చంద్రబాబు గద్దె దిగాలంటూ
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన ఆందోళనలు
జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు
నియోజకవర్గ కేంద్రాల్లో దిష్టిబొమ్మల దహనాలు
నీతిమాలిన చంద్రబాబును అరెస్ట్ చేయాలంటూ నినాదాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓట్లను కొనుగోలు చేసేందుకు కుట్రపన్ని అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మిన్నం టాయి. సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని కోరుతూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడుగడుగునా నిరసనలు హోరెత్తాయి. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు.. ఇలా వివిధ రూపాల్లో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. పూటకో వ్యవహారం, రోజుకో ఆడియో టేపు బయటపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు తక్షణమే సీఎం పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. నిత్యం పారదర్శకత, నిజాయితీ కబుర్లు వల్లెవేసే బాబు అసలు రూపం బట్టబయలైనచ నేపథ్యంలో టీడీపీ బాస్ ఇప్పటికైనా తప్పులు ఒప్పుకుని తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలంటూ నినదించారు.
కొత్తపల్లి ఆధ్వర్యంలో
భారీ రాస్తారోకో
చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నరసాపురం బస్‌స్టేషన్ వద్ద పెద్దఎత్తున రాస్తారోకో చేపట్టారు. తొలుత రుస్తుంబాద నుంచి బస్‌స్టేషన్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, పార్టీ నేతలు కొత్తపల్లి నాని, సాయినాథ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శేషుబాబు నేతృత్వంలో బాబు దిష్టిబొమ్మ దహనం
పాలకొల్లు గాంధీబొమ్మల సెంట ర్‌లో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం చంద్రబాబుకు ఏమాత్రం సిగ్గున్నా వెంటనే పదవికి రాజీనామా చేసి తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలని శేషుబాబు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుణ్ణం నాగబాబు, మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై నిరసన
ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) ఆధ్వర్యంలో ఉంగుటూరు వద్ద జాతీ య రహదారిపై నిరసన చేపట్టారు. ఆ తర్వాత హైవే పక్కనే ఉన్న ప్రదేశంలో భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన నేతలు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. స్టీఫెన్‌సన్‌తో సంభాషించి అడ్డంగా దొరికిన చంద్రాబాబును వెంటనే అరెస్ట్ చేయాలని నినదించారు.
ఫైర్‌స్టేషన్ సెంటర్లో ధర్నా
ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహిం చారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాస్, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొద్దాని శ్రీని వాస్, కార్పొరేటర్లు బండారు కిరణ్‌కుమార్, కర్రి శ్రీను, మహ్మద్ ఇలియాస్ పాషా, వేగి చిన్నప్రసాద్, శిరిపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.
కొవ్వూరులో..
కొవ్వూరులో ఆర్డీవో కార్యాలయం ఎదుట పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిం చారు. సీఎం చంద్రబాబు తక్షణం పదవికి రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నిడదవోలులో ధర్నా, మానవహారం
నిడదవోలులో నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎస్.రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. పార్టీ సీనియర్ నాయకుడు జీఎస్ రావు పాల్గొన్నారు. తొలుత ర్యాలీగా వచ్చి మానవహారం నిర్వహించారు.
మార్టేరులో మిన్నంటిన నినాదాలు
పెనుమంట్ర మండలం మార్టేరులో పార్టీ సీఈసీ సభ్యుడు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొని సీఎం రాజీనామా చేయాలని నినదించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్ పాల్గొన్నారు.
చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం
పోలవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆందోళనలు చేపట్టారు. జీలుగుమిల్లి, టి.నరసాపురం మండల కేంద్రాల్లో సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. జీలుగుమిల్లిలో జరిగిన ధర్నాలో పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గోపాలపురంలో మానవహారం
గోపాలపురంలోని వైఎస్సార్ జంక్షన్‌లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు మానవహారం చేపట్టారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
సర్కారు దిష్టిబొమ్మకు నిప్పు
తణుకులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్రి కాశిరెడ్డి, ప్రచార కార్యదర్శి పెన్మత్స రామరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెంలో...
జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంట ర్‌లో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అవినీతి పాలన నశించాలని, చంద్రబాబు రాజీనామా చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ఘంటా మురళీ రామకృష్ణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ పాల్గొన్నారు.
దెందులూరులో..
దెందులూరు, పెదవేగి మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహించారు. దెందులూరులో మండల నాయకులు బొమ్మనబోయిన నాని ఆధ్వర్యంలో, పెదవేగి మండలంలో మండల కన్వీనర్ మెట్టపల్లి సూరిబాబు, న్యాయంపల్లి ఎంపీటీసీ పి.సత్యనారాయణ సారధ్యంలో ధర్నాలు చేపట్టారు.
మోషేన్‌రాజు నాయకత్వంలో..
ఉండిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. మోషేన్‌రాజు మాట్లాడుతూ ఏడాది కాలానికే తెలుగుదేశం ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని విమర్శించారు.
దద్దరిల్లిన భీమవరం
భీమవరం తహసిల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున ధర్నా నిర్వహిం చారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పేరిచర్ల విజయనరసింహరాజు, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లు నరసింహమూర్తి, వీరవాసరం జెడ్పీటీసీ మానుకొండ ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యం వహించారు.
తప్పుకో బాస్
Published Wed, Jun 10 2015 12:41 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement