప్పనవసరం లేదు. కాని దస్తావేజుల సృష్టి, నిర్వహణ, రక్షించడంలో ఆ కచ్చితత్వం, ప్రాచీన అభిలేఖాగారాలకు తరలించే పద్ధతిని భారతీయ పాలకులు రాను రాను నీరుగార్చి చివరకు సమాచార హక్కు వచ్చే నాటికి ఫైలు పోయింది ఏం చేయమంటారు సార్ అనేదాకా తీసుకువచ్చారు. ఫైళ్లు మాయం చేసే వాడు పాలకుడు కాడు. పాపాలకుడు. దీనికి తాజా ఉదాహరణ, బాలగంగాధర్ తిలక్ సినిమా తీయడానికి 2.5 కోట్ల రూపాయలు గ్రాంట్ చేసిన ఫైలు లేకపోవడం, రకరకాల ఉత్సవాలు చేయడానికి ఒక విభాగాన్ని సృష్టించి వంద కోట్లు ఇచ్చారట. ఆ విభాగంలో పనిచేసేవారు పర్మినెంటు ఉద్యోగులు కాదు. వారు వెళ్లిపోయిన తరువాత చాన్నాళ్లకు మరొక విభాగాన్ని తయారుచేసి ఉద్యోగులను నియమించారు. వారికి ఒక్క కాగితం కూడా దొరకలేదట. సమాచార దరఖాస్తు ద్వారా ఈ డబ్బు మాయం, దస్త్రం మాయం సంగతి బయటపడింది, డబ్బు తీసుకున్న తిలక్ సినిమా దొంగ దొరికాడు. కాని డబ్బు ఇచ్చిన దొంగలు, సంతకాలు పెట్టి పంపకాలు చేసుకున్న సర్కారీనౌకర్లు దొరకలేదు. పుచ్చుకున్నవాడు నేరస్తుడే కాని వారికి అప్పళంగా జనం డబ్బు కోట్లు అప్పగించిన వాడు తక్కువ నేరస్తుడా? ఫైళ్లు మాయం కావన్న నమ్మకమైన వ్యవస్థ ఉంది కనుక మాయమైతే ఏం చేయాలో ఆంగ్లేయులు రాసుకోలేదు. కానీ, మనం మాయం చేస్తాం. రికార్డుల చట్టం చేస్తాం. మాయం చేస్తే ఏంచేయాలో రాసుకోం. మార్చి ఆరున కేంద్ర సమాచార కమిషన్ నూతన భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కమిషనర్లతో పదినిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. కాని ఆయన పెద్దమనసుతో అరగంట మాట్లాడారు. మాయమైపోతున్న ఫైళ్లగురించి ఏమయినా చేయాలని, ఒక వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఉందని, ఆ వ్యవస్థ లేకపోతే ఆర్టీఐ అవస్థల పాలవుతుందని ఈ రచయిత చెప్పారు. ప్రధాని చాలా శ్రద్ధగా విన్నారు. ‘‘ఫైళ్లు మాయమైతే పట్టుకోవడంపై వెంటనే దర్యాప్తు జరిపించాలి. డిపార్ట్మెంట్లో ఫైలును మాయం చేసిందెవరో అది ఎక్కడుందో పరిశోధించే సమర్థులు పోలీసు ఉన్నతాధికారులే కదా..’’ అంటూ మరో కమిషనర్ ఐపీఎస్ అధికారి యశోవర్థన్ ఆజాద్ వైపు చూసారు ప్రధాని. తనతో ఉన్న పీఎంఓ, డీఓపీటీ శాఖల మంత్రి జితేందర్ సింగ్ వైపు చూసి ‘ఇది చాలా తీవ్రమైన సమస్య. వెంటనే విచారించే వ్యవస్థ ఏర్పాటు కావాలి’ అని సూచించారు. - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సంపద దోచుకునేందుకే బూటకపు ఎన్కౌంటర్లు
కాజీపేట అర్బన్: ప్రకృతి సంపద దోచుకుని కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేందుకే పాలకులు బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని విరసం నేత వరవరరావు అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ చీకటి ఒప్పందాలకు ప్రతీకనే ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ అని పేర్కొన్నా రు. ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దులో ఇటీవల జరిగి న ఎన్కౌంటర్లో మృతి చెందిన దాడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్ సంస్మరణ సభను ఆదివారం కాజీపేట మండలం రాంపేట గ్రామంలోని స్వగృహం లో స్వామి సోదరుడు సమ్మయ్య, బంధువులు ఏర్పాటు చేశారు. స్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించిన అనంతరం వరవరరావు మాట్లాడుతూ ఉన్నత విద్యనభ్యసించిన స్వామి ప్యారా టీచర్‌గా గ్రామాలు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నాడని, బూర్జువా రాజకీయాలు నచ్చక అప్పటి పీపుల్స్‌వార్ నేటి మావోయిస్టు పార్టీలో 1999 సంవత్సరం చేరి అన తి కాలంలో సెంట్రల్ రీజినల్ బ్యూరో ప్రెస్ ఇన్చార్జి, డీసీఎంగా ఎదిగాడని పేర్కొన్నారు. 