‘ఆ పోస్టులతో వైఎస్సార్‌సీపీకి సంబంధం లేదు’  | YSRCP given the clarity about Social Media Posts issue | Sakshi
Sakshi News home page

‘ఆ సోషల్‌ మీడియా పోస్టులతో వైఎస్సార్‌సీపీకి సంబంధం లేదు’ 

Published Wed, May 16 2018 4:02 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

YSRCP given the clarity about Social Media Posts issue - Sakshi

సాక్షి, అమరావతి:  తమ పార్టీ కార్యకర్తలుగా, సానుభూతిపరులుగా ప్రచారం చేసుకుంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులతో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇలా పార్టీ పేరు ఉపయోగించుకుని సోషల్‌ మీడియాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను గుర్తించినట్టు ఆ పార్టీ పేర్కొంది.

సోషల్‌ మీడియాలో వారు పెడుతున్న పోస్టులకు గానీ, జగన్‌ కోసం.. అంటూ వారు నిర్వహిస్తున్న వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌ బుక్‌ పోస్టులతో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ స్పష్టం చేసింది. ఇలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న ఇప్పాల రవీంద్రారెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, యశ్వంత్‌రెడ్డి, ఆనం నరేంద్రరెడ్డి, ఎ.సతీష్‌రెడ్డితో తమ పార్టీకి సంబంధంలేదని వెల్లడించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement