రాజమండ్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు మంగళవారం ధర్నా చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరంలో వైఎస్ఆర్ సీపీ నేత కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో సీఎం ఎందుకు నోరు మెదపటం లేదంటూ ఆయన ప్రశ్నించారు.