2009లో చిదంబరం గ్రీన్‌హంట్ పేరిట, నేడు రాజ్‌నాథ్‌సింగ్ సమాధాన్ ఆపరేషన్ పేరిట ఆదివాసులను బూటకపు ఎన్కౌంటర్లలో చంపుతున్నారని అన్నారు. మావోయిస్టుల ఏజెండానే మా ఏజెండా అని నమ్మబలికిన కేసీఆర్ ఆధికారంలోకి రాగానే 39 మంది ఎన్కౌంటర్లలో బలిచేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా పౌరహక్కుల, ప్రజాసంఘాల నాయకులు జోహర్లు అర్పిస్తూ విప్లవగీతాలు ఆలపించారు. కార్యక్రమంలో స్వామి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజాసంఘాల నాయకులు బండి దుర్గప్రసాద్, బాసిత్, రమాదేవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ సంక్షోభానికి పాలకులే కారణం
– ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : భారతదేశంలో వ్యవసాయ రంగం సంక్షోభానికి పాలకులే కారణమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ఆరోపించారు. గురువారం కార్మిక కర్షక భవన్లో సీఐటీయూ నగర కమిటీ కార్యదర్శి ఎండీ అంజిబాబు అధ్యక్షతన ‘వ్యవసాయ సంక్షోభం–రైతులు, కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడంలేదన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారడంతో వ్యవసాయానికి అనుబంధంగా పనిచేస్తున్న కూలీలు కూడా జీవన భృతిని కోల్పోయి తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులు, కూలీలను ఉదారంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు కే.బడేసాహేబ్ మాట్లాడుతూ..జపాన్‌లో 26 శాతం, అమెరికాలో 80 శాతం, యూరప్‌లో 37 శాతం, చైనాలో 34 శాతం, పాకిస్తాన్లో 26 శాతం వ్యవసాయానికి సబ్సిడీలు ఇస్తుంటే భారతదేశంలో ఇది రెండు శాతమే ఉంటోందన్నారు. సాగునీటి వనరులు ఉన్నా వాటిని వినియోగంలోకి తెచ్చుకునేందుకు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్, పుల్లారెడ్డి, సబ్బయ్య, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
30న కలెక్టరేట్ల ఎదుట ధర్నా
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గాంధీనగర్ : పాలకులు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలు చేయాలని కోరుతూ ఈనెల 30న అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు మహాసభ పిలుపునిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మిక సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్ తెలిపారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మహాసభల తీర్మానాల వివరాలు వెల్లడించారు. 4నుంచి 6 తేదీల్లో కర్నూలు పట్టణంలో మహాసభలు నిర్వహించినట్లు చెప్పారు. భూ బ్యాంకు పేరుతో పేదల ఇళ్ల స్థలాలు, పాఠశాలలు, హాస్పిటళ్లు, కమ్యూనిటీ హాల్స్ లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పేదల ఎసైన్డ్ భూములు, ప్రభుత్వభూములు, రైతులు భూములు లాక్కుని 15 లక్షల ఎకరాలు భూ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నాడని విమర్శించారు. మహాసభల్లో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, ఉపాధి హామీలో 200 పనిదినాలు, రోజు వేతనం రూ. 300 ఇవ్వాలని, సబ్ప్లాన్నిధులు సక్రమంగా వినియోగించాలని పలు తీర్మానాలు చేసినట్లు చెప్పారు. 30వ తేదీన నిర్వహించే ధర్నాలతో ప్రభుత్వం కళ్లు తెరిపించాలని సూచించారు. మహాసభలలో ఎన్నుకున్న నూతన కమిటీని పరిచయం చేశారు. -
పాలకులు మోసం చేశారు
- పునరావాసం కల్పించాలి - మాజీ మావోరుుస్టుల సంఘం ఆధ్వర్యంలో దీక్ష ప్రగతినగర్ : లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చి పాలకులు తమను మోసం చేశారని మాజీ మావోయిస్టుల ఫోరం ఆరోపించింది. సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. తాము జనజీవన స్రవంతిలో కలిస్తే ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఉపాధి అవకాశాలు చూపిస్తామని గత పాలకులు హామీ ఇచ్చారని, అరుుతే ఇప్పటివరకూ తమకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. రాజీవ్ యువశక్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. తమ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంతా తమను మోసం చేస్తూనే ఉన్నారని వాపోయూరు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయనుకున్నామని, మాజీ నక్సల్స్‌ను ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి, ఇంటి స్థలం, ఇల్లు, ఉపాధి కోసం రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చందు, ఫిరోజ్‌ఖాన్, బంజారరెడ్డి,చందర్, లక్షయ్య పాల్గొన్నారు. -
కార్పొరేషన్‌పై విద్యుత్ భారం
- ఏటా రూ.150 కోట్లకు పైగా చెల్లింపు - నీటి శుద్ధి, సరఫరాకు అత్యధికంగా రూ. 100 కోట్లు పింప్రి: విద్యుత్ ఆదా చేయడంలో పుణే కార్పొరేషన్ విఫలమవుతోంది. బిల్లుల రూపంలో ఏటా సుమారు రూ.150 కోట్లకు పైగా చెల్లిస్తోంది. సౌర విద్యుత్ కిట్లను అమర్చుకుంటే 5 శాతం సబ్సిడీ ఇస్తామన్న కార్పొరేషన్ సొంతంగా ఆ ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచించడం లేదు. కార్పొరేషన్ ప్రజలకు నీటి శుద్ధి, సరఫరాకు అత్యధికంగా 95 నుంచి 100 కోట్లు, వీధి దీపాల ఖర్చు, కార్పొరేషన్ కార్యాలయాలకు 50 కోట్లు కార్పొరేషన్ చెల్లిస్తోంది. మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే కార్పొరేషన్‌కు విద్యుత్‌ను మహావితరన్ అందింస్తోంది. అయినా బిల్లు మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం, పాలకుల ఉదాసీనతే కారణం దేశంలో ఎనమిదో పెద్ద నగరంగా పేరుగాంచిన పుణే మిగిలిన ఏడు నగరాల మాదిరి సౌర విద్యుత్‌పై దృష్టి సారించలేకపోతోంది. ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఉదాసీనతే ఇందుకు కారణమని తెలుస్తోంది. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయాలలో అధికారులు లేకున్నప్పటికీ విద్యుత్ దీపాలు, ఏసీలు, ఫ్యాన్లు రోజంతా దుబారాగా తిరుగుతున్నాయి. వీధి దీపాలు, వీధుల్లో నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా నగరంలోని మూడు లక్షలకు పైగా ఉన్న విద్యుత్ దీపాలను సోలార్‌గా మార్చి, దశలవారిగా అన్ని అవసరాలకు సోలార్‌ను వినియోగించుకుంటే కార్పొరేషన్‌కు విద్యుత్ భారం తగ్గుతుంది. -
అధినేతల ధోరణే అసలు సమస్య..
కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలను విస్మరించడం వ ల్లే ప్రజలు ఉద్యమాల బాటపడుతున్నారు. తమకు ఏమి కావాలో ప్రజలే నిర్ణయించుకొని తమ ఎజెండాను రూపొందించుకుంటున్నారు. ప్రజల పక్షాన పాలన నడపాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని తయారు చేస్తున్నది. పదవులు, హోదాలు పొంద డంతోనే పని పూర్తికాదు. అది ఆరంభం మాత్రమే. ఆ తర్వా త ఆ వ్యక్తి తన పాలనకు అను గుణంగా తన చుట్టూ వున్న వ్యవస్థను, విధివిధానాలను దశ, దిశను రూపొందించుకో వాలి. అవి పాలన అవసరా లకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. ఎవరైనా మొదటి దశలోనే తను అనుకున్నవన్నీ సాధించలేరు. అతనికి ఇచ్చే స్వేచ్ఛపైనా, ప్రభుత్వం అందించే సహకారంపైనా, అతను ఏ మేరకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు అనే అంశాలపైన అతని విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఉదా హరణకు ఒక వైస్‌చాన్సలర్‌కి ఆ పదవి యిస్తే అదొక ఉద్యోగంలా వెనువెంటనే ఫైళ్ళు తిరగేసి యూనివర్సిటీ బాధ్యతలు నిర్వర్తిస్తానంటే కుదరదు. ఎందుకంటే ఆ వీసీ గానీ మరే హోదాలో ఉన్న వ్యక్తి అయినాగానీ తనకి ఉన్న సదుపాయాల్లో ఆర్థిక వనరుల్లో తను ఏమేం చేయ గలడు. ఇంకా ప్రభుత్వ సహకారం ఏ మేరకు అవసరం, ప్రభుత్వం ఆ వీసీని పూర్తి స్వేచ్ఛగా పని చేయనిస్తోందా లేదా? లాంటి సవాలక్ష ప్రశ్నలు అతని పనిపైన ప్రభా వం చూపుతాయి. ఈ అన్ని ప్రశ్నలకూ అతనికి సాను కూల సమాధానాలు దొరికినప్పుడే ఆ యూనివర్సిటీ బాధ్యతలను అతను సక్రమంగా నెరవేర్చడం సాధ్యం అవుతుంది. అలాగే ఒక ప్రధాని కూడా గెలవడంతోనే సరిపోదు. తన ఎజెండాని ప్రజలతో ఒప్పించగలగాలి. దానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రజల అంగీకారం లేకుండా ఏకపక్షంగా తన ఎజెండాని అమలు చేసిన కొందరు ప్రధానులు నాయకులుగా గెలిచినా పాలకులుగా ఓడిపోతారు. మన దేశ ప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కు మొదట పాలనానుభవం లేదు. ఆయన రాజకీయ ఉద్యమ నాయకుడు మాత్రమే. దేశంలో మతప్రాతిపది కపై తలెత్తే పరిణామాలు సరిదిద్దుకోకపోతే దేశం విచ్ఛి న్నం అవుతుంది. ప్రజల ఎజెండాను తీసుకొని తనకు, ప్రజలకు మధ్య వారధిని ఏర్పాటు చేసుకోవాలి. ఐక్యత, సమైక్యత పట్ల సరియైన దృక్పథం అలవర్చుకోవాలి. అందుకే నెహ్రూ దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తన ఎజెండాను ప్రజలతో అంగీకరింప జేసుకున్నాడు. ఆ రోజుల్లో దేశ సమైక్యతే ప్రధానమైన ఎజెండా అయింది. దేశంలోని అన్ని ప్రాంతాలను ఒక గొడుగు కిందికి తేవ డంలో ఆయన సఫలీకృతం అయ్యారు. అనేక మతాలు, జాతులు, భాషలు ఉన్న ఈ ప్రాంతంలో ఒకలౌకికవాద పాలనను అందించడం అంత సులువేమీ కాదు. అయితే నెహ్రూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన కార్యాచ రణను రూపొందించుకున్నారు. ఆర్థికాభివృద్ధికి ప్రజల కు అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రణాళికా సంఘా న్ని ఏర్పాటు చేసుకున్నారు. సోవియట్ రష్యా అనుభ వం ఆయనకు ఒక స్ఫూర్తిగా తోడ్పడింది. అయితే ఈ రోజు దేశ నాయకత్వానికి అటువంటి దృక్పథం కొరవడింది. మతతత్వం, కుల అణచివేత, మహిళలపై దౌర్జన్యాలు, దేశ సమగ్రత ప్రధాన సమస్య లుగా మారాయి. దేశంలో ఇటీవల మైనారిటీ మత సంస్థలపై పెరిగిన దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి. చాలా దేశాలు భారతదేశ వైఖరిని బహిరంగంగానే తప్పు పడుతున్నాయి. దేశంలో పదికోట్ల మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న వాళ్ళు అభద్రతా భావానికి లోనయ్యేటట్టు ప్రభుత్వాధి నేతలు ప్రవర్తించడం ప్రమాదకర ధోరణి. మైనారిటీ లను విశ్వాసంలోకి తీసుకొని రక్షణ కల్పించాల్సిన బాధ్య త మెజారిటీ ప్రజలది, ప్రభుత్వాలది. అయితే కొంత మంది మైనారిటీలు మతతత్వంతో వ్యవహరిస్తున్నారని వాదిస్తుంటారు. అయితే మైనారిటీ మతతత్వం కన్నా మెజారిటీ మతతత్వం అత్యంత ప్రమాదకరమైనది. ఈ దేశంలో కుల వివక్ష, పీడన ఎక్కడ చూసినా కనపడుతోంది. దళితులపై, ఆదివాసీలపై సాగుతున్న అత్యాచారాలు ఇందుకు ఉదాహరణ. అలాగే మహిళల కు రక్షణ కరువైంది. స్త్రీలపై పెరుగుతున్న గృహహింస కుటుంబాల విచ్ఛిన్నానికి దారితీస్తోంది. కేంద్ర ప్రభు త్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలను విస్మరిం చడం వల్ల ప్రజలు ఉద్యమాల బాటపడుతున్నారు. తమకు ఏమి కావాలో ప్రజలే నిర్ణయించుకొని తమ ఎజెండాను రూపొందించుకుంటున్నారు. ప్రజల పక్షాన పాలన నడపాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని తయారు చేస్తున్నది. అందుకే పాలకులు ప్రజల ఎజెండాను విస్మరించకుండా, ప్రజల ఎజెండానే పాలకుల కార్యక్రమంగా మలచుకొని పాలన సాగిం చాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు నడిపే వాళ్ళు ప్రజాపాలకులు అవుతారు. - చుక్కా రామయ్య, వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త -
గతపాలకుల నిర్లక్ష్యం వల్లే వెనుకబాటు
మహబూబ్‌నగర్ రూరల్: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని పార్లమెంటరీ కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మం డల పరిధిలోని దివిటిపల్లి గ్రామంలో బడి పిల్లలకు సన్నబియ్యం భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శినితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో చిన్న చిన్న లోటుపాట్లను సవరించి ప్రజలు పారదర్శకమైన సేవలందిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నదన్నారు. రైతు, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 60వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దివిటిపల్లి గ్రామంలో మౌలిక సదుపాయా కల్పనకు కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డుల ద్వారా లబ్దిదారులకు 6 కేజీల చొప్పున బియ్యం అందజేస్తున్నదన్నారు. అంగన్వాడీల్లో గర్బిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వపరంగా లబ్దిపొందేందుకు లబ్దిదారులు దరఖాస్తులు చేసుకుంటే పరిశీ లించి అర్హులకు అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కోసం అవసరమైన ప్రతిపాదనలు పం పాలని అధికారులకు సూచించారు. అ నంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ హన్మంతురెడ్డి, తహిసీల్దార్ అమరేందర్, ఎంఈఓ వెంకట్రాముడు, సర్పంచ్ పాం డురంగారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు పాలమూరు భారీ ర్యాలీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శనివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్‌గౌడ్, సింగిల్‌విండోచైర్మన్ వెంకటయ్య, ఆనంద్‌గౌడ్, ఇంతియాజ్, చందర్పాటిల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెట్టుగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ న్యూటౌన్, బస్టాండ్, వన్‌టౌన్,గడియారం చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు కొనసాగుతుందన్నారు. -
జాగ్రత్తలతోనే రాజధాని భద్రం
పెను తుపాను వస్తే మన పరిస్థితి ఏమిటి! విశాఖలో బీభత్సంతో జిల్లావాసుల ఆందోళన ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నష్టం తప్పదంటున్న నిపుణులు గుణపాఠాలు నేర్వని పాలకులు విపత్తులను తట్టుకునేలా రాజధాని నిర్మించాలని హితవు సాక్షి, విజయవాడ: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖ మహా నగరాన్ని హుదూద్ తుపాను అతలాకుతలం చేసింది. ప్రశాంతతకు మారుపేరైన సాగర నగరంలో అల్లకల్లోలం సృష్టించింది. ప్రస్తుతానికి మన జిల్లాకు ముప్పు తప్పినా భవిష్యత్తులో ఇటువంటి ప్రకృతి బీభత్సకాండ ఎదురైతే పరిస్థితి ఏమిటీ.. నవ్యాంధ్ర రాజధాని బెజవాడ ఎలా తట్టుకుంటుంది.. అనే అంశంపై సర్వాత్రా చర్చ సాగుతోంది. గతంలో అనేక విపత్తులు సంభవించినా పాలకులు, ప్రజలు ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో హుదూద్ వంటి పెను తుపాను కృష్ణా జిల్లా తీరంలో కేంద్రీకృతమైతే 1977లో వచ్చిన దివీసీమ ఉప్పెన కన్నా తీవ్రమైన ఘోరకలి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం నూతన రాజధాని నగరాన్ని అయినా విపత్తులను తట్టుకునేలా సమగ్ర ప్రణాళికతో నిర్మించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. విజయవాడలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెను ప్రమాదాలను నివారించవచ్చని చెబుతున్నారు. ఇన్ని జరిగినా గుణపాఠాలు నేర్వరా...! విజయవాడ కృష్ణా నదిని ఆనుకుని ఉంది. జిల్లాలో 120 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరం వెంబడి నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, మచిలీపట్నం, బంటుమిల్లి, కృతివెన్ను తదితర మండలాల పరిధిలోని 53 రెవెన్యూ గ్రామాలు, 130 శివారు గ్రామాల్లో 88,255 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వీరిలో అత్యధికంగా మత్స్యకా రులే ఉన్నారు. తుపాను వచ్చిన ప్రతిసారీ విజయవాడలోని కృష్ణా నది, బుడమేరు పక్కన నివసించేవారితోపాటు తీరప్రాంత వాసులు ఆస్తి నష్టపోతున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1977లో దివిసీమ ఉప్పెన కారణంగా సుమారు లక్షన్నర మంది ప్రజలు చనిపోయారని అంచనా. అప్పట్లో సుమారు రూ.250 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. జనజీవనం సాధారణ స్థితికి రావడానికి ఏడాది పైగా పట్టింది. గత ఎడాది హెలెన్, లెహర్ తుపానుల వల్ల జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో రూ.200 కోట్ల విలువైన పంట నష్టం వాటిల్లింది. తీర ప్రాంతాల్లోని అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. 2008లో కృష్ణా నదీకి వరద రావడంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. 13 లోతట్టు ప్రాంతాలు వారం రోజులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు పడవల ద్వారానే రాకపోకలు సాగించాల్సి వచ్చింది. మరోవైపు 13 డివిజన్లలో రెండు లక్షల మందికి పైగా కొండలపై ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. బుడమేరుకు వరద వస్తే రాజరాజేశ్వరీపేట, పాయకాపురం, ప్రకాష్‌నగర్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. కృష్ణా నదికి వరదలు వచ్చిన ప్రతిసారి ఇక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. అయినప్పటికీ మన పాలకులు ఇప్పటివరకు గుణపాఠం నేర్చుకోలేదు. ముప్పు నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇలా చేస్తే మేలు.. నూతన రాజధానితోపాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇక నుంచి అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెను ముప్పును నివారించే అవకాశం ఉంది. భవన నిర్మాణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విపత్తులను తట్టుకునేలా ప్రమాణాలు పాటించాలి. ప్రమాణాల విషయంలో పరిశ్రమలు రాజీ పడకూడదు. ఎక్కువమంది ప్రజలు పనిచేసే సంస్థలు రక్షణ చర్యలు విధిగా పాటించాలి. డ్రెయినేజీ వ్యవస్థను పక్కాగా రూపొందించాలి. కరెంటు స్తంభాల స్థానంలో భూగర్భ లైన్లు ఏర్పాటుచేయాలి. దీనివల్ల స్తంభాలు కూలిపోయి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండదు. ఇదే తరహాలో టెలిఫోన్ కేబుల్ వ్యవస్థను కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తే మంచిది. సెల్‌ఫోన్ టవర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తే మేలు. సాధ్యమైనంత వరకు జనావాసాల మధ్య లేకుండా చూడాలి. హోర్డింగ్‌ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నాసిరకం ఇనుము వాడకుండా నిర్దేశిత ప్రమాణాలు పాటించేలా చూడాలి. కృష్ణా నది వెంబడి పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించాలి. బుడమేరులో ఆక్రమణలను తొలగించి ఎప్పటికప్పుడు పూడిక తీయాలి. తద్వారా నీరు సక్రమంగా పారుతుంది. ముంపు సమస్య తొలగిపోతుంది. జిల్లాలోని తీర ప్రాంతాల్లో శాశ్వత తుపాను రక్షిత కేంద్రాలను నిర్మించి, వాటిని నిత్యం పర్యవేక్షిస్తుండాలి. తద్వారా విపత్తుల సమయంలో ప్రజలకు వీటిలో ఆశ్రయం కల్పించవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటించని సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహించే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విషయంలో ఉదాసీనంగా వ్యవహరించరాదు. -
వైఎస్సార్సీపీ ఆందోళన షెడ్యూల్ ఖరారు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం మరింత వేడెక్కనుంది. మహాత్ముని జయంతి రోజైన అక్టోబర్2 నుంచి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరగనున్న సమై క్య ఉద్యమ షెడ్యూల్ ఖరారయింది. తెలుగువారం తా ఒక్కటిగా ఉండాలన్న జనావళి ఆకాంక్షలకు అ ద్దం పట్టేలా, ఉద్యమ సెగ పాలకులకు, ప్రతిపక్ష నేతలకు సోకే విధంగా తమ కార్యక్రమాలు ఖరారయ్యాయని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ సమైక్యాంధ్ర ఉద్యమ కార్యక్రమ కో-ఆర్డినేటర్ బుచ్చి మహేశ్వరరావు ఆదివారం విశాఖలో ప్రకటించారు. మొదటి నుంచీ సమైక్యవాదాన్ని ధైర్యంగా వినిపిస్తున్న వ్యక్తి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్న సంగతి అందరూ గుర్తుంచుకోవాలన్నారు. నెల రోజుల పా టు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా విజయవంతం చేయాలన్నారు. ఇవీ ముఖ్య ఘట్టాలు =అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు, ఇతరుల నిరవధిక నిరాహారదీక్షలు, అనంతరం రిలే నిరశనలు. =4న గుంటూరు నుంచి విజయవాడ వరకూ నిర్వహించే ట్రాక్టర్ ర్యాలీలో అందరూ పాల్గొనాలి. =7న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ వారి ఇళ్ల ఎదుట శాంతియుత ధర్నాలు. =10న అన్ని మండల కేంద్రాలలో రైతులతో దీక్షలు. =17న అన్ని నియోజకవర్గాల్లో ఆటోలు,రిక్షాలతో భారీ ర్యాలీలు. =26న జిల్లాలోని సర్పంచ్‌లు, సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులతో జిల్లా కేంద్రాల్లో ఒక రోజు దీక్ష. =29న అన్ని నియోజక వర్గా కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో కార్యక్రమాలు. =నవంబర్ 1న నియోజక వర్గాల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, సమైక్యాంధ్ర కోరుతూ తీర్మానాలు ప్రవేశపెట్టాలి.